Narahari Rao   (Narahari Rao Bapuram)
266 Followers · 171 Following

Joined 7 September 2019


Joined 7 September 2019
23 HOURS AGO

🍀☘️🍀 నరహరి నిత్య నిపఠము 🍀☘️🍀
9⃣6⃣0⃣
సముద్రం బయట నుంచి చూడటానికి ఎంత అందంగా కనబడుతుందో
అంతర్గతంగా ఎన్నో ఆటుపోట్లకు నిలయంగా ఉంటుంది...
బడబాగ్ని సముద్రగర్భంలో ఉంటుందంటారు.
జీవితాన్ని సముద్రంతో పోలుస్తుంటారు...
జీవనసంద్రం కూడా అన్ని రకాల సుఖసంతోషాలు
కష్టనష్టాల సంగమం అని చెప్పవచ్చు.
జీవితంలో కష్టనష్టాలు కానీ సుఖసంతోషాలు కానీ ఏవీ శాశ్వతంగా ఉండదన్న సత్యం నీవు తెలుసుకోవాలి.
ఏది ఎలా ఉన్నా... ఏదెలా వచ్చినా ప్రతిదాంట్లోనూ నీవు ఆనందాన్ని వెదుక్కోగలిగితే నీకు ఏదీ సమస్య కాదు.
చీకటి ఎంత కప్పేసినా ఆకాశంలో తారలు మెరుస్తూనే ఉంటాయి... భూమ్మీద మిణుగురు పురుగులు
తమ వంతు వెలుగును చిమ్ముతూనే ఉంటాయి.
నీవూ అంతే!... ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా
ఆ కాస్త సమయం ఓపికతో వ్యవహరించి
ఆత్మవిశ్వాసంతో నీదైన ఆత్మస్థైర్యంతో నీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకొని నీవు సంతోషంగా ఉండటమే కాక
చుట్టుపక్కల సంతసపు వెలుగులు పంచుతూ ఉండు.
✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము 05- 05- 2024

-


YESTERDAY AT 9:46

🍀☘️🍀 నరహరి నిత్య నిపఠము 🍀☘️🍀
9⃣5⃣9⃣
ప్రతి క్షణం నీవు అప్రమత్తంగా ఉండాలి... అన్ని విషయాల్లోనూ!
జీవనభృతికై నీవు ఏదో చేస్తూండవచ్చు...
అది నీకు ఇష్టం లేకపోవచ్చు...
పైగా అందులో ఆదాయమూ ఎక్కువ ఉండకపోవచ్చు.
అటువంటప్పుడు నీవు సరైన అవకాశాల కోసం
అనుక్షణం ఎదురుచూస్తూ ఉండాలి...
వచ్చిన అవకాశాలలో నీకు నచ్చినవి నీవు అందిపుచ్చుకోవాలి.
అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడమే కాక అవసరమైతే అవకాశాలను నీవే సృష్టించుకోవాలి.
అవకాశాలు నీ చేతికి వచ్చింతర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది.
వచ్చిన అవకాశాలను నీవు సరిగ్గా పట్టించుకోకపోయినా...
నీవు ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోకపోయినా...
నీవు వాటిని శాశ్వతంగా కోల్పోయినట్లే!
మళ్ళీ మళ్ళీ అటువంటి అవకాశాలు నీ చేతికి అందవు...
అందుకే నీవు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత పడు.
✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము 04- 05- 2024

-


3 MAY AT 12:15

🍀☘️🍀 నరహరి నిత్య నిపఠము 🍀☘️🍀
9⃣5⃣8⃣
విలువలతో కూడిన జీవితం నీదవ్వాలి.
విలువలు లేని జీవితం తెగిన గాలిపటంలాంటిది.
తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు వెళుతూ చివరకు ఎక్కడో కలిసిపోతుంది... నీ జీవిత గాలిపటం అలా నామరూపాల్లేకుండా నిరుపయోగం కాకుండా చూసుకో.
జీవితం కుదురుగా సజావుగా జరిగిపోవాలంటే నీవు దానికి కావలసినవి అన్నీ చక్కగా అమర్చుకోవాలి.
అన్నీ అమరిన జీవితం అనుకున్న రీతిలో సాగాలంటే నియమ నిబంధనలను నిబద్ధతతో అనుసరించి వెళుతుండాలి.
ఒక చెట్టు ఆకులనేవే లేక కేవలం కొమ్మ రెమ్మలతో ఉంటే బోడిగా అందవిహీనంగా ఎలా ఉంటుందో... విలువలు లేని జీవితం కూడా అలానే ఖాళీగా నిస్సారంగా ఉంటుంది.
అందుకే జీవితం అందంగా స్వారస్యంగా అర్థవంతంగా ఉండాలంటే విలువల వలువలను ధరింపజేసుకో!
✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము 03-05-2024

-


2 MAY AT 14:10

కథ : "ప్రేమభరితం"



రచన : నరహరి రావు బాపురం.

-


2 MAY AT 11:40

🍀☘️🍀 నరహరి నిత్య నిపఠము 🍀☘️🍀 9⃣5⃣7⃣
నీ జీవితావసరాలు తీర్చుకోవడానికి ఎవరి మీదా ఆధారపడవద్దు.
ఒకసారి ఆధార పడటం నేర్చుకున్నావంటే
బద్ధకం నిన్ను చేరి అది ఎప్పటికీ వదలి పెట్టదు.
సోమరితనం హెచ్చవుతుంది... ఎవరి మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నావో వారి చేత నానా మాటలు పడవలసి వస్తుంది.
సిగ్గూ ఎగ్గూ లేని జీవనం నీదవుతుంది.
అటువంటి భూమికి భారమై నిరర్ధకంగా బ్రతికే
జీవనమూ ఒక బ్రతుకేనా!?
మానవ జన్మ నీకు సిద్ధించిందంటే
అది అన్ని జీవరాశులలో ఉత్కృష్టమైనది...
అది నీకు ఆయాచితంగా లభించలేదని తెలుసుకో.
భూమిపై మనుజకులంలో పుట్టినందుకు
నీ జన్మను సాఫల్యం చేసుకొనే దిశగా పయనించు.
నీవేం చేయగలవో మొదట ఆ పనులు చేయడం ప్రారంభించు.
నీవు చేయలేననుకున్నవి కూడా చేయడానికి ప్రయత్నించు.
నీ కంఫర్ట్ జోన్ ను దాటి పనులు చేయడం ఆరంభించు.
ఆరంభం కొద్దిగా కష్టమవుతుంది కానీ ఒకసారి ఆరంభించాక ముందుకు దూసుకుపోవడం నీ చేతిలో పని... శుభమస్తు!
✍️నరహరి రావు బాపురం✍️అనంతపురము 02- 05- 2024

-


1 MAY AT 22:00

I love you...
I can't tell exact reason.


I love you so much...
I can tell every single reason
that you will be fed up of
asking why!?

-


1 MAY AT 21:52



How beautiful
the flower is!
So am I...
Still pretty!!

-


1 MAY AT 21:44

हाथी और चींटी
एक तो इतनी बडी
और एक इतनी छोटी
खूब मिली दोनों की दोस्ती
सारी जग में इक अनोखी।

-


1 MAY AT 11:14

జనన మరణాల మధ్యన
నిరంతరాయంగా ఊగిసలాడే
ఒక తూగుటుయ్యాలే
జీవితం.

-


1 MAY AT 10:25

🍀☘️🍀 నరహరి నిత్య నిపఠము 🍀☘️🍀 9⃣5⃣6⃣
నీ జీవితం అచ్చంగా నీది మాత్రమే!
నీకు అప్పనంగా అనాయాసంగా వచ్చింది కాదిది.
అందుకే నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకో.
నీ జీవితాన్ని ప్రేమించు...
అది లోకంలోని ప్రేమనంతటినీ నీకు అందిస్తుంది.
నీ జీవితం నీకు అర్థవంతంగా ఉండాలంటే
జీవితం పైన నమ్మకం ఉంచు...
అది ఏదిచ్చినా నీ మంచి కోసమేనని దాన్ని యథాతథంగా స్వీకరించు.
జీవితం నిన్ను కష్టనష్టాల కొలిమిలో పడవేసినా అది తాత్కాలికమేనని నిన్ను రాటుదేల్చడానికేనని జీవితంపైన విశ్వాసాన్నుంచు...
ఆ విశ్వాసమే నీకు కడదాకా శ్రీరామరక్షగా నిలుస్తుంది.
జీవితమొక వమ్ముకాని సత్యమని నమ్ము.
సత్యమెపుడూ నీకు తోడునీడగా ఉంటుందని...
సత్యాన్ని ఆశ్రయించడమే నీకు గౌరవమని...
సత్యమే నీకు చివరి వరకూ దారి చూపించే సూత్రమని...
నీ జీవితపయనాన్ని సుగమం చేస్తుందని నమ్ముతూ
సత్యం కానిదాన్ని ఎక్కడిక్కడ వదిలేస్తూ వెళ్ళు.
అప్పుడే నీదైన ప్రత్యేకమైన జీవితం
నిన్ను అన్నిటికంటే అనువైన దిశలోనే చేయి పట్టి నడిపిస్తుంది.
✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము 01- 05- 2024

-


Fetching Narahari Rao Quotes