It is simple to be align with nature
to find your true nature!-
కనిపించే నిశిలో..
కరిగిపోతున్న భావాల ఒడిలో...
ఊయలూగుతున్న హృదయాలు ఎన్నో..!
-
అక్షరమే ఆయుధంగా ఎంచారు ఎందరో
ఆ అక్షరమే ఔషదంగా మార్చారు కొందరు
హృదయంలో అంకురించే
మనోభావాలే సిరాగా
కలం ఈ ప్రపంచానికి పరిచయం చేసే ఘనీభవించిన
ఆలోచనా స్రవంతి...నిరంతరం రూపు దాల్చే
అనంత రచనా ఝరి..కోటివెలుగుల క్రాంతి .
-
దోబూచులాడే ఆ చందమామ
చుక్కలన్నీ చక్కగా నీ చెంతచేరే
పొద్దుపోయినాదని మంది నిద్దరోయే
సద్దుమణిగినాక పండు వెన్నెలలు కాసే
వెన్నెల కాంతుల్లోన వేల అందాలు వచ్చే
ఆ వెండి వెలుగుల్లో కవనాలు తొలకరిలా కురిసే
కవనాల చిరుజల్లుల్లో కవులందరు ముగ్ధులయ్యే
-
సాయం చేయగల చెయ్యి
ప్రోత్సాహం ఇచ్చే మాట
విజయానికి పొంగక
అపజయనికి కృంగిపోక
ప్రతిక్షణం ఆస్వాదించినప్పుడే
నిజమైన ఆనందం
-
గత జ్ఞాపకాలను తడిమిన ఈక్షణం!
స్నేహమనే తోటలో దొరికిన ఓదార్పు మాటలను గుర్తుచేసింది.-
మనుషుల మాటలకు అర్ధాలు వెతక్కు
మహనీయుల జీవితాల్లోని అంతరార్ధం కనుక్కో!-
రెక్కలు కట్టుకు వాలిన జీవితం
రెక్కలు ముక్కలైనా ...
అడుగులు వెనక్కు వేయనివ్వని ధైర్యం
అదే బ్రతుకుకు అసలు అర్ధం-