ఏ మూలన వెతికిన
మనిషి స్వార్ధ చింతన
తప్ప మరేదీ
కనిపించడం లేదు...స్వార్ధం జీవిత
పరమార్థంగా మారితే తప్ప
మనుగడేలేదు ఇక్కడ...ఓ స్వార్ధ
జీవి తెలుసుకో ఇక్కడ
అన్ని స్వార్థంతో నిండిన
వాగులే,వంకలే
ప్రవహిస్తున్నాయని...!-
ఏ మూలన వెతికిన మనిషి స్వార్ధ చింతన తప్ప మరేదీ కనిపంచడం లేదు...స్వార్ధం జీవిత పరమార్థంగా మారితే తప్ప మనుగడేలేదు ఇక్కడ...ఓ స్వార్ధ జీవి తెలుసుకో ఇక్కడ అన్ని స్వార్థంతో నిండిన వాగులే,వంకలైయి ప్రవహిస్తున్నాయి
:- రాజర్షి-
ఇద్దరు వ్యక్తులు అభిప్రాయాలు
కలుస్తాయి ఒకటవుతారు...అదే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి విడిపోతారు...అది వారి వ్యక్తిగతం...పక్కనోడి జీవితంలోకి తొంగిచూడతానికి ఎవరిచ్చారు ఆ హక్కు..? ఓసారి గురివింద సామెత గుర్తుకు తెచ్చుకుంటే బావుంటుంది.
:- రాజర్షి-
నిత్యం నిన్ను రగిలించేవి ఒకటి నువ్వు చేసిన తప్పులు అయితే...రెండోది నీపై ఇతరులు వేసే నిందలు...నీ తప్పులు నువ్వే ఒప్పుకోవాలి...ఇతరులు నీపై వేసిన నిందలకు నువ్వు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి...!
:-రాజర్షి-
గుండెను కోసే బాధ గుండెల్లో ఉంటే రాతలు మాటల తూటాలవుతాయి...!
:-రాజర్షి-
True people cry when you leave,Fake people leave when you cry...!
:-Rajarshi-
ఒకరు ఏమో మదిలోని భావాలను నిద్రలేపితే...మరోకరు మదిలో చైతన్య దీపికలు వెలిగించిపోయారు...వచ్చి వెళ్లిన వారందరూ నీకు గొప్ప జీవితపాఠాలు నేర్పిన వాళ్ళే...!
:-రాజర్షి-
పవన పుత్రుడువా... శక్తి పుత్రుడువా అంటే మాకు మాత్రం నువ్వు జనం నుండి జనించిన జనసేనానివి...!
:-రాజర్షి-
రానున్న శూన్యాన్ని ఊహించలేను...కానీ ఆ శూన్యానికి మౌనమే బాసటగా నిలుస్తుంది ఏమో...!
:- రాజర్షి-
రాతలో లేని వాటి గురించి, అర్థం లేని వాటి గురించి బాధపడటం వలన అవి ఎప్పటికి అర్థవంతం కావు...!
:-రాజర్షి-