జగమంత గ్రామం అందున జానకి రామం
అయ్య మాటకై అరణ్యాన చిన్న విరామం
సీతను తలచి తలచి శోకాభిరామం
సుగ్రీవునితో చేయి కలిపి స్నేహాభిరామం
సతికై, ధర్మానికై రామ రావణ సంగ్రామం
రణమందు విజయుడై లోకాభిరామం
అడవిని దాటి అందరిని చేరి అయొధ్యారామం
పుడమిని పరిపాలించెను పట్టాభిరామం
-- జయ ప్రకాశ్-
ఆకలి ఉన్న మనిషి
ఆకలి తీర్చు రైతు ఓ ఋషి
నేల కడుపు కోసి నీ కడుపు చూసి
ఆనందించు వాని చేతిలో మసి...
విత్తులేసే వానిని చిత్తు చేస్తున్నారు
ఎత్తునున్న విత్తమున్న దొరవారు
కోత కోసే కత్తి పీక కోసుకొమ్మందే
రక్తాన్ని చూసి నేల కన్నీరు చిందిందే
కోత కోయువాని చేతిరాత మారదా
తలరాత రాసినోడు రైతు వంక చూడదా
వంకలేని ఈ మట్టి మనిషి దేవుడే
దేవుడైన భూమికొస్తే అన్నదాతకు అతిధే
-
మూడు అక్షరాల జీవితంలో
రెండు అక్షరాల ప్రేమ
ఒక్క నన్ను నిన్ను చేసింది
ఒక్క నన్ను మన్ను చేసింది..-
తాళం వేసుకున్న భూమిపై
త్యాగాలను మోస్తున్న ఓ కామ్రేడ్స్..
బతుకు పై ఆశతో బంధనాల్లో ఉన్న
మాకై మీ బతుకు నిచ్చి బతుకుతున్న కామ్రేడ్..
లాల్ సలాం..లాల్ సలాం...-
Too much living in both dreams and life makes a person weird
-
బ్రతుక్కి, భయానికి స్పష్టమైన నిర్వచనం లేదు.. అవి మనిషి మనిషికీ మారిపోతుంటాయి
-
నేను సహజం
చీకటి బతుకు నా నైజం
వెలుగు చూస్తే మహారాజం
అందుకే నా పేరు నిజం...-
మా మన్నుపై మాకున్న దన్ను మా సిపాయి
దాన్నేమి చేయగలదు మీ పిచ్చి దేశపు సత్తు రూపాయి
మా పై దాడికి బదులివ్వడం మాకొచ్చే ప్రతి కల
ఆ విజయం నిలవాలి భారతదశపు విజయ ప్రతీకలా....
-
కులమెందుకురా మనకి కాటికాడ కుక్క వలె
మతమెందుకురా మనకి వ్యర్థమైన మన్ను వోలె
కులమనే కుట్రలో కుంచించుకోకు
మతమనే మత్తులో మదించిపోకు
చితిపై అగ్ని ఎరుగదు అగ్ర వర్ణం
దాహం తీర్చే నీరు చూడదు నిమ్న వర్ణం
మనుజులందరి రక్తం ఏక వర్ణం
అది ఎరిగిన వాని మనసు సువర్ణం
-
ఉదయించే ఉషస్సుతో ఉగాది
పులకించెనులె తెలుగువాది
చిత్రాలు చేసే మెళకువ తెలుగు
చైత్రాన లేచే తొలి మెలకువ తెలుగు
అక్షరాలు యాభైయారు
ఋతువులెమో ఇంకో ఆరు
ఆరు రుచుల జీవితం
ఏ రుచి కాదు శాశ్వతం
నింబసుమాలు మీకు ఇస్తూ
నిండైన ఙ్ఞాపకాలు మోస్తూ
వెడలెను హేమలంబి
వచ్చెను విళంబి-