DivyaVani  
349 Followers · 16 Following

read more
Joined 27 December 2018


read more
Joined 27 December 2018
27 MAR 2021 AT 17:19

భారమైన బ్రతుకుని బదులేదో అడిగాను. బాధగా మూగయింది.
వెచ్చని కన్నీటిని జాలిగా కోరాను. వేగంగా జారుకుంది.
జీవితానికి మొదలెక్కడ? వేదనలకు తుది ఎక్కడ?
నడవలేక కూలుతోంది బ్రతుకు చక్రం.
దారేదో మరిచింది మనసు క్రమం.
వీడలేని బంధాలతో, విలువలేని ప్రేమలతో
నిరంతరం ఒక యుద్ధం.
ఆహుతైన ఆశలకు, ఆపలేని అవసరాలకు
క్షణక్షణం మరో యుద్ధం.
శిఖరానికి చేరాక నేల కోసం వెతుకుతున్నా
మరీచిక మధ్యలో చెమ్మకై తడుముతున్నా
ఆ దాహం తీరదేమో, ఈ దేహం కరుగువరకు.
ఆ నేలను చేరనేమో, ఈ శిఖరం కూలువరకు.


-


28 SEP 2020 AT 12:42

(In Caption)

-


10 SEP 2020 AT 8:15

చావంటే ఒక జీవిని తీసుకుపోవడం మాత్రమే కాదు.
బతికున్న జీవితాల్లో జీవాన్ని మోసుకుపోవడం.

-


2 JUN 2019 AT 17:30

"లేఖ"
(ప్రేమలేఖ_3)

-


31 JAN 2019 AT 20:54

ఊహల తోటలో విహరించే సీతాకోకల గుంపు నేను
వికసించిన పువ్వులలో ఏ పువ్వు నాదో తెలియదాయెను
నా ఊహలకు ఊపిరోస్తూ నా పలుకులకు ప్రాణమిస్తూ
నువ్వొచ్చాకే తెలిసెను
పువ్వుల చాటున గుభాళించిన నవ్వు నువ్వనీ
నే చేరాల్సిన తియ్యని మజిలీ నువ్వేననీ...

ఊయలలో ఊగిసలాడే నా మది ఉప్పెనయ్యావు
ఊహల కారాగారంలో నను బందీ చేసావు
సీతాకోకల గుంపుని ఛిద్రం చేసావు
నిను తలచిన ఊహల ఊపిరి తీసావు
నిను పిలిచిన పలుకుల ప్రాణం తీసావు...

ఏ ఊహ నిజమౌనో
ఏ ఊహ ఊహగానే ఉండిపోవునో
నిను కలవని కలలేక నిను తలవని ఊహ రాక
ఊగిసలాడే హృదయం అదిరె
తొణకిసలాడే కనులే చెదిరే
ఊహాలకే ఊహలొచ్చే
ఆ ఊహలు నను ఉక్కిరిబిక్కిరి చేసే!

-


17 JAN 2019 AT 23:50

నా ఊహల్లోనే ఉన్న నీకు
నీ ఊహల్లోకి కూడా రాని నేను రాస్తున్నా..
మొదటి ప్రేమలేఖ..
(ప్రేమలేఖ_1)

-


6 JAN 2019 AT 14:19

ఆత్మసంతృప్తి కోసం.

ఆకస్మికంగా రాయడం మొదలు పెట్టినా
అనాలోచితంగా మాత్రం రాయడం లేదు..
ఆనందం కోసం రాస్తున్నా కానీ
ఆకర్షణ కోసం కాదు..
అభిలాషగా రాస్తున్నా కానీ
అభినందల కోసం కాదు..
అద్భుతంగా రాయలేకపోవచ్చు కానీ
అర్థం ఉండేలా అర్థం అయ్యేలా రాయగలను.
అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా రాస్తునే ఉండాలనే
ఆశతోనే రాస్తున్నా.. నే రాస్తున్నా..

-


22 JUL 2021 AT 23:14

రాతిరి నాకు రాసే జాబులో నీ తలపెందుకు చేరిందో
పగటికి నేనిచ్చే జవాబులో నీ సడి ఏమైపోయిందో..!

-


14 JUL 2021 AT 19:25

నా జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాల పేజీలని మళ్ళీ తెరిచే ప్రయత్నమిది. ఇంట్రెస్టింగ్ అనిపించేవి ఎంచుకోవడమే కాక ఇంట్రెస్టింగా రాయడం నేర్చుకోవడం కోసం నా తపన ఇది. నచ్చితే చదవండి. బోర్ కొడితే తిట్టుకోండి.

-


10 MAY 2021 AT 23:33

....

-


Fetching DivyaVani Quotes