అవును నలుపు నాకిష్టం
పగటి రంగులను చెరిపేసి అంతా ఒక్కటే అని చాటే నిశీధి నలుపు నాకిష్టం...!!
మల్లెపూల తావితో నన్ను మైమరపింపచేసే
నీ కురుల నలుపు నాకిష్టం...!!
చూసినా మళ్ళీ చూడలనిపించేంత
అందమైన నీ కాటుక కళ్ళ నలుపు అంటే
నాకు ఇంకా ఇంకా ఇష్టం🖤-
అందమైన ఇంద్రధనుసువంటి ని ఒంపులు
లేతగడ్డి తాకితేనే కందిపోయే నీ సుకుమార పాదములు
వెన్నెలలోని చల్లదనం నీ చూపులు
నీ నీలికన్నుల కాంతులే వెన్నెల మెరుపులై
నీ ఎద ఊపిరే మల్లెల పరిమళములై
నీ ప్రతి అడుగు మయూర నాట్యములై
నీ వయసులోని సొగసే మధురసంగీతమై
నీ మనసే విరజాజుల సౌఖ్య సుకుమరములై
పారిజాతమంటి నీ లేత పాదాలు
రాజహంసవలే కదలివస్తున్నవేళ
నామనసు నామాట విననంటున్నది
నావయసేమో పదపదమని తొందరపడుతున్నది
నీ మేనిఒంపుల వయ్యారంతో
నా చిత్తమంతా దోచిన నీ చెంత చేరమని నా ప్రియురాల ❤🔥-
ఎన్నాళ్ళుగ జపించానో తపించానో
నీవే సర్వస్వం గా కలలో ఇలలో నిలకడలో గమనంలో
నిట్టూర్పుల విరహాగ్ని జ్వాలలు సెగలై రగిలే వడగాడ్పులలో క్షణమొక యుగంలా మనసే నిప్పుల కొలిమిలా పొగిలిపోయాను
నీ కనుల మందార వికాసానికై నిరీక్షించని క్షణం లేదు
నీ తనువులోని అణువణువూ నాదేనని నీవు నాదానివని ఆకాశమంత ఆశలలో ఆనందాన్ని సంద్రంలా పొంగించాను అందరాని అందానివని తెలిసినా జ్ఞానినైన నేనూ అజ్ఞానిగా ఉద్యానవనం లాంటి బంగరు భవితను
మరుభూమిగా ఆహుతి చేసుకున్నాను
ఎన్నో ఊహల కెరటాలు ఎన్నో ఆశల కిరణాలతో ఆహ్లాదపు పల్యంకికను నిర్మించుకున్నాను
మతిభ్రమించి నా బతుకు బుగ్గిపాలు అయ్యేవరకు స్పృహలో లేని నేను నేనుకాని
అందరికీ సుపరిచితమైన నేను అనామకుడిగా అమాయకుడిగా మిగిలిపోయాను
నాకిక ఉషస్సులూ వసంతాలూ మలయమారుతపు వీచికలూ లేనేలెవని తెలిసినా నా జీవితం నిరర్థకమని తెలిసినా నీ జ్ఞాపకాల సుడిగుండంలో పడిపోయినా వెర్రిగా పిచ్చిగా నిన్నే ఆరాధించే శూన్య ప్రేమికుడిని-
కలయే నా ఊపిరి
ఆశే శ్వాసగా
శ్వాసే ధ్యాసగా
ప్రతి నిశ్వాసములోను నీకై తపించా
కలలో కనపడతావు
ఊరిస్తావు ఉల్లాసపరుస్తావు
ఉత్తేజంగా ఉరకలు వేయిస్తావు
మదిలో మెదిలే ప్రతి కదలిక నీవే
సంతోష సంబరాలలో నీ ఊసులే
ఊహల పల్లకిలో ఊరేగేలా చేస్తావు
ఉత్తుంగతరంగంలా ఎగిసెగసి పడతావు
చెంతకు చేరినట్టే నన్ను భ్రమింపచేస్తావు
దోబూచులాడుతూ పరుగులుతీస్తావు
మన కలయిక ఎప్పుడో మరి
నా కలను కల్ల చేయవు కదా.-
కనులు తెరిచినా నువ్వే
కనులు మూసిన నువ్వే
నీ నయనాలు విరిసిన చాలు
కారు చీకట్లలో కూడా
కాంతిరేఖల జాలులే
నీకు తెలియకుండానే
నీ కనులు నాతో మాట్లాడుతాయి
నీ కనులు నాతో పోట్లాడుతాయి యుద్ధం చేస్తాయి
నీ కనుల కొలనులలో
నేను ఒక భావ గీతని
నీ కంటి కొసలలో తొణికిసలాడే
నేను ఒక మధుర గేయణి
నీ కళ్ళు విరబూస్తే
నేను అక్షరాల జలపతని
నీ కనులు రంగవల్లులో
నేను హాస్య రసాన్ని
శృంగార రసాన్ని
కానీ నువ్వు మాత్రం నా కన్నుల్లో దాచుకున్న
ఓ అపురూపమైన రుపానివి సఖి
ఓ మల్లెపువ్వునై ఒదిగి పోవాలని ఉంది నీ సిగాలో
సిందురమై నిలిచిపోవలని ఉంది నీ పాపిట్లో
సౌభాగ్యమై దాగి పోవాలని ఉంది నీ మెడలో
అలాగే సాగిపోవాలని ఉంది నీ పైట నీడలో సఖి💙
-
కనులు తెరిచినా నువ్వే
కనులు మూసిన నువ్వే
నీ నయనాలు విరిసిన చాలు
కారు చీకట్లలో కూడా
కాంతిరేఖల జాలులే
నీకు తెలియకుండానే
నీ కనులు నాతో మాట్లాడుతాయి
నీ కనులు నాతో పోట్లాడుతాయి యుద్ధం చేస్తాయి
నీ కనుల కొలనులలో
నేను ఒక భావ గీతని
నీ కంటి కొసలలో తొణికిసలాడే
నేను ఒక మధుర గేయణి
నీ కళ్ళు విరబూస్తే
నేను అక్షరాల జలపతని
నీ కనులు రంగవల్లులో
నేను హాస్య రసాన్ని
శృంగార రసాన్ని
కానీ నువ్వు మాత్రం నా కన్నుల్లో దాచుకున్న
ఓ అపురూపమైన రుపానివి సఖి
ఓ మల్లెపువ్వునై ఒదిగి పోవాలని ఉంది నీ సిగాలో
సిందురమై నిలిచిపోవలని ఉంది నీ పాపిట్లో
సౌభాగ్యమై దాగి పోవాలని ఉంది నీ మెడలో
అలాగే సాగిపోవాలని ఉంది నీ పైట నీడలో సఖి💙
-
బంగారం.......
నీకు తెలియకుండానే ఎన్నో జ్ఞాపకాలనే విత్తులను
చల్లి వెళ్లిపోయావు నా గుండెల్లో
నా కన్నుల్లో కురిసే వానలో అవి తడిసి
చిగురించడం మొదలుపెట్టింది....
-
Girls are more dangerous than corona virus bro...😢
Be aware of girls👍-
కావాలి అనలేను....
వద్దు అనలేను....
కలిసి ఉండలేను....
విడిపోయి బ్రతకలేను.....
కానీ ఒక్కటి మాత్రం నిజం
నిన్ను ఈ జన్మలో మరవలేను😭
-