Leela Sri Krishna   (Leela Sri Krishna)
29 Followers · 6 Following

"Writing" is the breath to my breath ☘️🌱
Joined 27 March 2020


"Writing" is the breath to my breath ☘️🌱
Joined 27 March 2020
26 AUG AT 16:45

She asked, "Why you always stare at my boobs?"
"Because, Looks won't fall on empty places" he replied.

-


17 AUG AT 9:12

చెరసాలలో పుట్టావా మేనమామ చంపేస్తాను అన్నాడా కన్నదొకరు పెంచినది ఇంకొకరు తల్లిపాలు ఇవ్వడానికి కన్నతల్లో మేనత్తో రాలేదు ఒక రాక్షసి పూతన వచ్చింది యశోద కి నీ పెళ్లి చేసే భాగ్యమ్ అందలేదు నీ వంశము గురు శాపానికి నోచుకుంది కౌరవుల్ని వధించింది పాండవులు అయితే తల్లి గాంధారి ఉసురు నువ్వు పుచ్చుకున్నావా

నీ జీవితంలో ఇన్ని కష్టాలను విడిచిపెట్టి 16 వేల మంది గోపికలు బృందావన రాసలీలలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు

మా చెడ్డ కళ్ళ దిష్టి నీకెంత తాకుతుందో కదా మాధవ!

-


27 JUN AT 19:34

జగములనే మాయలో పడేసే వాడి కళ్ళు కప్పటమ్ మన తరమా..!?
అంతంత కళ్ళు చేసుకొని ఎలా చూస్తున్నాడో సూటిగా..!

ఈ పొద్దు మాడ వీధులు కాస్త విశాలంగాను
రథ చక్రాలు మరింత బలంగాను మారాయి!

నిన్ను మోయుటలో మాత్రము
మనస్సు ఎందుకో బలహీనంగాను
నీకు చోటునీయుటలో ఇంకా
ఇరుకుగాను మిగిలిపోయింది స్వామి!

-


18 MAY AT 9:27

ఆ రేయి ఓ సుడిగాలొచ్చింది..!

ఏమ్ చెద్దామనుకుందో తెలీదు కానీ
వదిలి పోనంటూ విసిరింది
బాగా పొద్దు పోయింది కాబోలు
గగన దీపమ్ కొండెక్కిపోయె
ఆ రాత్రి నా పోరాటమ్ నా గుండె దీపాన్ని వెలిగించటమ్ కోసము
వణుకుతున్న చేతులతో నా దీపాన్ని ఆరకుండా
చేసే నా ప్రయత్నము చాలా సాహసమైనదే
క్షణాలు గడిచే కొద్దీ గోరంత ధైర్యము తెచ్చుకొంటూ
కొండంత సుడిగాలిని ప్రశ్నించా - "నీ చిరునామా ఏంటని?"
స్థాన బలమ్ కాదనుకొందేమో ఒక్క క్షణమ్ మూగపోయింది!

అప్పుడర్థమయ్యింది మనిషి ప్రతి క్షణము
సాహసమైనదే ఊపిరి పిల్చటముతో సహా!
మన ధైర్యమేమిటో మనకు తెలుసు!

-


11 MAY AT 9:13

ఆ రోజు నిన్ను చూసిన దానవులె కాదు
33 కోట్ల మంది దేవతల అడుగులు కూడా వెనక్కి పడ్డాయి
నిత్యానపాయిని గా పిలవబడే లక్ష్మీ దేవి కూడా చరిత్రలో స్వామికిటువంటి రూపమొకటి ఉందని నాకు తెలీదు అని ఆగిపోయిన క్షణమది!

ఆ సమయములో వెనుక నుంచి ఒక పిల్లవాడు అడుగు ముందుకు వేసాడు
ఆ బుడతడుకు స్వామి గర్జనలో ఏమ్ వినపడిందో!
ఆయన ముఖములో ఏమ్ కనపడిందో!
ఒంటిన చిమ్ముకున్న తండ్రి రక్తములో ఏమ్ చూసాడో!

లక్ష్మ్యాలింగితము కాస్తా ప్రహ్లాదాలింగితమయ్యింది

-


29 APR AT 11:50

ఆపదాః క్షణమాయంతి క్షణమాయంతి సంపదాః|
హే వశిష్ఠ! కిమ్ ఇహ న క్షణమ్?||

అని రాముడి అడిగిన ఒక్క ప్రశ్నకు వశిష్ఠుడు 32 వేల శ్లోకాలతో బదులిచ్చాడు అదే యోగవాశిష్టం!

కొన్ని ప్రశ్నలు చిన్నవైనా లోతైనవి అలాగే కొన్ని సమాధానాలు మౌనమైన సరే ఘాటైనవి!

-


28 JAN AT 10:55

చూడడానికి ఒకలాగా ఉన్నంత మాత్రాన
ఉప్పు చక్కరవునా - నీరు పన్నీరవునా..?

ప్రతి కౌగిలి చెలిమి కూడినది కాదు
నీ చుట్టూ వంచించే కౌగిల్లు - కాల్చేసే వడగల్లు ఉన్నాయి
ముత్యాల పళ్ళ వరుస వెనక కాటేసే నాలుక ఒకటి దాగి ఉంది

తస్మాత్ జాగ్రత్త..!

-


17 JAN AT 16:16

అనంత గగనానికి రగులుతున్న గుండె మంట తీర్చేదెవరు?
చీకటిన అన్ని కోట్ల సూదిపోట్లకు మందు పూసేదెవరు?
ఈ పొద్దు విడిచి పోయిన బంధాలెన్నో
రేపొచ్చి కమ్ముకునే కొత్త మబ్బులు మరెన్నో..!
అంత విరహాన్ని మౌనంగా భరిస్తున్న
ఆ నింగికి ధైర్యమిచ్చిందెవరు?

-


6 JAN AT 21:30

మన బ్రతుకుల్లో తీరని కోరికలెన్నో, చూడని వేడుకలు మరెన్నో..!

ధరించిన కోటి వేషాలు - భరించిన నోటి మాటలు
నటించిన సమయాలు - గతించిన జ్ఞాపకాలు
లోతైన మనశ్శాంతి కంటే జేనెడు పొట్ట తృప్తి గొప్పది మనకి
కనపడని విలువలు కంటే కనపడే వస్తువుల బరువు ఎక్కువ మనకి

నోటుల రుచి మరిగిన నాలుకలు మనవి నీతుల బోధ అర్హత మనకేల..!?

-


17 DEC 2024 AT 18:36

I'm not a white paper to write
in your wished manner.
I'm a rule notes, so that
you should wrought your
writes in my manner.

-


Fetching Leela Sri Krishna Quotes