నేనో పడిలేచే కెరటం
గెలుపుకి పరితపించే ప్రాణం
మది మెప్పించే మాములు రూపం
మతి బ్రమించే ఆయుధ క్షణికావేశం...!!-
పొద్దునే నిద్రలేస్తే జరిగేవే ఇవి ..!!
Yaaas... I'm a Doctor👩🏻... read more
నాతో నేను
ఎందుకో లేను..
నీకై నేను
మారిపోయాను...
మాయమైన నువ్వు
మరువలేను నేను...
మనిషివైన నువ్వు
మాయచేసే మంత్రమైనావు...!!-
కొత్తగా పుట్టాను అనుకున్నాను గాని
కొత్తగా పుట్టడమేంటే ప్రాణమా
పాతదానివే కదనే నువ్వు ప్రాణమా
పలకరించలేని పరాయి దానివి కాదులే ప్రాణమా
పాతాళంలో పడినా పరుగుతీసి పేరు మార్చుకొని వస్తావే ప్రాణమా
పనిలేని పారిజాతానివే నువ్వు ప్రాణమా...!!-
*అందరాని కొమ్మ ఆడపిల్ల అయితే
అందుకు మిన్నంటని పూల జన్మ
అందమైనదా లేక ఆదిమంత్రమైనదా
అందుకే అందరికి అందను అంటున్నదా...*-
ప్రభుత్వం మరుగున పడినప్పుడే
గోతిలో పాతిపెట్టిన పురోగతిని బైటకి తీసాం
ఇదిగో పరిపాలన చేసాం
పూరి గుడిసెలు పీకి పాలీశుబండలు వేసాం
అంటూ మాటలతో కోతలు కోసి కోటలు కట్టేస్తారు
అందులో ప్రజల్ని కోతుల్లా ఆడిస్తారు
చీదర పుట్టే చాడీలు చెబుతారు
చీమునెత్తురు లేక సావసచ్చిన సామాన్య
ప్రజలేలే అనుకుంటున్నారు.. అంతేగా ..!!-
Your are not invited to please my discomfort’s
Let them go and you can stay as long as u get annoyed-
ఎన్నుకున్నది వెన్నుపోటు పొడిసినప్పుడు
ఎన్నేళ్లు ఏదురు చూసినా ఎనక్కి రారు..!!-
మదిలో ప్రెశ్నలెన్నో మాయం చేసే మందులేదే
హ్రుదిలో హుషారెన్తో పసితననాన్ని పలకరించలేదే
నమ్మకంలో ఆశలెన్నో అనుమతించే తావు లేదే
లక్షణాలను లక్షలిచ్చి కొనుక్కునే కాలంలో మాటల్లేవే..!
-
వెంటాడే జ్ఞాపకాలు
వెయ్యి జన్మలకైన పథిలాలు
వేలుపట్టి నడిపిన దారులు
దరిచేరనివ్వవు దాఖలాలు-
ఈ క్షణం నాదనిపిస్తూ
మరుక్షణం కాదనిపిస్తూ
కన్నవారికి దూరమయ్యే భావాన్ని
కలిసుండబోయే వారికి దెగ్గరయ్యే బంధాన్ని
ఏలా కవ్వించుకొని అడుగెయ్యను
ఏ వెలుగుని చూశానని వాకిలి దాటను
ఏ ధైర్యాన్ని నింపుకొని కొనసాగించను
ఈ క్షణం నాదని
మరుక్షణమే కాదని..!!
-