Mr Naresh  
9 Followers · 6 Following

నన్ను నా మాటలని మీకు పరిచయం చేసే చోటు
ఇక్కడ కేవలం మాటలు మాత్రమే మాట్లాడతాయి..
Joined 27 June 2019


నన్ను నా మాటలని మీకు పరిచయం చేసే చోటు
ఇక్కడ కేవలం మాటలు మాత్రమే మాట్లాడతాయి..
Joined 27 June 2019
18 SEP 2023 AT 21:49

అన్ని కళ్ళ ముందే తిరుగుతున్నాయి,
ముందుకు సాగాలంటే వెన్నక్కి తిరగొద్దు అంటారు,
కానీ వెనకే కదా మనం బ్రతికింది అక్కడే కదా మనం ఉన్నది..

-


15 AUG 2023 AT 23:59

చరిత్ర మనకు ఎన్నో కధలు చెపుతూ వచ్చింది,
బానిసత్వం నుండి మొదలై తిరుగుబాటు వరకు,
ఏమి చేయాలో తెలియక కలవరపడుతున్న కాలం నుండి ఎదో సాధించగలం అనే సంకల్పం వరకు,
ఎన్నో అరాచకాలు,ఎందరో అమాయకుల బలిదానం, ఎర్రటి రక్తంతో తడిసిన ఈ నేలా,ఎన్నో ఆలోచనలు, ఎందరో వీరుల పోరాటం,ఎన్నో త్యాగాలకు గుర్తుగా చరిత్రలో మిగిలిపోయింది ఈ స్వాతంత్రం,
స్వేచ్ఛ లేకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా ఎంత కష్టంగా ఉంటుందో చరిత్ర మనకు పరిచయం చేసింది,
డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం ఇది,
ఇంతటి చరిత్రని కాపడుదాం, ఈ స్వేచ్ఛను గౌరవిస్తూ భాద్యతగా నడుచుకుందాం..

-


2 AUG 2023 AT 22:49

గెలవడం కోసమే మొదలైన పరుగులో
మొదట్లోనే తెలియకుండా ఆగిపోయా,
ఆగిపోయి చాలా కాలం దాటిన
నన్ను దాటి పరుగులో ముందుకొచ్చి నన్ను పలకరిస్తూ మిగితా వాళ్ళు పరిగెడుతుంటే
నేను నిజంగానే అక్కడే ఆగిపోయానా అనే ఆలోచన నన్ను మరల కాలానికి ఎదురుగా తీసుకెళ్ళి అక్కడే వదిలి వచ్చేస్తుంది..

-


19 JUL 2023 AT 22:06

అదేంటో తెలీదు,
అదేంటో అర్దం అవ్వదు,
ఎన్ని కథలు విన్న
ప్రతి కథలో ఎదో వెలతి ఉందని తెలుస్తుంది,
ఇక మెల్లిగా వెలతి లేని జీవితం ఉండదు అన్ని అర్దం అవుతుంది..

-


19 JUL 2023 AT 0:46

మొదలుపెట్టినప్పుడు ఇంత దూరం ప్రయాణిస్తానని ఊహించలేదు,
ఈ ప్రయాణం నన్ను నాకు చాలా దగ్గర చేసింది,
నాతో నన్ను మాట్లాడుకునేలా చేసి,
నాకు నన్నే కొత్త వ్యక్తిగా పరిచయం చేసింది,
తెలిసి తెలియకుండా మొదలుపెట్టిన ఈ ప్రయాణం చాలా నేర్పింది,కాలం ఎపుడు ఎదో ఒకటి నేర్పాలని చూస్తూ కటినమైన పరీక్షలు పెడ్తుంది,
ఇలాంటివి ఎదురైన ప్రతి సారి నాకు నన్నే తోడుగా ఉండేలా చేసింది ఈ ప్రయాణం..

-


19 JUL 2023 AT 0:33

పరీక్ష..!
తెలిసిన సమాధానాలతో పోటీలో నిలవడం కష్టం అని భయపడి,
తెలిసి తెలియని సమాధానాల కోసం పక్క వాల సమాధానాలు దోపిడీ చేసినా పరీక్ష విఫలం అవడం,దానికోసం చింతిచడం,
ఇది సగటు విద్యార్ధి జీవితంలో జరిగే కథ మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితం లో జరుగుతున్న వాస్తవాలు.
ప్రతి ప్రశ్న కి సమాధానాలు ఒకేలా ఉండవు,
ఇది నీ జీవితం , నీ పరీక్షలో నువ్వు మాత్రమే రాసుకోవాల్సిన సమాధానాలు..

-


18 JUL 2023 AT 23:51

చినుకు తాకిడికి భూమి సంబరపడిపోతుంటే,
దూరంగా ఉన్న సూర్యుడు మబ్బల వెనకే దాచుకొని కాలాన్ని నెట్టాలని చూస్తే,
లోకమంతా అంధకారంలోనే మిగిలిపోతుంది..

-


9 MAR 2023 AT 0:40

పలకరించిన ప్రతిసారీ నన్ను ఆహ్వానిస్తున్న అదే ప్రశ్న,
ఇన్ని సంవత్సరాలు గడిచిన మన పరిచయంలో మారని అదే ప్రశ్న,
ఏమో గడుస్తున్న కాలంతో సమాధానం కూడా పయనించాలనుకుంటుందేమో,
ఏమో కాలంతో దాగి ఉన్న రహస్యాలతో ఇది కూడ మిగలాలని అనుకుందేమో..

-


20 DEC 2022 AT 23:23

కాల్లాని వెన్నక్కి నెట్టేస్తూ,గడిపిన క్షణాలను వేతికేస్తు,
దాటిన గాయాలను తలుస్తూ,అమాయకత్వాన్ని మోస్తున్న రోజులును గుర్తుకుతెస్తు,
మనం మరిచిన, మనల్ని ఎప్పటికీ తనలోనే దాస్తూ మొస్తు ఉన్న కాలాన్ని ఇక కళ్ళ ముందు కదిలిస్తూ..

-


13 NOV 2022 AT 23:23

యుగాలు దాటిన కథలు అవి ఇన్ని యుగాలు ప్రయనించగలుగుతునాయి,
వాటిని కాలం కూడా మోస్తూ వస్తుంది,
అలాంటి కథలకి ప్రాణం పోసిన వారు ఎందరో మరి వారు ఇన్ని యుగాలు దాటి మనకు చరిత్రగా కలవడం,
గడిచిన కాలం మళ్ళీ ప్రాణం పోసుకుని మనకు చరిత్రగా పరిచయం అవడం,
చరిత్ర దాచుకున్న రహస్యాలును నీతో ఎందుకు పంచుకోవాలని అనుకుంటునాయి..?

-


Fetching Mr Naresh Quotes