Madhu Amaragani   (మధు అమరగాని)
22 Followers · 25 Following

Joined 25 June 2020


Joined 25 June 2020
12 APR AT 18:07

పిచ్చి రాతలు

నీవొచ్చిన స్థితి గుర్తులేకుంటే
నీకొచ్చిన స్థితిలో నిలదొక్కుకోలేవ్
నీ స్థితిని బట్టి ఎగిరెగిరిపడితే
పరిస్థితి మారితే పడిపోతవ్
స్థిరత్వంగా ఉండకపోతే
అస్తిత్వం అంధకారమే...

-


5 APR AT 18:55

మనసుకు లేదు పత్యం
ముక్కలెన్ని అవుతున్నా
ఊహలలో కడుతుంది
మేడలు నిత్యం 

-


5 APR AT 18:35

గదిలో భక్తి
ఏరులై పారుతుంటే
మదిలోకి మురికి కుంట
దూరుతానని పోరుతుంది
మనసేమో పట్టుదప్పి
కొద్ది కొద్దిగా సడలుతుంది

-


5 APR AT 14:27

ఎదురుచూస్తూ కూర్చుంటే
బెదిరిస్తది కాలం
ఎదురెళ్ళి కలబడితే
ఎదురొస్తది విజయం

-


5 APR AT 14:21

ఒక నిరీక్షణ ముగియగానే
కొత్త నిరీక్షణ మొదలవుతుంది
అయితే ప్రతి నిరీక్షణకు మధ్య ఉండే
పరీక్ష మాత్రం భయంకరంగా ఉంటుంది.

-


5 APR AT 14:15

అవసరం ఉంటే 
కుక్కకు కూడా కుర్చీ యేసి 
పక్కకు కూర్చోబెట్టుకోవడమే 
రాజకీయం అంటే…

-


5 APR AT 14:12

అవసరం ఉంటే 
కుక్కకు కూడా కుర్చీ యేసి 
పక్కకు కూర్చోబెట్టుకోవడమే 
రాజకీయం అంటే…

-


5 APR AT 13:48

గతుకుల దారుల్లో
అతుకుల ఆలోచనలకు
అక్షర రూపం దాల్చి
అల్లుకుంటున గజిబిజి పూలజడ నా మది

-


19 MAR AT 22:19

నిన్ను ప్రత్యేకంగా మార్చే గుణాలు..

1. నీ వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకు..
2. అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూస్తూ మాట్లాడు..
3.ప్రశ్న అడిగిన వెంటనే జవాబు ఇవ్వకు సమయం తీసుకొని సమాధానం ఇవ్వు..
4. నీ ఆర్థిక విషయాల గురించి అస్సలు మాట్లాడకు
5. పండుగలకు ఆహార్యం ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం చెయ్యి.
6. ఈ ముచ్చట్లు నీతో అన్ని పంచుకునే దోస్తుకి పంపు
7. నువ్వు అందరికంటే మెరుగ్గా ఉండాలంటే నా ముచ్చట్లను follow అవ్వు..
నచ్చితే లైక్ చేయి మావ..

-


19 MAR AT 20:27

వేడ్కోలుతో వీడ్కోలు

ప్రియాతి ప్రియమైన పదవ తరగతి విద్యార్థులారా!
మీరు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి మేము *దానశీలం* తో ధారవోసిన సుజ్ఞానరాశి
మీ మదిలో *ఎవరి భాష వాళ్ళకు వినసొంపు* గా భావ బీజాలు నాటాలని
పది పరీక్షల రణరంగంలో మీరు *వీర తెలంగాణ* ముద్దు బిడ్డలుగా విజయులై నిలవాలని,
మీ ఉన్నత చదువుల కోసం ఉత్సాహంగా *కొత్తబాట* ను నిర్మించుకొని నవ జీవన గమనానికి *నగరగీతం* నయాగరా జలపాతంలా పరుగులు తీయాలని, మీ భావి జీవన *భాగ్యోదయం* కోసం ప్రణాళికలను రచించుకొని *శతక మధురిమ* లోని నీతి సారాన్ని జీవితంలోకి ఒంపుకోవాలని,
మీము కన్నవారి కలలకు మీ*లక్ష్యసిద్ధి* ని జోడిస్తారని మీ ఉన్నతి మీతోటి వారికీ *జీవనభాష్యం* కావాలని మీ కొలువులకు *గోల్కొండ పట్టణం* పట్టంగట్టాలని మీరు చదివిన చదువులు పలువురికి జ్ఞాన *భిక్ష* పెట్టాలని,
మీ జీవిత గ్రంథానికి సెయింట్ ఆడమ్స్ ఉన్నత పాఠశాల *భూమిక*గా నిలవాలని
మీ ఇంటి *రామాయణం* లో ఆదర్శమూర్తి రాముడిగా, అపురూప సుగుణవతి సీతగా మీరు మెలగాలని కోరుకుంటూ...
శుభాశీస్సులతో…
మీ మధు సార్
తెలుగు భాషోపాధ్యాయులు
సెయింట్ ఆడమ్స్ ఉన్నత పాఠశాల, చిక్కడపల్లి.

-


Fetching Madhu Amaragani Quotes