HK   (©HARK)
84 Followers · 2 Following

Joined 8 January 2019


Joined 8 January 2019
9 MAR AT 0:02

అలుపెరగని ఆలోచన కెరటాల ఒడిలో ఆనంద తీరాన్ని తాకుతూ, అప్పుడప్పుడు చేరలేని గమ్యాలకై మరింతగా పైకి ఎగసిపడూతూ
వెన్నెల తోడుగా ఉన్న కడలి.............

-


14 FEB 2023 AT 2:46

చుట్టంలా వచ్చి చూసేల్లేపోతావే వాన
నీలో నన్ను మైమరపించి వదలివెళ్లడం న్యాయమా
వస్తూ వస్తూ హరివిల్లుని తీసుకొచ్చి అందనంత దూరానా పెట్టి పోతావే
నన్ను ఆనందింపజేసేందుకా లేక ఆటపట్టించేందుకా ఈ దోబుచులు
నాతో నాలోనే ఉండిపోవే లలన, నిన్ను విడిచి ఉండడం కాదే నా వలన

-


14 FEB 2023 AT 0:39

చీకటేనా ప్రపంచం అనుకున్నా
చీకటిలో దాగిన అందం, అద్భుతం తెలియక
చీకటి, కోటి తారలను తెస్తూ, తోడుగా వెన్నెలనిస్తూ,
పిల్ల గాలుల మృదువైన గానాలనందిస్తూ,
మదిలో ప్రశాంతాతను నింపుతూ,
ఎన్నో ఊసులు, ఊహలకు తావునిస్తూ,
కనులపై కనురెప్పలను కప్పుతూ,
ఇంతకంటే మంచి విశ్రాంతి ఏముందంటూ
మైమరమించే చీకటే నా ప్రపంచం

-


14 FEB 2023 AT 0:13

We saw each other and we fell in love in first look
We always use to meet in the evenings
Wherever I go I get the company of my love and will have in future too and that's my love(moon)


-


4 MAR 2022 AT 0:23


సోలి నీటిలోకి జారాడు
నీలిరంగు సంద్రం రవికాంతులద్దుకుంది
నీలాకాశం నిశిని ఆహ్వానించగా
మల్లె మబ్బుల ముసుగులో
తారాగణంతో జాబిలి జతగా
చిరుగాలితో శశిలా మెదలైంది

-


3 MAR 2022 AT 0:20

చీకటి చెలికత్తెలు చుక్కలట
చుక్కల ప్రియసఖి వెన్నెల
వెన్నెల చాటున మేఘాలు
మేఘాల మాటలు చిరుగాలులు
చిరుగాలుల మౌనం సెలయేళ్ళు
సేలయేటిలో కలువల సాహిత్యం
సాహిత్య సీమలో సంగీతం
సంగీతపు అలలతో సంద్రం
సంద్రపు కెరటాల ఒడిలో అలసిన తీరం
తీరం వెంబడి వెన్నెల రాకతో ప్రతినిత్యం....

-


14 DEC 2021 AT 0:50

చిన్ని జీవితానికెన్ని పరుగులురా,
పొట్ట కూటికెన్ని విద్యలురా,
కనిపించని ప్రేమకెన్ని రూపాలురా,
కనిపెంచిన కన్నులకెన్ని కన్నీలురా,
జీవితమంతా బందాలతో కట్టేవురా,
కడ చేరే పొద్దుకు వదలమన్నావే జంగమా,
చివరకి ముక్తి పొందుటే జీవిత సారమన్న శంకరా,
ఇంకెన్ని ఘడియలు వేచి ఉండాలయ్య కైవల్యమానందించేందుకు!!

-


25 OCT 2021 AT 16:07

When you aim high, you should also try hard to reach
Nothing comes just from imaginations, Try and Try till you achieve what you really want and wish to enjoy with

-


24 OCT 2021 AT 23:32

రాగాల సరిగమలతో
మదిలో కలిగిన భావం సాహిత్యమై
పరిసరాలలో ప్రతి శబ్దం సంగీతమవగా
మృదువైన చిరుగాలి స్వరకరై
మధుర గీతికల ఆలాపనైన జీవనం

-


20 OCT 2021 AT 21:45

నీ రాకతో చీకటి నిండిన నింగిలోన కాంతులు విరజిమ్ముతావే
నీ జతతో చుక్కలకి చక్కని తోడవుతావే
నీ చల్లదనంతో గాలికి మరింత హయినిస్తావే
విరిసే జాజులు, విరియని కలువలు వేచిచూసేంతలా
ముద్దులొలికే మల్లెలా వికసిస్తూనే అందక ఊరిస్తావే
జాబిలమ్మ నుంచి చందమామ వరకు అన్ని నీ ముద్దు పేర్లే కదా
ముగ్ద మనోహర తారవయవుగా!!

-


Fetching HK Quotes