Kks Kiran   (Kks Kiran)
34 Followers · 1 Following

read more
Joined 11 March 2018


read more
Joined 11 March 2018
23 MAY 2021 AT 9:34

భావోద్వేగాలతో ఊగే మనిషికి వాస్తవికత కనపడదు

యుక్తాయుక్త విచక్షణ మాత్రమే మనిషిని సత్యం వైపు నడిపిస్తుంది

-


6 NOV 2020 AT 21:25

" ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులం మనమే - కానీ తమ స్వార్ధం కోసం విలువలొదిలి , వక్రమార్గంలో ప్రయాణించి మనిషిలో మూర్ఖత్వాన్ని ప్రేరేపించగలిగితే మనిషిని మించిన మారణాయుధం మరోకటి లేదు "

-


5 NOV 2020 AT 20:58

ఏ అనుభవం యొక్క తీవ్రతనైనా తగ్గించగల లక్షణం మన మనసుకు ఉండడం వరమా ? లేక ఓ శాపమా 🤔

-


18 AUG 2020 AT 17:42

మన మనసు ఓ సినిమా తెర లాంటిది

ఏమైతే భావాలను మనం దానికి అందిస్తున్నామో అవే అది ప్రతిఫలీకరిస్తూ ఉంటుంది - అదే నీ మాటలలో , చేతల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది

నీ ఆనంద విషాదాలకి , నీ శారీరక , మానసిక అనారోగ్యాలకీ చాలా వరకు నీ ఆలోచనలే కారణం

వాటి ద్వారా స్వర్గాన్నే పొందుతావో లేక నరకాన్నే నిర్మించుకుంటావో అనేది purely నీ Personal ఛాయిస్సే

-


25 MAY 2020 AT 19:49

ప్రతీ మనిషీ తన జీవితానికి ఒకరు కావాలనుకోడు - తనే మరోకరికి చెందాలనుకుంటాడు

ఈ కారణం చేతనే ఏ మనిషైనా మరో మనిషిని స్నేహించడం కానీ ప్రేమించడం కానీ చేస్తాడు

-


15 APR 2020 AT 20:38

భక్తి ఆధారపడే గుణానికి సంబంధించినది‌ కాదు - ఆర్తికి సంబంధించిన విషయం

-


4 APR 2020 AT 15:45

యుద్ధంలో గెలవడం గెలవకపోవడం అనేది ఆ ఆ వ్యక్తుల అర్హతల వల్లో , బలబలాల వల్లో జరగదు అన్నివేళలా

చాలా సందర్భాలలో అది స్థల కాలాదుల పైనా , సందర్బం బట్టి ఆధారపడి ఉంటుంది

-


17 FEB 2020 AT 12:35

మనిషి జీవితంలోని ప్రేమ, ద్వేషం, బాధా , కోపం , విరహం ఇటువంటి భావాలను చూపడమే కళల ప్రధానోద్దేశం

వాటినెంత ప్రభావవంతంగా తన కళారూపం ద్వారా వ్యక్తం చేసాడన్నదానిపైనే ఆ కళాకారుని గొప్పదనం ఆధారపడి ఉంటుంది

-


10 NOV 2019 AT 18:20

ఇద్దరు వ్యక్తులు స్పర్శ ద్వారా దేహాలతో పరస్పరం రాసుకొనే ప్రేమలేఖే శృంగారమంటే

అది కేవలం కండరాల ఒరిపిడి వల్ల కలిగే సుఖమే కాదు

అది స్త్రీ పురుషుని బంధంలో ప్రేమను వ్యక్తీకరించుకొనే చర్యలలో అత్యున్నతమైన‌ చర్య

-


9 NOV 2019 AT 15:05

మతం , దేశభక్తి

ఈ రెండూ మనిషిలో
మోతాదు మించి దాటితే మానవ విలువలకు తిలోదకాలిచ్చే ముహూర్తం ఏదో దగ్గరపడ్డట్టే లెక్క

-


Fetching Kks Kiran Quotes