నువ్వు దూరం పెట్టక ముందు నుంచే
దూరం నుంచి చూస్తూ ఇష్టపడి, ఆ విషయాన్ని చెప్పకలేక ఇబ్బందిపడ్డాను.
దూరం నాకు కొత్త కాదు. కాని నువ్వు దూరం పెట్టడం సరికొత్తగా ఉంది. దానికి మరింత దగ్గర కాకున్నాను.
నీ తిరస్కారానికి నేనెన్ని జ్ఞాపకాలు పారేసుకోవాలో..
నీ అంగీకారానికి నేనెంత ఆశల్ని పోగుచేసుకోవాలో..
Incomplete_feelings-
#ప్రణయం
చలనం ఉన్న మాంసపు ముద్దకి
గమనం నేర్పిన నీ ముద్దు.
మేఘం నా దాహాన్ని తీర్చలేదు
నీ దేహం తీర్చినంతగా...
నీ ప్రేమ ఒక తీవ్రత
ఉచ్ఛ స్థితి తాలూకు ప్ర(ణ)ళయం .
-
నిశబ్దం వంటబట్టిన దేహం
మౌనం తీర్చింది దాహం
అహం ..మోహం దాగెను శూన్యంలో..-
మోసపోవడానికి తయారయిన గుండె కదా
పూర్తిగా నమ్మడానికి 'సందేహం' ఎందుకు నీకు?
-
1). నీ గురించి చెప్పాలంటే 'పదాలు' సరిపోవు
పెదాలు మాట్లాడితే 'మాటలు' అయిపోవు.
2). నిన్ను చూసినప్పుడు ' అనుమానం ' నాకు
' అందం ' నీ దగ్గరే ఉండిపోయిందా అని..!!
3). వర్షం పడ్డప్పుడు కమ్ముకునే మబ్బు లా
ఎండ కాసినప్పుడు నీడనిచ్చే మేఘం నువ్వు.
4). వద్దు వద్దు అంటున్న సముద్రపు ఒడ్డు నువ్వు
కావాలి కావాలి అంటున్న సముద్రపు తీరం నేను.
5). ఇష్టం అంటే వెనకాల పడడం కాదు
నీ దృష్టి లో వెనకపడిపోకుండా ఉండడం.
-
కవిత్వం
ఆ మబ్బు మోజుపడి ఏడిస్తే
భూమిపై జీవితాలు మొలిచాయి.
నువ్వు ఆశపడి ఏడిస్తే
కనీసం బ్రతుకు నేర్పు పాఠాలు కావా?
#Tear_drops_very_precious 💕-
Love is just spitting which is ejected from fucking heart. That's why we call it's unconditional😠😠
Hari_sayings-
ఎక్కువ కావాలనుకున్నది
ఎప్పటికీ వద్దు అనుకున్నది
' ప్రేమ '
అమితంగా ఇష్టపడి
మితంగా చూపిస్తే
కడుపు నిండదు.
ఇష్టం
నిన్ను దూరం నుండి చూస్తూ ఇబ్బందిపడడం
నీతో కలిసి తినాలి అనుకున్న ప్రతిసారీ కడుపు నిండుగా ఉన్నా ఆకలి ఆటోమేటిక్ గా వస్తుంది.
కడుపు వద్దంటోంది
కళ్ళు కావాలి అంటుంది "అంటే అదేనా?-
" Unknown_feelings "
నేను పేరంటూ పెట్టుకొలేని భావాలకి
కొందరు సలహ ఇచ్చి పేరు పెడతారు.
మరి కొందరు నాకేం తెలీదని
లొలోపల నవ్వుకుంటారు.
పేరంటూ లేని ఋతువుల్ని నా గుండెకాయి కంటుంది
అది నా గది నిండా గాయాలు జల్లి పోయింది.
దానికి అందరు జ్ఞాపకాలని,
అయిపొయిన గతం 'అని పేరు పెట్టుకున్నారు.
జ్ఞాపకాలు లేని స్థలం కోసం జీవితాన్ని
మరణం దాక మొయ్యాలా 'అని అనుమానం నాకు...
ఆశించనప్పుడు ఆశ బాగుంటుంది అచ్చం ఆ నిలాకాశం లా, ఎందుకంటే? అదెప్పటికి అందదు.
అందనవి అందమైనవా?
అది చెట్టు చివర కొమ్మపై కాసిన జామపండు లాంటింది.
కష్టపడితే దొరుకుతుంది లేదంటే చిలక కొరికి వదిలేస్తుంది.
మనసు తిని వదిలేసింది ' ప్రేమే ' కదా.
చిలక కొరికిన జామకాయ తియ్యాగా ఉందని
మనసు తిని వదిలేసింది ప్రేమే అని,
మళ్లీ ప్రయత్నిస్తే 'ఎంగిలి' గుర్తుకు వస్తుంది.
#హరి Rightings-