ఎదుటి వ్యక్తిని విమర్శించడం చాలా తేలిక ఈ సమాజానికి....
అదే సమాజానికి ఏదుటి వ్యక్తిని ప్రోత్సహించడం చాలా కష్టం...
ఎదుటి వారిని విమర్శించడం వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు..
ఎదుటి వ్యక్తిని ఒకసారి ప్రోత్సహించి చూడు ఆ ప్రోత్సాహం అతని విజయానికి మార్గదర్శకం అవుతుంది.ఆ ప్రోత్సాహం లో అతని ఆనందం తో పాటు నీ ఆనందం కూడా కలిసి ఉంటుంది.
-
నాకు సహజమే ఈ జీవితం!!
నాకు సహజమే శత్రువులతో మాట్లాడటం
నాకు సహజమే శత్రువులకు మంచి చేయటం..!
నాకు సహజమే మిత్రులతో పోట్లాడటం
నాకు సహజమే మిత్రులతో విడిపోవటం ..!
నాకు సహజమే మళ్ళీ ఆ మిత్రువులతో మాట్లాడటం
నాకు సహజమే ఈ జీవితం..!!
నాకు సహజమే...
మీ.. పరశురామ్-
స్వార్ధపు మనుషుల మధ్య బ్రతుకుతున్నాము..
డబ్బు,
అవసరం,
అవకాశం,
వీటికి మాత్రమే అక్కడ విలువ......
ప్రేమ,
స్నేహం,
బంధం,
రాదేది అక్కరకు చివరి వరకు...
స్వార్ధమే వారి జీవన చక్రము........
మీ...పరశురామ్-
అప్పటి మన బాల్యంలో
కష్టాల కొరతలు ఎన్నిఉన్నా
ఇప్పటికీ ఆ అందమయిన
అనుభూతులను ఆస్వాదిస్తూనే
ఉంటాము,
దీపాలవేళ కోవెల్లో అయ్యవారు పెట్టె చక్కర పొంగలంత కమ్మని
బాల్యం అది,
ఆరుబయట పడకల్లో ఆదమరచి
నిద్రించిన అలసటలేని బాల్యమది
పండువెన్నెల్లో అమ్మ చేతి
గోరుముద్దలకయి కొట్లాడుకొన్న
బాల్యం అది,
పనులు పంచుకొన్న బాల్యమది,
వర్ణపు, వర్గపు తేడాలు లేని
బాల్యమది,
గెలుపోటములని నవ్వుతూ
స్వీకరించిన బాల్యమది. 😊😊-
స్వచ్ఛమైన ప్రేమకెన్ని ఆంక్షలో
ఎంత నరకమో ఎదురుచూపులో
ఎండబెట్టకని ఎంతలా అర్థించాలో
తీరా నువ్వు మాట్లాడే సమయంలో
ఏం మాట్లాడాలో తెల్వని ఆనందంలో
గొంతు మూగబోయే అయోమయంలో
నీపై నాకున్న ప్రేమను నీకెలా తెలపాలో
తెలిసి తెలియని నేనొక వెర్రి బాగురాలిని అన్ని
అర్ధం చేసుకుని "నువ్వే" ఆదరించాలోయ్...-
గొప్ప చదువులు చదివిన.
గొప్ప ఆలోచన లేని వాడు,
ఎంత సంపాదించినా ఆసంతృప్తిగానే ఉంటడు..-
🍁మనిషి పతనానికి కారణాలు.🍁
అహంకారం, గర్వమేనని మన పెద్దలు
అనుభవఙ్గన్లులు పురాణాలు, చెబుతున్నారు.
రావణుడు తన అహంకారం వల్లే రాముడి చేతిలో హతమయ్యాడు.
పాండవులతో అహంకారంగా వ్యవహరించడం వల్లనే కౌరవులు నాశనమయ్యారు.
శిశుపాలుడి అహంభావమే అతడికి యమపాశమైంది.
👉తన గురించి తాను గొప్పగా ఆలోచించడం ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి తప్పులను వెదకడం అహంకారుల లక్షణం.-
సహనం మనకుంటే సకలం మనదే...
వినయం మనకుంటే విజయం మనదే...
ఓర్పు కోల్పోతే సర్వం కోల్పోతాం...
ఓర్పు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది...
-
రాసిన అక్షరం తప్పయితే దాని దిద్దొచ్చు...! కానీ జీవితమే తప్పయితే దాన్ని దిద్దడం చాలా కష్టం......!! అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచి తూచి వేయండి.
-
sorry, ego రెండు పదాలు ఎన్నో అర్థాలాకు దారి తీస్తుంది
Sorry అనే పదం ఎన్నో బంధాలను కలుపుతోంది ...
Ego అనే పదం ఎన్నో బంధాలను విడగొడుతుంది...-