కొందరి పరిచయం
కొందరికి ఖేదం
మరి కొందరికి మోదం
కాని
కరోనా అంటే అందరికీ కంగారే!..
..పోల్సాని..-
అభయం
భయం భయం భయం
అందరిలో భయమే అంతటా భయమే
అభయమిచ్చె నాధుడికై
అందరిదీ ఎదురుచూపె..
మహమ్మారి వైరస్ లను
మటుమాయం చేయనెంచి
మనమంతా ఒక్కటై
మందులు కనిపెట్టేందుకు..
కుల,మత,జాతి బేధాలను
విస్మరించి అడుగేసి
మనుషులంత ఒక్కటనీ
మరోసారి నిరూపించ..
అడుగు ముందుకేసి
అభయమివ్వు లోకానికి....
...పోల్సాని...
-
తరువిచ్చును శాఖలెన్నొ
తనువును విడదీసి మనకు
తరుణీ మణి పంచిచ్చును
ధరణి యందు తన తనువును...-
"అమ్మ"ల పండుగ రోజు
అన్నింటిని మించినది
కమ్మనైన అమ్మ పలుకె
అవనిలోని జీవులకు
అమృతం ఆ మాటే!...
..పోల్సాని...-
వలస జీవుల వదనాన
వన్నె తగ్గే నేడు
కరోనా వైరస్ కబళించగానే..
కూడు గూడు లేని కడుపేదలందరూ
దూర భారమైన భారమనక నెంచి
కాలినడకనే వాళ్లు కదిలి పోతున్నారు..
పుట్టిన చోటే గిట్టినా మంచిదని
పుట్టెడు దుఃఖాన్ని పుక్కిట బంధించి
పుర వీదులకు వాళ్లు వీడ్కోలు పలికే..
....పోల్సాని..
-
నీ తలపులు
వలపులు పంచిన ప్రేయసీ
నీ తలపులతోనే ఉన్నాను
కరుణ చూపి నను కటాక్షించి
నీ కౌగిలిలోనే బంధించు...
...పోల్సాని..
-
చిరునవ్వు చెరిగిపోయె
నిరుపేద జీవితాన..
వేదనే మిగిల్చింది
కరోనా మహమ్మారి...
...పోల్సాని..-
వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది..
వ్యవస్థ కంటే దేశం గొప్పది..
దేశం కోసం ఏమిచ్చినా తక్కువే!...
...పోల్సాని....-
ఎంత విచిత్రం..
కంటికి కనిపించని కరోనాకు భయపడి
కాలమాగకున్ననూ ఆగింది లోకం..
పస్తులున్నా సరేనంటు పనులన్నీ మానేసే
దగ్గు జ్వరమంటే దరికి రాకంటుండె
సుస్తి చేసిందంటే చూసేందుకు రాకపోయె..
పక్కనెందరున్ననూ పలుకే కరువవుతుందని
ఊహించలేదెవ్వరు ఊహకైనా రాకపోయె
చిత్రం విచిత్రం జీవితమే చిత్రమాయె...
...పోల్సాని....
-
అదృశ్య శక్తి
అదృశ్య శక్తి ఏదొ ఆవహించె అవనినీ
అతలాకుతల మవుచుండె అవనియందు జనులు..
సామాన్యులైననూ దేశాధినేతలైన
తలవంచక తప్పదంటు తరుముతుండె నందరినీ..
బాంబులు అణుబాంబులంటు అధిలించిన అధినేతలు
హాహాకారాలు చేస్తూ కునారల్లి పోవుచుండె..
ఆదుకునే శక్తి కొరకు అందరూ వెతుకుచుండె
అందాకా మనమంతా ఉందాము ఇంటిలోనె...
...పోల్సాని...-