నాగరాజు దంతెనపల్లి   (నాగరాజు దంతెనపల్లి)
0 Followers · 2 Following

Joined 3 October 2022


Joined 3 October 2022

అవసరానికి ఒక రంగు..
ఆసరా కోసం ఒక రంగు..
మనుషుల ముందు ఒక రంగు..
మనసులో ఇంకో రంగు..
సహాయం పేరిట స్వార్ధపు రంగు..
నమ్మకం మాటున మోసపు రంగు..
కోపంలో కన్నెర్రపు రంగు...
బాధలో కన్నీటి రంగు..
అసలు మనిషి జీవితమే రంగుల మయం...
రంగుల "హోళీ" శుభాకాంక్షలతో...

-



పొగ మంచు దుప్పటి కప్పేవేళలో..
గొబ్బెమ్మల కల్లాపి మట్టి పరిమళాలలో..
కోడి పుంజుల కదనరంగానికి దూకే సమరాన...
పిండి వంటల సఖినాల రుచుల మధురాన..
మునివేళ్ల ముగ్గుల అందమైన రంగోళీ వాకిట్లలో..
పతంగుల ఎగరేతలో వేసే కేరింతలలో.... మీ ఆనందం పండుగ వేళ రెట్టింపు అవ్వాలని... కోరుకుంటూ... అందరికి..మకర సంక్రాంతి శుభాకాంక్షలు..✍✍✍✍💐💐💐🐓🐓🐓🌹🌹🌹🌹

-



రోజులా తెల్లవారుతుంది.. కానీ ఆ వేకువ కొత్తగా మీరు భావిస్తారు..
అదే స్నేహితులు నీ పక్కన ఉంటారు కానీ మంచోడు,ముంచోడు కొత్తగా ఎవరా అని కనిపెట్టు... అదే పని పొట్టకూటికి సద్ది కట్టుకుని బయలుదేరాలి.... కానీ దానిలో నీ భవితకు ఉన్న నైపుణ్యం మెరుగుపరుచుకో...
సంవత్సర కాలంలో మోసం చేసిన వాడిని కాకుండా దానికి పునాది అయిన నీ మంచితనాన్ని ప్రశ్నించుకో... చివరగా కొత్త సంవత్సరం వేడుక కోసం కంటే కొత్త జీవితానికి నీకు ఏం మెరుగులు దిద్దాలో ఆత్మ పరిశీలన చేసుకో... అదే నిజమైన పాత సంవత్సర ముగింపు....✍️ #Bye Bye 2023.

-



సగటు జీవితంలో బంధాలు, బంధుత్వాలలో..
మంచి చెడులలో...
స్నేహంలో.. పనిలో...లాభనష్టాలలో...ఇలా ప్రతిదీ లెక్కలు వేసుకుని అవసరాలకి అనుగుణంగా లెక్క సరిచేసుకుని మసులుకునే అందరికీ లెక్కల(గణిత) దినోత్సవ శుభాకాంక్షలు...

-



కాబట్టి నా ఆలోచనలో చేసిన ఉద్యోగం నీ రాకపోకలకు సరిపోదు అని ఈసడించుకునే వాళ్ళకి సమాధానం వస్తదని..
మిగిలిన ప్రయాణ ఖర్చుతో ఆర్థిక సాధికారత సాధిస్తదని..
అత్యవసర సమయాలులో అండగా ప్రయాణంకి ఆర్థిక ఆటంకం రాదని..
చదువు అంతా బస్ పాస్ మీద ఆధారపడి ఉన్న ఆడపిల్లకి ఆసరాగా ఉంటదని..
మహాలక్ష్మీ లో మన అమ్మ అక్క చెల్లి అత్త కూడా ఉంటారు కదా అని ఎందుకు అనుకోకూడదు... అని నా అభిప్రాయం.✍️

-



ఉచిత బస్ ప్రయాణం: సోషల్ మీడియా ఆర్థిక, సామాజిక, అపర దేశ రాష్ట్ర భక్తులు, నిపుణులు కామెంట్స్ చదివినాకా స్టేటస్ రాస్తున్న.
కామెంట్:రాష్టం దివాలా తీస్తుంది...
👉పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకు వేల కోట్లు మాఫీ చేసినప్పుడు ఒక్కరు బైటకు రాలేదు. పైగా ఉచితంగా ప్రయాణము ముగిశాక మహిళలు వెళ్లిన ప్రాంతంలో జరిగిన లావాదేవీలు ఉదా హోటల్, టూరిజం, దేవాదాయ, షాపింగ్లలో వచ్చే టాక్స్ ద్వారా ఆదాయం చేకూరుతుంది.
కామెంట్: ఆటో వాళ్ళు కుటుంబాల పరిస్థితి ఏంటో?
👉ఆటో అనేది ఒక సులభ ప్రయాణంకి దగ్గర దూరం ఇరుకు సందులు అని సంబంధం లేకుండా గమ్యాన్ని చేర్చే రవాణా మార్గం. ఆర్టీసీ చరిత్రలో ప్రధాన మార్గాల్లో మాత్రమే సర్వీస్ ఇచ్చింది ఇంకా కొన్ని గ్రామాలకు బస్ వచ్చేది పోయేది కూడా లేదు. కాబట్టి ఎవరి సర్వీస్ కి కుటుంబాలకు సమస్య రాదు.
కామెంట్: హామీ ఇచ్చేటప్పుడు సూపర్ లగ్జరీ ఇప్పుడు పల్లెవెలుగు, express నా.. అదే మ్యాజిక్.
👉 పథకాలు ఎప్పుడూ పేద మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇస్తుంది.లగ్జరీ కోరుకునే వారు ఉచితానికి ఆశపడడు అని విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వారికి మిగిలిన ఆ పావు వంతు ఛార్జిలో కిలో టమాటా అయినా కొందాం అనుకునే వాళ్లే ఉంటారు తప్ప ఫైవ్ స్టార్ హోటల్ లో పిజ్జా ఆర్డర్ చేసేటోళ్లు ఉండరు.
కామెంట్: అసలు బస్ లు సరిపోతాయా?
👉 కొత్తవి కొంటున్నాం అని నిన్న ప్రెస్ మీట్ లో సజ్జనార్ సార్ చెప్పాడు.

-



కృష్ణార్జునరావు దంతెనపల్లి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నూతన ప్రభుత్వ మంత్రులు, ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచినా, వారిలో కుల మత ప్రాంత చిచ్చులు పెట్టి,పక్షపాతం కానీ, రాగద్వేషాలుతో రెచ్చకొట్టినా...చట్టవ్యతిరేకమైన చర్యలు చేపట్టినా.. అధికార దుర్వినియోగం జరిగినా శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో ప్రజలకు వివరించి తగిన విధంగా స్పందిస్తానని.. నూతనంగా ప్రమాణం చేసిన మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను...

-



👉లీకు చేసిన పోస్టులు ఎన్ని ?
👉అమ్ముకున్న ఉద్యోగాలు ఎన్ని ?
👉అడ్వాన్స్ ముట్టిన పోస్టులు ఎన్ని ?
👉గ్రూప్ 1 ఎన్ని పోస్టులు నింపారు ?
👉గ్రూప్ 1 మొదటి ప్రిలిమ్స్ Toper ఎవరు ?
👉అసలు గ్రూప్ 3 Exam ఎందుకు జరపలేదు ?
👉గ్రూప్ 4 Results ఏవి?
👉గ్రూప్ 1 రెండోసారి ఆగిపోవడానికి కారణం అయిన బోర్డు మెంబర్లు ఎందుకు అలాగే ఉన్నారు ?
👉TSPSC బోర్డు మెంబర్ల నియామకం తప్పుల తడక అని హైకోర్టు మొత్తుకున్నా కూడా మీరు రాజకీయ నియామకాలు ఎందుకు చేశారు ?
👉SI/PC ఉద్యోగాలు ఎందుకు ఆగిపోయాయి ?
👉DSC లో 13 వేల ఉద్యోగాలు ఏవి ?
👉గురుకుల ఎందుకు ఆగిపోయింది ?
👉MVI ఉద్యోగాలు ఎందుకు ఆగి పోయాయి ?
👉Drug Inspector ఉద్యోగాలు ఏవి ?
👉DAO Exam ఎటుపోయింది ?
👉Harizontal Reservation పాటించాలి అని హైకోర్టు దాదాపు 10 కి పైగా తీర్పులిచ్చాక కూడా ఓ విధానం రూపొందించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు ?
👉2016 గ్రూప్ 1 Toper ఎవరు ?
👉2016 గ్రూప్ 1 Marks List ఎక్కడ ?
👉2016 గ్రూప్ 2 Marks List ఎక్కడ ?
👉ప్రైవేటు రంగంలో మీరు చెప్పిన ఉద్యోగాల్లో తెలంగాణ నిరుద్యోగుల వాటా ఎంత ?
వచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ?
👉OutSourcing ఉద్యోగాల కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు ?
👉 లీకేజీ లో SIT ఇంతవరకు chargsheet ఎందుకు వేయలేదు .?
ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నవి..
అడిగినవన్నీ ప్రకటించండి..

-



రాష్ట్రంలో ఉన్న జ్యోతిష్య నిపుణులు, బాబాలు, భవిష్య వాణి వినిపించే ఎవరైనా రానున్న ఎన్నికల్లో ఎవరు ఎన్ని అసెంబ్లీ సీట్లు పొంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని ముందే సరిగ్గా చెప్పిన వాళ్ళకి ఖమ్మం అంబేద్కర్ గారి సెంటర్లో పౌర సన్మాన కార్యక్రమం నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాను...

-



ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళు గెలిచినా అంతిమంగా ఓడిపోయేది,పీడించబడేది ప్రజలే...!అందుకే ఎల్ల వేళలా ధైర్యంగా ప్రజలవైపు నిలబడటమే నిజమైన ప్రజాస్వామ్యవాదుల లక్షణం...✍️

-


Fetching నాగరాజు దంతెనపల్లి Quotes