Nalla Sai Reddy   (Nalla Sai Reddy)
47 Followers · 3 Following

read more
Joined 7 March 2018


read more
Joined 7 March 2018
28 JUN 2019 AT 8:21

ప్రియతమా...
చుట్టూ ఎందరున్నా...ఒంటరిగా
ఈ మనసు నీ కోసం తలుస్తుంది
నా ప్రతీ శ్వాస, నిశ్శబ్ధంగా
నిను ప్రేమగా పిలుస్తుంది
నా ప్రతీ గుండెచప్పుడూ...
నీ కోసం లయబద్ధం అవుతుంది
పూవును అంటిపెట్టుకున్న పరిమళంలా
ఆ క్షణమే ఈ ప్రాణం నీదై పోయింది




-


26 JUN 2019 AT 20:47

ప్రియతమా...
ఈ బృందావనంలో ప్రతీ మొక్క అడుగుతుంది
అందమైన నీ రాధ ఇంకా రాలేదేమని
నా శ్వాస తాకిన వేణువు
రాగాలు పలకడం మరచి
నీ గొంతులో పలికే ప్రేమ సరిగమలు కోరుతుంది
చల్లని ఈ సుమధుర గీతికను
మోసుకొచ్చే గాలులు
నిన్ను వెతుకుతూ మల్లె పరిమళాలు
వెంటపెట్టుకొస్తున్నాయి
ప్రియతమా...వాటికి తెలియదేమో,
ఈ ప్రాణం నీదేనని, నీ కోసమని

-


25 JUN 2019 AT 18:54

సీత...అగ్ని పరిక్షకు నిలిపినందుకు ఈ రాముని పై నీకు మనసులో ఏవగింపు, అసహ్యం, బాధ కలిగాయా...?

లేదు...రామా...నిన్ను నువ్వే పరిక్షించుకున్నావు,

నేను నేనుగా వేరుగా లేను కనుక...నిన్ను తప్ప వేరుగా ఇంకేమీ లేదు కదా, నీ పై ఆప్యాయత, అనురాగం ప్రేమ తప్ప మరేమి ఉండదు.

-


24 JUN 2019 AT 17:50

ప్రియతమా...
నిన్ను మెప్పించేలా మాట్లాడను
నిన్ను నొప్పించినా నిజమే చెప్తాను
నీ దగ్గర లేని గొప్పతనం చెప్పను
చేసిన తప్పులను ఒప్పుకొనే తీరుతాను
ఎందుకంటే...
నీతో నేను కోరుకున్నది నాలుగు రోజుల
స్నేహం కాదు...కడవరకు తోడుండే భాగస్వామిగా
నేనేంటో నీకు పూర్తిగా నీకు మాత్రమే తెలుసు
నువ్విచ్చేది...అంగీకారమో, తిరస్కారమో ఏదైనా
నీపై ప్రేమ కలిగింది...చివరి శ్వాస వరకూ...

-


19 JUN 2019 AT 23:53

భాషకు అందని భావం ప్రేమ
రూపానికి బంధించని అందం ప్రేమ
ఓటమి తెలియని గెలుపు ప్రేమ
భయాన్ని జయంచిన బలమే ప్రేమ
చరిత్ర రాయని కావ్యం ప్రేమ

-


19 JUN 2019 AT 7:50

ప్రియతమా...
మన బంధంలో
అల్లుకున్న మనసుల మధ్య
కొన్ని చిలిపి అలకలు,
మరెన్నో కలయికలు
పైపై కోపాలు,
ప్రేమగా మనసుపడే బుజ్జగింపులు
ఎన్నో నమ్మకాలు,
కష్టం నుండి కాపాడుకోవాలనే తాపాత్రాలు
అల్లుకున్న మల్లెతీగల్లో
బంధాల ఎనెన్నో పరిమళాలు

-


19 JUN 2019 AT 3:00

ప్రియతమా...
నీ చుట్టూ విషనాగులు
బుసలు వినబడుతుంటే
నీకు హాని చేస్తాయని
నేను కఠినంగా మాట్లాడితే
అది నీకు వేదన కలిగిస్తుందా?
నా కళ్ళల్లో ఆత్మీయత తెలియదా?
నా హృదయంలో ప్రేమ తెలియదా?
నన్ను నన్నుగా అర్ధం చేసుకున్న నీకు
నేనేంటో తెలియనిదా?
మనసుపడే బాధ

-


18 JUN 2019 AT 19:52

ప్రియతమా...
నీ అడుగులో అడుగు కలిపి
సాగిపోవాలనీ
నీ చేతుల్లో గువ్వపిట్టలా
ఒదిగిపోవాలనీ
నీ మాటల్లో ప్రతీ పలుకు
నేనై ఉండాలనీ
నీ స్పర్శతో పులకించిన
తొలకరి జల్లులా
నీ మనసంతా నేనై నిండిపోవాలనీ
ప్రేమతో
నీ వాడిగా నిలిచిపోవాలని,
నీ కళ్లల్లో రూపంగా
నిన్ను నాలో దాచుకోవాలనీ
నీ కోసం ప్రేమతో

-


18 JUN 2019 AT 7:07

ప్రియతమా...
ఏడే ఏడు స్వరాలు
మధురమైన
సంగీతంగా సరిగమలు
పలికించినట్లు
నువ్వు నేను
అనే పదాలతోనే
వేల వేల ప్రేమ
కావ్యాలవుతాయి

-


17 JUN 2019 AT 21:11

ప్రియతమా...
నెలవంకలో వెన్నెల్లో చల్లదనం
నీ సంపెంగ లాంటి ముక్కుకు
తారకను తెంచితెచ్చి అలంకరించనా,
నీ మోము తామరలో, అరవిరిసిన కన్నుల్లో
ఆత్మీయంగా చూసినా, కొంటెగా కసిరినా
నీ హృదయంలో దాగిన ప్రేమలో తడచి మొలకెత్తిన
మల్లెతీగనై, అల్లుకుపోనా...నీ ఆరాధనలో
మేఘ ఘర్జనలకై ఎదురుచూసే మయూరాన్నై

-


Fetching Nalla Sai Reddy Quotes