నాగేష్ బండారి   (unprofessionalwriter214)
196 Followers · 208 Following

read more
Joined 4 December 2019


read more
Joined 4 December 2019

కన్నోలు సరిగ్గా చూడలేక,
చావు తొందరగా రాక,
ఎవరికేమి చెప్పుకోలేక,
ఎవరినేమి అడగలేక,
ఇడుపునా వాలి మగ్గిపోతున్న,
వయస్సు తగ్గిపోతున్న
విగతజీవులుగా మిగిలిపోతున్న,
ముసలి తల్లిదండ్రులెందరో.

-



తల్లితండ్రుల జోక్యం వలన
తల్లడిల్లి పోతున్న కొత్త జంటలు
తగలబడి పోతున్న కొత్త ఆశలు
చిగురించకుండానే వాడి పోతున్న కొత్త ఆశయాలు
నెత్తురుతో తడిసి పోతున్న కొత్త బతుకులు
విగత జీవులుగా మారిపోతున్న కొత్త జీవితాలు

-



మనుషులను ఆయుషు చంపే కన్నా ముందే ఆకలి చంపేస్తున్న దేశం...

-



సృష్టిలో బడాయిలన్నా మరియు భజనలన్నా మనుషులనే జీవులకు భలే సరదా మరియు పిచ్చి...

-



విద్య అనే మారణాయుధంతో తల్లిదండ్రులు మరియు విద్య సంస్థలు అనే నేరగాళ్లు కలిసి విద్యార్థులను (ఆత్మ)హత్యలు చేస్తుంటే శిక్షించడం చేతకాని చట్టాలు మరియు న్యాయవ్యవస్థలున్న దేశం మనది...

-



మనీ చేసే మినీ మాయైనా లేక మ్యాజిక్కైనా మనుషులకు మాత్రమే (గ)మత్తుగా మరియు గమ్మత్తుగా ఉంటుంది..

-



పుట్టుక ముందు వచ్చే పుణ్యమేంటో మరియు
చావు తర్వాత వచ్చే పాపమేంటో ఏం జీవికెరుకా...

-



తలరాత వేసే సమస్యలనే ముడులను,
కాలంతో ముడిపడిన కర్మఫలం పరిపక్వతనే పరిష్కారాలతో విప్పుకుంటూ వస్తుంది...

-



గమ్మత్తెంటో కాని డబ్బు మాట్లాడుతుంటే వినే
వాళ్ళకు ఎలాంటి అంగవైకల్యం ఉండదురా సుబ్బా...

-



వివాదాలు కల్పించే నినాదాలే తప్ప
విప్లవాలు రేకెత్తించే నినాదాలు లేని దేశం మనది...

-


Fetching నాగేష్ బండారి Quotes