Harsha vardan   (Harsha)
14 Followers · 4 Following

Joined 11 September 2018


Joined 11 September 2018
9 MAR AT 22:50

Sadiyon se tarse hain jaisi zindagi ke liye
Teri sohbat mein duaayein hain usi ke liye
Tera milna hai us Rab ka ishaara
Maano, mujhko banaaya tere jaise hi kisi ke liye

Those were just lyrics—until I truly felt them...
And today, with all my heart, I say, my dear,
It’s been years of longing, a wait so true,
If fate writes soulmates in the stars above,
With every breath, I wish for you.

Will you... ❤️

-


18 DEC 2024 AT 3:29

ప్రియమైన నీకు,

అసలు ఎవరు నువ్వు , ఎలా ఉంటావో తెలీక ముందె నన్ను నీ ఊహలతో ముంచావు. ఎలా నవ్వుతావో తెలీకుండానే నీ నవ్వు కోసమే నేను మాట్లాడుతున్న అని నన్నే నమ్మేలా చేసావు.

నాలుగు రోజుల ఈ పరిచయం , నలభై ఏళ్ళు నాతో కలిసి నడిచే ప్రయాణం అవుతుందా....!

-


31 OCT 2024 AT 23:09

తన పరిచయం...

ఎదో మాయ ఉంది ఆ పలకరింపులో... ఎంతో కాలం గా లోపలున్న వెలితిని తీసింది తన నవ్వుతో ఒక్కసారిగా...
ఏదో మర్మం ఉంది ఆ చూపులో... సముద్రం లో అలల ఆటు పోటుల్లాంటి నా ఆలోచనల్ని తన వైపు లాగేసి కూర్చోపెట్టింది ఉన్నపలంగా

ఎవరు ఈ వనిత అని ఆలోచించే లోపే... తనే నా రాత అని అనిపించింది నా చేత....

-


29 OCT 2024 AT 0:19

...తను...
నన్ను నాకే కొత్తగా చూపించిన అద్దమా... లేక నన్ను నేను మార్చిపోయేలా చేసిన అందమా...

...తను....
ముందు కొచ్చి చల్లటి స్పర్శనిచ్చి వెనుకకు వెళ్ళే సముద్రపు కెరటమా....
లేక సముద్రాన్ని కూడా నిద్ర లేపే ప్రియమైన వెచ్చని కిరణమా...

ఏమో తెలీదు...
తనను వర్ణించే పదం దొరకట్లేదో..
లేక తన వర్ణనకు పదాలే సిగ్గుతో దక్కున్నాయే...

-


5 APR 2023 AT 0:41

ఏం మాయ దాగుందో ఆ నవ్వులో 🥰 ...
బరువెక్కిన తలలో ఉన్న లక్ష అలసటలను ఒక్క క్షణం లో మాయం చేసే అంత సమర్ద్యమా...
ఏం ఉందొ ఆ కళ్లలో🥹 ...
క్షణ కాలం , కాలాన్నే ఆపేసినట్లుగా చేసి మరో ప్రపంచం లో నీ ఆనందపు అంచుల్లో దించేంత ఆహ్లాదమా...
ఏమో తెలీదు, కానీ తన తలపుల తాలుకు పలుకులే ఇంత బాగుంటే, తానే చెంతనుంటే...
ఏమో ఏమవుతానో 🫨

-


19 DEC 2022 AT 4:36

నేనూ...
చిత్రమైన చీకటిలో, ప్రపంచం నిద్రిస్తున్న వేళ, తలపుల మైదానంలో ఒంటరి క్రీడాకారుని...
నిర్మించుకున్న జ్ఞాపకాల ఊవిలో, మతి తప్పి చిక్కుకున్న, బాటసారి నేను...
దరిదాపున అమృతమనే ఆనంధాన్ని విడిచి, దుఃఖపు గరళాన్ని తీసుకున్న నేను...
నిజం గా మెలుకువలో ఉన్నానా, లేక కను రెప్పలు తెరిచి ఈ రంగస్థలాన, నాటకిస్తున్నానా...

-


9 AUG 2022 AT 15:17

చెలి కన్నుల అందం ఆమె మోముకు ఆకాశపు చంద్రుని వాలె తలపించినను... తన చూపుల వెన్నెల మనసును తాకనే లేదు...
ఆ క్షణం, చంద్రబింబం వంటి తన ముక్కెర తనుకు నక్షత్రపు కాంతి వాలె మనసును రంజింపచేయగా...
ఈ దూరం నా మనసును విరహబాధతో శిక్షించుచున్నది...

తన బింబపు సోయగం చూచిన మధికి... తన స్పర్శ తాళుకు మోక్షమొసగే మార్గమెన్నాడో....

-


11 JUL 2022 AT 11:27

Naku nenu nachatlenu 😑

-


23 MAY 2022 AT 13:25

I can't give up on my relation that easily..

But I can't be the old me either ...

-


23 MAY 2022 AT 13:22

What's the cost of your slipped words....

An unexpected heart broken dead relation ....

-


Fetching Harsha vardan Quotes