ఒక విజయం కావాలి అంటే కొన్ని కష్టాలు తప్పవు,
అష్టమి, నవమి కష్టాలు దాటితే
విజయం అందుతుంది,
అందరికి విజయదశమి శుభాకాంక్షలు-
శిఖరం పై కుర్చున్నంత మాత్రాన కాకి గ్రద్ద కాల... read more
ప్రతి వాడికి పక్క వాడి జీవితం ఇంతేగా అనిపిస్తుంది,
ఎవడికి వాడికి వాడి జీవితం
కష్టంగా, బరువుగా అనిపిస్తుంది...-
రెండు శతాబ్దాలరాక్షస బానిస సంకెళ్లు,
డబ్బై తొమ్మిది సంవత్సరాల రాజకీయ బానిసత్వం,
కలగలిపిన విచిత్ర స్వతంత్ర్యం...
పరాధీనంలో బ్రతుకుతూ స్వాతంత్య్రం
అనుకునే అందరికీ...
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-
స్నేహం,
అద్దంలో ప్రతిబిబం,
నీళ్లలో ప్రతి రూపం,
కారే కన్నీటిని తుడిచే చెయ్యి,
మాటతో పని లేకుండా
మనసును అర్థం చేసుకునే మనిషి,
అటువంటి నా స్నేహితులందరికీ
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...-
షడ్రుచుల సమ్మేళనం మన జీవితం,
తియ్యని జ్ఞాపకాలు,
చేదు అనుభవాలు,
వగరు విమర్శలు,
ఘాటు ఘటనలు,
సముద్రమంత ఆలోచనలు,
బంధాల విలువలు పెంచే స్నేహితులు,
మిశ్రమ ఫలితాలు,
కొత్త కొత్త పాఠాలు,
ఈ విశ్వావసు తెలుగు సంవత్సరాది
శుభాన్ని అందించాలని ఆశిస్తూ-
స్థానం వేరైనా
మీ ప్రస్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే,
మేము రక్ష అని రాఖి కడతారు
కానీ తొమ్మిది నెలలు
మమ్మల్ని రక్షిస్తేనే కదా మేము,
మీరు మా జీవితంలో భాగం కాదు
మీరే మాజీవితం,
మహిళామణులు అందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...-
మూడు కండ్లోడు,
ముక్కోపి గురుడు,
బూడిదంటినోడు,
ఒంటెద్దు వాహనుడు,
నీటి చుక్క సాలు,
ఒక్క ఆకైన మేలు,
సామి సామి అంటే సాలు,
మోక్షం ఇదిగో అంటాడు,
వట్టి భోళా శంకరుడు,
తిక్కలోడు మా శివయ్య
శివరాత్రి శుభాకాంక్షలు-
రెక్కలు ఇచ్చిన రాజ్యాంగాన్ని
పంజరంలో బంధించి ఆడించే
రాజకీయ గారడీలో
జోకర్ గా మారిన ఓటరుని,
ప్రజాస్వామ్య వారసత్వంతో
రాజకీయ రాచరికానికి
మద్దతుగా నిలిచే బానిసని,
నాలాంటి వారందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...-
కన్న వాళ్ళని కూడా వదిలెయ్యమనే విధానం వారిది
కష్టపడ్డ ప్రతి జీవి కుటుంబమే అనుకునే పద్ధతి మనది
ధాన్య సంపదను సృష్టించడానికి మనకోసం కష్టపడే
ప్రతి జీవికి ఆ జీవులను సాకే ప్రతి కుటుంబానికి
కనుమ పండగ శుభాకాంక్షలు...-
పొంగే పాలన్ని 'పొంగ'ల్లే,
పండిన పంటలన్నీ ఆనందాలే,
ముగ్గులు వాకిళ్లన్నీ సంబరాలే,
బసవన్నలు, హరిదాసులు,
శక్తి వేషాలు, సరదా అల్లుళ్ళు,
అంబరాన్ని అంటే సంబరాలే,
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు-