Neeharika Korrapati  
4 Followers 0 Following

Joined 15 December 2018


Joined 15 December 2018
18 JUN 2020 AT 23:15

అలా బాల్కనీలో, గ్రిల్స్ మీద అంతా సిద్ధం చేసి కూర్చొని, పాటలు వింటూ.. నాలో నేనే పాడుకుంటూ.. మనకి మనమే ఒక గాయనీగాయకులలా అనుభూతి పొందుతూ ఉండగా... సరే సరే ఇక చాలు అన్నట్లుగా, వర్షపు చినుకు వచ్చి నుదిటిపై ముద్దు పెట్టగానే... అలా తెలియకుండానే తల బయటకి పెట్టి, తడిచి తడవనట్టు తడుస్తూ... మనలోని గాయకుడు కవిగా మారి చుట్టూ ఉన్న అందాలను వర్ణించడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. చల్లటి గాలి అలా అలా తగులుతూ, నవ్వుతూ కవ్విస్తూ ఉండగా.. మనలోని కవి చుట్టూ ఉన్న అందాలని ఆస్వాదించడానికే పుట్టినట్టు, చూస్తూ ఉండిపోయే ఈ క్షణం... 😍
ఈ క్షణం ఇలానే ఆగిపోతే చాలు అని కోరుకుంటున్న హృదయం ❤️

-


12 MAR 2020 AT 10:02

నమ్మకం

బంధానికి తొలి అడుగు నమ్మకం

ఒక మనిషిని ఉన్నతమైన స్థానం లో ఉంచేది నమ్మకమే... పడేసేది ఆ నమ్మకమే

ఏ బాధని అయినా బలపరిచేది నమ్మకమే... తెంచేది ఆ నమ్మకమే

జీవితం లో బ్రతకాలి అని ఆశ పెంచేది ఆ నమ్మకమే... ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన తెచ్చేది మనుషుల పైన పోయిన ఆ నమ్మకమే

-


1 MAR 2020 AT 23:19

ప్రేమ అంటే ఏంటి??

అమ్మ, నాన్న ఏదైనా అనగానే దూరం వెళ్ళిపోవాలి అనుకుంటాము కాని వెళ్ళలేము.. మనం ఎవరినైనా మర్చిపోయి దూరం వెళ్ళాలి అని అనుకున్న వెళ్ళలేము..బహుస అదే ప్రేమ ఏమో!

అమ్మ, నాన్న ఎందుకు వచ్చారు మా జీవితం లోకి అని అన్న పట్టించుకొము..మనం ఇష్టపడే వాళ్ళు అలా అన్న పట్టించుకోము..ఎందుకంటే వాళ్ళకి మనతో ఉండటం ఇష్టం అని మనకి తెలుసు కాబట్టి...బహుస అదే ప్రేమ ఏమో!

మనల్ని వాళ్ళు ఎంత బాధ పెట్టిన..అన్ని లోపల పెట్టుకొని బయటకి నవ్వుతూ మాట్లడతాము..బహుస బాధని ఆనందం గా చూపించేదే ప్రేమ ఏమో!

మనం నవ్వుతూ మాట్లాడిన.. లోపల బాధ ని కనిపెట్టేస్తూ ఉంటారు..బహుస మన కళ్ల లోని భావాలను అర్ధం చేసుకోవడమే ప్రేమ ఏమో!

అమ్మ, నాన్న మనతో జీవిత కాలం ఉండరు, వాళ్ళు మనతో ఉండరు ఏమో అన్న ఆలోచన మనని బాధ పెట్టిది..బహుస ఆ బాధే ప్రేమ ఏమో!

-


4 MAY 2019 AT 9:56

అమ్మ

అమ్మ అంటే రెండు అక్షరాలే.. కానీ వాటి వెనుక బంధం, ప్రేమ, బాధ్యత అలా ఎన్నో పదాలు ఉన్నాయి..

కోడి కుస్తే తెల్లారిద్ది, అల్లారం మోగితె తెల్లారిద్ది అంటారు కాని నాకు మాత్రం అమ్మ లేపితెనే తెల్లారిద్ది

బిడ్డ ఆకలి అమ్మ కి తెలుస్తది అంటారు.. మరి అమ్మ ఆకలి మనకి ఎప్పుడు తెలుస్తోందో...

ప్రపంచంలో పంచబుతాలు ఎలా ఇమిడిపోయాయో మనలో అమ్మ అనే "Emotion" కూడ అలానే ఇమిడిపోయింది... ఎంత ల అంటే చిన్న బాధ కలగానే అమ్మ అనే emotion బయటకి వచ్చేసిద్ది..

నీ పెదాలపైన చిరునవ్వు కోసం మేము ఎప్పుడు ఏది అయినా చేస్తాము.. అది ఎప్పటికీ అలానే ఉండాలి అమ్మ.. దానికి విలువ కటలేము..

Emotion, ప్రేమ ప్రతిసారి చూపియక పోవచ్చు కాని అవి ఎక్కడికి పోవు... పిల్లలు తప్పు చేస్తే క్షమించే గుణం అమ్మ కి ఉంటది కదా.. అలా ఎన్ని సార్లు తప్పు చేస్తే క్షమించావో😘.. లవ్ యు అమ్మ ❤️❤️

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 😘😘💟💛

-


6 FEB 2019 AT 10:56

చిరునవ్వు..!

చిరునవ్వు ఎన్నో జీవితాలకు హరివిల్లు

ఒక్క చిన్న పాప పెదాల పైన విరజిల్లే చిట్టి చిరునవ్వు చాలు మనం ఎన్ని బాధల్లో ఉన్న హాయిగా ఆ క్షణం మైమరిచిపోవడానికి

చిరునవ్వు కి పేద, ధనవంతుడు, దలితుడు, ఈ కులం, ఆ కులం అని భేేదాలు ఏమి ఉండవు.. ఏ భేదాలు లేకుండా ఎప్పటికి అందరికి తోడు నీడ గా ఉండే బంధువు చిరునవ్వు

ఎంతమందికి పంచిన తరగని ఆస్తి చిరునవ్వు

మన బాధ ని ఎవరికి చూపించకుండా దాచేసేది ఆ చిరునవ్వే, మన సంతోషాని అందరికి తెలియజేసేది ఆ చిరునవ్వే.. చిరునవ్వు ఒక తీయటి మాయజాలం.

బంధాని పెంచాలి అన్న , మనసుని ప్రశాంతం గా ఉంచాలి అన్న , ద్వేషాని ప్రేమగా ఎదుర్కోవాలన్న చిరునవ్వు అనే వజ్రాయుధం కే సాధ్యం

-


28 JAN 2019 AT 22:01

"చినుకు"

చినుకు చాలా చిన్నది కాని వర్షని ఇష్తపడే వాల్లకి తెలుసు ఆ చిన్న చినుకు కొసం చూసే ఎదురు చూపు విలువ....

వర్షం మొదలయేటప్పుడు మన మీద పడే మొదటి చినుకుకి తెలుసు అ క్షణం మన మది పులకరిస్తుంది అని..

ఆ చినుకు ప్రవాహం ఎక్కువ అయినపుడు ఆ చినుకుకి తెలుసు మన పెదాల పై నిలిచే చిరునవ్వు విలువ..

చినుకు  అందం చూడాలి అంటే తామర ఆకు మీద చినుకు సేవతీరినప్పుడు చూడాలి దాని అందం బయట పడుతుంది..

గులాబి పువ్వు రెక్క మీద నుంచి వయ్యారంగా జారే చినుకుని అడుగు కొంపతీసి వయ్యారం అనే పదం అక్కడ నుంచే మొదలయింది ఏమొ...

-


26 JAN 2019 AT 11:05

E Desa charitra chusina
E munnadi, garva karanam?
Nara Jaathi charitra samastham
Parapeedana parayanatwam

అంటూ శ్రీ శ్రీ గారి కలం కదిలింది.. అప్పుడు కలం లో నుంచి జారి పడిన ఇలాంటి ముత్యాలు అయిన పద్యాలు వింటు ఉంటే.. మన లోపల ఉన్న దేశ భక్తి మన ప్రణయం లేకుండానే బయటకు వస్తుంది.. అది కలం యొక్క గొప్పతనం

దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపించిన ఎందరో మహానుభావులకి , స్వాతంత్య్ర సమరయోధులకి పాదాభివందనాలు

-


26 JAN 2019 AT 9:39

మన భాషా మన గౌరవం

తెలుగు అనగానే ఎక్కడో మరుగున పడుతున్న భాష అని లేదా మరుగున పడిపోయిన భాష అని వింటూ ఉంటాము..మనం చూసే విధానంలో మార్పు వల్ల అలా అనిపించి ఉండవచ్చు .. తెలుగు భాష మరుగున పడలేదు, మనతోనే ఉంది.. ఎప్పుడూ దాని స్థానంలోనే ఉంటుంది!

-


1 JAN 2019 AT 10:25

HELLEN KELLER -THE STORY OF MY LIFE

Ippudu mellaga a nalugu prashanallu veluguloki techukondi.. Vatiki samadanam melaga ardam ayindi meeke Helen Keller life gurinchi telusukunte.. Anne Sullivan vastu Helen keller ki gift ga doll techindi. Helen Keller adukuntunte, fingers moment tho doll ane padam nerpichindi.. Helen Keller can smell.. Smell tho, touch tho parents ni kanukuntadi.. Helen Keller ki teacher nachaledu.. Room ki lock vesi velipoyindi Helen... Paapam kada teacher :p .. Ilane chaala sarllu tapinchukodaniki prayatninchindi Helen teacher degara nunchi (enduku ante teacher force chestundi nerchukomani).. Ila kaadhu ani teacher inka Helen ni andariki duram ga uncharu.. Anne Sullivan (teacher) inka Helen matrame untaru akkada... Chaala padallu nerchukundi.. Chivariki w-a-t-e-r ane padam palikindi.. Touch chesi adi ento fingers moment tho chepadam modala petindi..

-


31 DEC 2018 AT 10:39

HELLEN KELLER -THE STORY OF MY LIFE

Helen keller example of determination, hardwork, inspiration.. June 27,1880 lo Arthur H. Keller(tandri), Katherine Adams Keller (talli) ane dampatulaku Tuscumbia, Alabama lo Helen Keller putindi.. Helen Keller putinapudu baane undi.. Sudden ga edo disease vachindi.. Deaf and blind ayindi, family doctor emo' brain fever' annaru.. Fever tagaka tanna mundhu evaru cheyi upina react avaledu, bell kotina react avaledu.. Chaala mandi doctors ki chupicharu ayina upayogam lEdu… “A teacher takes a hand , open up our mind and touches your heart ” anatu Anne Sullivan(3rd March, 1887)vachesindi andi

-


Fetching Neeharika Korrapati Quotes