కష్టమే శివ నామాన్ని నాకు దగ్గర చేసింది
సుఖం ఎప్పుడూ చివరికి
కష్టం గా మారిపోతోంది
నా ఎరుక లేకనే కాలం మారిపోతోంది-
Inspirational speaker
A great writer
Completed msc.psychology
I believe in myse... read more
మనసు ఎంత గొప్పది కాక పోతే
కోరుకున్నవి చేరుకున్నట్లు
నవ్వుకుంటుంది
ఏ వేళ అయినా-
కష్టం అనుభవించడానికే పుట్టిన అని తెలియక సుఖాల కోసం ఎదురు చూస్తున్నా నేమో!?
నా తప్పే శివయ్య-
మీరే శివుడను మాటను మళ్ళీ నిజం చేస్తూ
శివుడి తో పాటుగా శివుడి గా
వెలుగుతూ ఉన్నారు
శివా!
శివా! అనుటలో ఆనందాన్ని వెతికే పనిలో ఉన్నారు
శివుడే మీరు
శివమను మాటను
నాలో అనునిత్యం నిలిపే
శంకర రూపమే మీరు
ఇన్నాళ్ళ నిరీక్షణకు అర్థం మీరే-
గురువుల మనసులను గుర్తు ఎరిగిన
పిలుపులను నవ్వించిన ప్రియ నేస్తాలు
-
తమకు వరముగా అందిన ఓ అవకాశం ఇది
పదండి బాధ్యతకు స్వాగతం పలకాలి మీరే
పదోన్నతి పొందిన ఆనందం మరువ లేనిది
ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసిన కల తీరిన క్షణాలను
తలుచుకుంటూ మిమ్ములను మీరు ఏపూటకాపూట మెరుగు పరుచుకుంటూ
అనుక్షణం ఎదురయ్యే కొత్త సవాళ్లను దాటుకుంటూ
మీ ఓపికకు సర్ది చెప్పుకుంటూ
విద్యార్థుల శ్రేయస్సు కోసం పరితపిస్తూ
ముందుకు వెళ్తున్నారు
ఒక ఏడు గడిచింది చిటికెలో
మీ తోడుగా మీరే ఉన్నారు
ప్రతి రోజూ పెట్టే పరుగులకు
పరుగులు నేర్పిన నేస్తాలుగా
ధైర్యాన్ని పంచే మార్గాన్వేషకులుగా-
సమయానికి తెలియదు
నీ సత్తా నీకే తెలియును కదా
నీతో సై అంటె సై అంటున్నది సమయం
అనుక్షణం కాచుకుని ఉన్నది నీకై
నాతో పోటీ పడతావా అంటూ-
ఇంకెవరో రావాలని ఏదో నీ దగ్గర లేదని
అనుకోకు కలనైనా
నీకు నువ్వు చాలును మొదలెట్టు ఇక
నువ్వే మారాలి
అది యుద్ధం ఐతే ఖడ్గం గా
ఓటమి ఐతే ఓర్పుగా
గెలుపంటే ఏమంటే నీ పేరే మ్రోగాలి
సమయానికి ఏం తెలుసు? నీ సత్తా ఏమిటో?
లే ముందుగా ఇంకా దేనికి భయం?
అవమానం నిన్ను వెనక్కి లాగితే
బాణం లా దూసుకుపోవాలి మరువకు
అవకాశం ఎలా నిన్ను వెతుకుతూ చేరుతుంది?
ఓటమి ఏదైనా నీ అనుభవమై తీరుతుంది
కొత్త మార్పులు ప్రేరణ ఐతే ప్రతి క్షణం చేరును
నిన్నే
ఎప్పటికప్పుడు ఓపికతో ముందుకు సాగాలి
ఉన్నదేదో పంచుకుంటూ పలువురి కోసం
బ్రతకాలి
-
నీ దంటూ ఏం లేదని తెలిసే లోపే
కాలం వెళ్ళిపోయింది ఇక మళ్ళీ రాదు
ఎంతైనా పోనీ ఏదైనా రాని పర్వా లేదు
ఏదైతే ఏమున్నది తేడా? నీకంటూ ఉన్నది నీవే
ఆలోచిస్థూో కూర్చునే అవకాశం లేదు
సరే పోనీ అనుకునే తీరిక లేదు
లే పద పద నీవున్నది నడి రేయిలో
తూర్పును వెలిగించే అగ్ని దీపంలా మారుతూ
మళ్ళీ చీకటి ముసిరితే చల్లని చంద్రుడి గా చేరుకో
గతం గొంతుకను సవరించు ఒక్కసారి
ఓటమిని ఒప్పుకొనివ్వకు సరే పద
పడిపోతే పోయేది ఏముంది?
లేచి నిలబడితే నివ్వెరపోదా లోకం ?
ఆగిపోయే ఆలోచనే లేనప్పుడు
అవమానం నిన్ను బెదరనివ్వదు
నవ్వే వాళ్ళను వారించలేము
ఆపే వాళ్ళని వద్దనలేము
నిన్ను తెలిసిన వారు ముమ్మాటికీ తోడు నిలుస్తారు
అందరూ నీ వారు ఎన్నటికీ కారు
కొందరే ఉంటారు నీ వెంట నీడగా
నిన్ను నీవే కోల్పోయిన వేళ
నీ కన్నీరును తుడిచేను నీ చేతులే
ఎవరికి వారై పోయి వేరుగా ఉన్నారు అంతా
ఎవరేమి అనుకుంటారో అని భ్రమ ఇంకెన్నాళ్ళు?
ఒంటరి గా పుట్టలేదా? ఒక్కడివే నడవలేదా?
నీవే నేర్చుకోలేదా? ఎన్నో ఓర్చుకో లేదా?
ఇప్పుడేంటీ కొత్తగా ఎదురు చూపులు ఎందుకు?-