పది సంవత్సరాలు కష్టపడిన ఒక నిరుద్యోగి పరీక్ష ఫలితాలలో గెలుపు కోసంఎదురుచూస్తున్నట్లు,తొమ్మిది నెలలు మోసిన తల్లి బిడ్డ ముసి ముసి నవ్వుల కోసం ఎదురుచూస్తున్నట్టు, అష్టదిగ్బంధన నుండి నిముక్తి కోసం,ఏడు రంగుల ఇంద్ర ధనస్సు నీకోసం ఎదురు చూస్తున్నట్టు,ఆరు పదులు అవ్వ నీకోసం ఎదురు చూస్తునట్లు,ఐదు దశాబ్దాల నీ జీవితం ఈ గెలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు,నలుగురు స్నేహితుల ఎన్నో ఏళ్ల కల నిజం అవ్వాలని,3 తరాల కుటుంబం నీ గెలుపుని ఆకాంక్షిస్తున్నట్టు,రెండు దశాబ్దాల భవిష్యత్తు కోసం నీ యీ ఒక్కడి విజయం..
-
చాలా మంది ప్రేమంటే పార్ట్ అఫ్ లైఫ్ అనుకుంటారు కానీ హార్ట్ అఫ్ లైఫ్ ఆగిపోయే అలజడి చేస్తూనే ఉంటది.
-
మనకంటూ రాసుకున్న రాజ్యాంగం లో మన హక్కు లను సవరించడానికి మన అనుకున్న వాళ్ళకిచ్చే అధికారమే "ప్రేమ "
-
మనిషి గొప్పగా ఎదగడం అంటే నలుగురు పనోళ్లని వెనకేసుకోవడం కాదు నలుగురి ప్రేమను పోగేసుకోవడం.
-
అందం ఉన్నచోట సబ్బుబిళ్ళ మెరుస్తుంది. ఆడపిల్ల ఉన్నచోట ఆనందం మురిసిపోతుంది.
-
సంతోషం స్వాగతించేలోపే, బాధ బంధించేస్తుంది.
మౌనం మాటాడేలోపే, మనసు మూగబోతోంది..-
జీవితాంతం గెలవాల్సిన అవసరం లేదు, జీవితాన్ని గెలిస్తే సరిపోతుంది.
-
ఈ భూ ప్రపంచంలో సూర్యుడు అందరికి ఒక్కడే అయినా ప్రాంతాన్ని బట్టి కొందరికి వేడి,మరికొందరికి చల్లదనం నచ్చుతుంది..అలాగే ఒక మనిషి ప్రదర్శించే బాగోద్వేహాలు బాధ,కోపం,ప్రేమ ఒక్కక్కరి మనసుకి ఒక్కోలా తాకుతాయి అది మనముండే పరిస్థితికి అనుగుణంగా..
-