రైతన్నకి పొలం, రైటర్ కి కలమెలానో,
నువ్వు, నాకు అలా....
పిల్లాడికి తాయిలం, పెళ్ళానికి తాళెలానో,
నువ్వు,నాకు అలా....
మీనానికి నీరూ, మా నాన్నకి,నేనెలానో,
నువ్వు,నాకు అలా....
నువ్వు,నాకు అలా,
నువ్వే నా "కల"
నువ్వే నా "కళ"
✏️❤️-
ఆపదలో ఆదుకునేవాడు
ఆత్మీయుడు.
అయ్యో అనేవాడు
పరాయివాడు
అయ్యో అనాల్సినోడు ఆదుకున్నాడంటే...
వాడు దేవుడు.-
మనసు విరిగినోడి మాట,
ఘాటుగానే ఉంటుంది.
ఆ ఘాటు వెనుక గుట్టు
వాడేంటో లోతుగా తెలిసినోడికే
అర్థమౌతుంది.-
ముక్కుసూటిగా మెలిగితే,
మొక్కగానే మిగుల్తావ్.
మాయచేసి బతికేయ్,
మహావృక్షమైపోతావ్.-
వీర్య కణమప్పుడే,.వీరరణం చేసావ్.
నీకీడ వ్యధలేందిరా...?
నీ కధ నీవె రాయాలి లే రా.-
నిన్ను ప్రేమించే మనుషులు నీకు లేనపుడు,
నువ్వు చేస్తున్న పని ని
నువ్వు ఎక్కువగా ప్రేమించు.
ఆటోమేటిక్ గా....
ఆ పనిని ప్రేమించే వాళ్ళందరూ
నిన్ను_ప్రేమిస్తారు.-
పూటకో లోటుతో,
నాలో,నేను నలుగుతున్నపుడు,
నాలోని,నాతో, సోలోగా సంభాషిస్తావ్.
శభ్భాష్ రా శంకరా.-
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు,
కన్నెత్తి చూడనోళ్ళు,
నీ లోపాలను వెతికిమరీ,.
వేలెత్తి చూ(చం)పుతారు.
ఏం బంధాలురా...సామీ.
మీకో...🙏-
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు,
కన్నెత్తి చూడనోళ్ళు,
నీ లోపాలను వెతికిమరీ,
వేలెత్తి చూ(చం)పుతారు.
ఏం బంధాలురా...సామీ.
మీకో...🙏-