Nani Quotes   (Mahesh Eppalapalli (Nani)
71 Followers · 2 Following

👉 #Nani 😘
🍫 #kitkat & #Munch
🎂 #november18 😘
💞 #LoveUAmma......😘😘
👨 #Single 💝
Joined 9 March 2020


👉 #Nani 😘
🍫 #kitkat & #Munch
🎂 #november18 😘
💞 #LoveUAmma......😘😘
👨 #Single 💝
Joined 9 March 2020
23 OCT 2024 AT 5:57

మౌనంగా ఉండటం
చేతకాని తనం కాదు..!
పట్టించుకోకపోవడం
పిరికితనం కాదు..!
అందరి మాటలకు స్పందిస్తే
ఒంటికి బురద, మనసుకు
బాధ తప్పే ఏమీ మిగలవు..!!
- 1+నాని✍️

-


22 OCT 2024 AT 5:47

బంధం ఎలా ఉండాలంటే
ఎప్పుడైనా గొడవపడి
ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా
మనసుల మధ్య మాత్రం దూరం
అనిపించకూడదు..!!
- 1+నాని✍️

-


21 OCT 2024 AT 1:31

ఒకరు కావాలి అనుకున్నప్పుడు
వారిని దక్కించుకునేంత ధైర్యం ఉండాలి..!
దక్కించుకున్నాక భరించేంత ఓపిక ఉండాలి..!
ఈ రెండూ లేకుంటే వారు కావాలనే
ఆలోచన మొదట్లోనే వదిలెయ్..!!
- 1+నాని✍️

-


20 OCT 2024 AT 6:42

మన కోపాన్ని కూడా
ప్రేమగా స్వీకరించేది
ఈ సృష్టిలో తల్లి మాత్రమే..!!
- 1+నాని✍️

-


19 OCT 2024 AT 0:36

ఏ ఒక్కరికీ జీవితంలో
అన్నీ ఉండవు..!
కానీ, ఏ సందర్భంలోనైనా
తోడుగా నిలిచే మనిషి పక్కనుంటే
అసలు లోటనేదే ఉండదు..!!
- 1+నాని✍️

-


18 OCT 2024 AT 7:04

ధనాన్ని చూసి దరిచేరే బంధువులు..!
అందాన్ని చూసి కలిగే ప్రేమ..!
అవసరం కోసం కలుపుకునే స్నేహం..!
ఎప్పటికీ శాశ్వతం కావు..!!
- 1+నాని✍️

-


17 OCT 2024 AT 7:29

మనసులో ఉన్నవారు
కంటికి ఎన్నిసార్లు కనబడినా
కొత్తగానే అనిపిస్తారు..!!
- 1+నాని✍️

-


16 OCT 2024 AT 7:04

మనసు, మనీ పర్సు ఒకటే..!
చిల్లర విషయాలు
తొలగించే వరకూ భారంగానే
ఉంటుంది..!!
- 1+నాని✍️

-


15 OCT 2024 AT 6:31

షర్ట్ తీస్తే సిక్స్ ప్యాక్ ఉండాలి..!
నవ్వితే బుగ్గపై సొట్టపడాలి..!
ఖరీదైన నగలు, డ్రెస్సులు వేసుకోవాలి..!
గడపదాటి అడుగు పెడితే కారో బైకో ఉండాలి..!
మన వెంట ఎప్పుడూ పదిమంది ఉండాలి..!
వీటన్నింటినీ అందం అనుకుంటే
ఆ సంతోషం మీకు తాత్కాలికమే..!!
- 1+నాని✍️

-


14 OCT 2024 AT 6:55

మన జీవితంలో
కొన్ని పరిచయాలు
రైలు పట్టాల వంటివి..!
పక్కనే ఉన్నట్టు కనిపించినా
ఎప్పటికీ కలవని ప్రపంచాలు..!!
- 1+నాని✍️

-


Fetching Nani Quotes Quotes