నా జీవితం సంగీతమైతె శోకమే ఒక రాగమవదా
నా ప్రాణమే సాహిత్యమైతె జీవితం ఓ గానమవదా
గుండెపగిలే వంద బాధలు మనసునే వేధించనీ
బాధ కూడా కావ్యమైతే వేదనే ఓ వేడుకవదా
కలతలేనీ కన్నులేవీ? నీరుపారని పల్లమేదీ
కలతలన్నీ కవితలైతే ఇంకా మనసుయే మైదానమవదా
నడకనడకకు అడుగు ఆగితే కదనమంచుకు కదిలిపోవు
నడకనీదీ నత్తదైనా ఏ ఎత్తుఅయినా చిత్తుఅవదా
విప్పడానికి జీవితం ఒక పొడుపుకథయే కానేకాదు
జీవించడం నీ దారి అయితే ఇక బ్రతుకుయే గోదారి కాదా
-
lakshman enugurthi
(ఇనుగుర్తి లక్ష్మణాచారి)
300 Followers · 82 Following
Columns : #గౙల్_పారడైజ్ #గజల్_మైఖానా
#Contents :
👉 Multi lingual Prosodic, lyrical and... read more
#Contents :
👉 Multi lingual Prosodic, lyrical and... read more
Joined 28 February 2019
10 MAY 2023 AT 18:38