అందానికి అర్థం అనుభవదారుడే
-
Advocate
ప్రకృతితోనే నా స్నేహం
కవిత్వమే నా అంతరంగం
పుణ్యం నోచుకోని పాపానికి
పాపం నోచుకోని పుణ్యానికి
ఎవరు ప్రథమం ఎవరు అథమం-
ప్రకృతి పలు విధాలుగా
నీ ఇష్టానికి అనుగుణంగా ఉంటే బావుండు అన్నప్పుడు
సాటి మనిషి వైవిధ్యతను భరించలేవా-
నా పతాకస్థాయికి నా పతనానికి
పరువు ప్రేమ ప్రతీకారం కారణాలు కాకూడదు
ఆలోచించే ఓపిక ఉన్నంతకాలం-
వ్యథకు వధ మార్గమంటే
ప్రాణ చివర సానుభూతిపరులు స్వార్థపరులు-
పేదవాని ఫిలాసఫీకి వ్యసనం జన్మనిస్తే
షావుకారి ఫిలాసఫీని సుఖం నిర్ణయిస్తుంది-