2 MAY 2019 AT 22:44

గురువు అంటే ప్రశాంత చిత్తం కలవాడు
గురువు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు,
గురువు అంటే మంచి వేషధారణగలవాడు,
గురువు అంటే ఎంతో గౌరవనీయుడు,
గురువు అంటే అత్యంత పవిత్రుడు,
గురువు అంటే బుద్ధిమంతుడు,
గురువు అంటే మంత్రతంత్రములలో నిష్ణాతుడు,
గురువు అంటే నిగ్రహానుగ్రహశక్తుడు
గురువు అంటే సరస్వతీ కటాక్షం కలవాడు
గురువు అంటే జ్ఞాన సంపద కలవాడు
గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి
బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని తన శిష్యులకు అందించేవాడు
భూమి మీద పుట్టిన ప్రతీ జీవికి తల్లియే తొలి గురువు
మన కన్నతల్లిదండ్రులను గురువులను పూజించడం ఆరాధించడం
మన సనాతన హిందూధర్మం యొక్క సాంప్రదాయం
అట్టి గురువులను మనము గౌరవిద్దాం

- సహస్రాక్ష🌷