Harshitha Vipparla   (Harshi innovator ✍)
50 Followers · 5 Following

Meaningful thoughts ..
Joined 28 January 2020


Meaningful thoughts ..
Joined 28 January 2020
18 APR AT 13:32

నిరాశలతో సాగుతున్న
బ్రతుకులో ఆశవి నువ్వే...
చీకటిదారిలో వెలుగు నిచ్చిన
చిరుదీపం నువ్వే ....
మౌనమై మిగిలిన ఎన్నో మాటలకి
పలుకులు నేర్పింది నువ్వే....
నాదారిలో నేనుంటే మరో ప్రపంచాన్ని పరిచయం
చేసింది నువ్వే ....
కష్టాలకన్నీళ్ళు తప్ప తెలియని నాకు
ఆనందాలను, నవ్వులను
ఇచ్చింది నువ్వే....
జీవితం అంటే ఏంటో తెలిపింది నువ్వే
అందుకే నీకై ఈ జీవితం అంకితం.....

-


12 APR AT 11:50

ఆపదలో ఆదుకునే వాళ్ళ కన్నా
అవసరానికి వాడుకునే వాళ్లే ఎక్కువ
ఆపద అంటే ఒక అబద్ధం
అవసరమనేది మాత్రమే నిజం.

-


23 FEB AT 9:23

ఒక దైర్యం
ఒక భరోసా
ఒక ఆదర్శం
ఒక నమ్మకం
ఒక కనువిప్పు
ఒక సంతోషం
ఒక బాధ
ఒక అవేదన
ఒక కన్నీళ్ళు
కష్టాలు రాని
కన్నీళ్ళు రాని
పడిన ,లేచిన
చచ్చిన , బ్రతికిన
ఈ జన్మ సినిమాకే అంకితం .

-


23 FEB AT 8:31

నన్ను నేను నమ్ముకుంటా
కానీ
నాకు ఉన్నవన్నీ అమ్ముకొను.

-


6 FEB AT 12:25

No one will come and help you in any situation coz everyone are busy with their personal works dude ...
So,
Just focus on your life and enjoy every moment ..

-


27 JAN AT 11:35

జీవితం అంటే
ఇద్దరి కారణంగా పుట్టి
వందల కారణాలతో మరణించడమే.

-


14 DEC 2023 AT 21:09

ఏం చెయ్యాలో తెలీదు,
ఏం మాట్లాడాలో తెలీదు ,
ఏం ఆలోచించాలో తెలీదు ,
ఏటు నడవాలో తెలీదు,
ఎవరిని నమ్మాలో తెలీదు,
ఎవరు మనవారో తెలీదు ,
ఎవరు మనవారు కాదో తెలీదు ,
ఎవరు ముంచుతారో తెలీదు,
ఎవరు తోడుగా ఉంటారో తెలీదు,
ఎవరు గోతులు తవ్వుతున్నారో తెలీదు,
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు,
అసలు జీవితం అంటే ఏంటో తెలీదు ,
అసలు ఎలా బ్రతకాలో తెలీదు .


-


14 DEC 2023 AT 20:50

ఎలా బ్రతకాలి ??

-


26 OCT 2023 AT 11:52

చుట్టుకున్న సమస్యలు
వద్దన్నా పెరుగుతున్న బాధ్యతలు
భారంగా మారుతున్న బ్రతుకులు
అలసట లేకుండా జారుతున్న కన్నీళ్లు
అలుపెరగకుండా సాగుతున్న అడుగులు
చేయి చాచి అడుగుతాము అంటే మనసు రాక
చావడానికి ధైర్యం సరిపోక
రూపాయి లేనిదే ముందుకు వెళ్లలేము
అలానే ఉన్న చోటనే ఆగిపోలేము
వీటి నుంచి ఎక్కడికైనా ఎగిరిపోవలనిపిస్తుంది

-


23 AUG 2023 AT 23:21

కరగని దూరం
తరగని ప్రేమ
కళ్ళనిండా నీ రూపమే
గుండెనిండా నీ ధ్యానమే
పలికే ప్రతీది నీ నామమే
నీకోసమే ఈ పోరాటం
నీకోసమే ఈ ఆరాటం
నువ్వు లేనిదే ఈ నవ్వు లేదు
నువ్వు లేనిదే అసలు నేనే లేను
గడిచే ప్రతి నిమిషం నీకోసమే
బ్రతుకుతున్న బ్రతుకు నీకోసమే
రోజులు మారిపోయాయి
చుట్టూ ఉన్నవాళ్లు మారిపోయారు
కానీ ఈ గుండెచప్పడు ఎప్పటికి నీకోసమే.





-


Fetching Harshitha Vipparla Quotes