ఒకటిగా ఉన్న క్షణం కుటుంబంలో ప్రేమలన్నీ దగ్గరగానే ఉంటాయి.అభిప్రాయాలు విబేధాలుగా మారిన క్షణం నాడు ఒకటిగా ఉండాల్సిన ప్రేమలన్నీ విడివిడి కుటుంబాలగా విడిపోతాయి.....
-
గుర్తించని ప్రేమకు దూరంగా...
మర్చిపోలేని బాధకు దగ్గరగా వెళ్తున్నాను....-
నెమలి కన్నుల నేరజానివో...
సీతకోక చిలుక అందానివో...
తీపి పెదవుల తేనటీగవో
దివికి నిచ్చెనేసి భువికి వచ్చిన అందాల రాసివో...
చిరుగాలి చూపుల వలయంలో చిక్కెను నా మనసే...
పురివిప్పిన నీ అందాలతో మైమరచెను నా హృదయమే...
రంభ ఊర్వశులు తలదించుదురు నీ అందం చూసి..
దేవేంద్రుడు పరవసమై దిగిరాడా నీ ఒంపుల సొగసును కనేసి..
కోటి దివ్వెల కాంతులు నిండిన ముఖారవిందువో...
నవరత్నాలై నన్ను చేరే చిరుమందహాసామో...
కన్నుల కాంతిని చూసిన చుక్కలు
సిగ్గుతో దూరం అవ్వంగా....
కమ్మని పాట గానమై
నీకై మారంగా....
కురులు కరుణించిన వేళ...
రోజాలు సంబర పడిన వేళ....
నా కలలు కాలి నడకన
పయనం సాగించిన వేళ
అందాల రాశి అయిన ఆమె సౌందర్య
రూపాన్ని వర్ణిస్తుంది నా కవిత ఈ శుభవేళ...
-
ఆశపడెను ఓ చిట్టి ప్రాణం...
చూపు పడుటకై దాని తాపత్రయం...
దాచలేకున్ననది దాని ఇష్టం...
మనస్సును వేధిస్తుంది దాని ఆర్తనాదం...
చాలించలేదు తన కోపం....
అయినా అవ్తుంది సదా....
నా మది తనకి దాసోహం..
-
ప్రయాణం ప్రశ్నిస్తున్నా....
ప్రయత్నం అల్సిపోతున్నా.....
తరుణం ఆటంకమై సూచిస్తున్నా....
గమనం మాత్రం గెలుపు కోసం పరితపిస్తుంది....
మన కలయికకు తానో సాక్ష్యమై నిలుస్తానంటుంది...
-
నీవే ప్రాణమని పరితపించే నా హృదయానికి నేనిచ్చే తొలి కానుక మన పరిణయ ఆహ్వాన పత్రిక....
-
ఉండే ఆలోచన ఉన్న వాళ్ళు వస్తుంటారు,వెళ్తుంటారు ఉండిపోవాలనుకునే ఆలోచన వచ్చిన వాళ్ళు మనతోనే ఉండిపోతారు....
-
పట్టుకుని వేలాడిగలిగే ప్రేమ కన్నా స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది ఉన్నతమైనది.
-
నిశ్చయించిన మూడు ముళ్ల బంధం ముచ్చటగా ఉండేది నిశ్చింత మనస్సులో లేనప్పుడే అది వచ్చిన రోజు విడిపోవడం కన్నా ఇప్పుడే మానుకోవడం మంచిది....
-
కూతురు ఆలోచనలు గడప దాటనంత వరుకే మనం కన్నవాళ్ళం గడప దాటాకా మనం అతిధులం కన్నామని ప్రశ్నించలేము పరువు పోతుందని బెదిరించలేము....
-