వేధించే ఓ బాధ..
చినుకులా నను చేరి
సంద్రమై పోయింది
అలలా తీరం దాటి
మళ్ళీ నా చెంతకే వచ్చి చేరుతుంది..
ప్రేమించే ప్రతి గుండె వెనుక
ఓ కన్నీటి వ్యధ ఇదేనేమో..!?— % &-
ఏ మనిషి ఇంకో మనిషికి
పూర్తిగా నచ్చరు.. కానీ
మీలో ఆ నచ్చనిదాన్ని కూడా భరించి,
ప్రేమించే మనిషి ఉంటే మాత్రం..
వదులుకోకండి, అలాంటి ఒక్కరు..
జీవితంలో ఒక్కసారే దొరుకుతారు,
ఒక్కరే అయి ఉంటారు..
తల్లిదండ్రుల తర్వాత.-
నేను సలహా చెప్తాను.. కానీ
నువు వినాలి కదా..!
విన్నది పాటించాలి కదా..!
ఈ మధ్యలో ఎన్ని అడ్డంకులో..!?
నీది..నాది ఒకేలా ఉండదు కదా.. జీవితం
చుట్టూ ఉన్న సమాజం వేరు..!?
చుట్టూ ఉన్న మనసులు వేరు..!?
ఆలోచనలు వేరు.. అన్నీ దాటినా..!!
అది ఎంత వరకు మంచి చేస్తుందో.. మరి
నేను చెప్పింది నువు వినలేదంటే.. ఎలా..??-
కొందరు కొందరిని ఎంత గుడ్డిగా నమ్ముతారు అంటే.. వాళ్లు తమకి చేస్తున్న చెడులో కూడా
మంచిని వెతుకుతూ.. వాళ్ళని మార్చకుండా.. మూర్ఖులుగా తయారు చేస్తుంటారు.
ఒక్క మూర్ఖుడు చాలు..
చుట్టూ ఉన్న మనసులను
మౌనంగా చంపేయడానికి.-
అమ్మ ఐన ప్రతి స్త్రీ..
తల్లి అవుతుందని అనలేము.. కానీ
అమ్మ మనసున్న ఆమె కనకపోయినా..
ఖచ్చితంగా తల్లి అవుతుంది... కానీ
అది గుర్తించే మనసు ఎందరికో?
గుర్తించినా..
అర్దం చేసుకునే హృదయం ఎందరికో?
అర్దం చేసుకున్నా.. ఆదరించే ప్రేమ ఎందరికో?
ఆదరించినా.. అండగా నిలిచేది ఎందరో?
నీడగా చివరి వరకు తోడు వచ్చేది.. ఎందరో??-
గుడికి వెళ్ళటానికి సంతకం పెట్టాల్సిన వాడికి దండ వేస్తే, ఆ గుడినే సంతలో అమ్మకానికి పెట్టాడంట..!!
గిజిగాడు
(వ్యంగ్యం వీడి అస్త్రం)
From
తపస్వి మనోహరం
-
దొరలు మాత్రమే ఉన్న కోటలో..
దొంగ చేతికి మసి అంటిందంటే... నీటికి కరువొచ్చిందంట..!!
- గిజిగాడు
(తపస్వి మనోహరం)
-
దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటే..
ఉచితాలకి అలవాటు పడ్డ ఊరోళ్ళు..
నోర్లు వెళ్ళబెట్టి చూసారంట..!
- గిజిగాడు
-
ఆలోచనలను అదుపు చేయాల్సిన అవసరం లేదు... అన్ని రకాలుగా ఆలోచిస్తేనే.. మంచి చెడూ తెలుస్తుంది.
మంచి ఆలోచన ఆచరణలో పెట్టాలి..
చెడు ఆలోచనల్ని.. మంచిగా ఎలా మార్చాలి అని మళ్ళీ మళ్ళీ ఎక్కువగా ఆలోచించి మార్చుకోవాలి.. అంతే కానీ అదుపు చేయాలని చూస్తే ఇంకా ఎక్కువగా వస్తాయి ఈ ఆలోచనలు.
Be positive... Think different..!-
వాస్తవమైన సద్విమర్శ
నాకెప్పుడూ స్వీకారమే..
సద్విమర్శ చేసి నీలోని ప్రతిభను ప్రదర్శించు..
నాలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దు!!
కువిమర్శ చేసినా సంతసమే నేస్తమా..
నువ్వేమిటో అందరికీ తెలుస్తుంది..
నేనెలా ఉండాలో నాకు అవగతమవుతుంది!!
తప్పును విప్పి చూపు మీరు సద్విమర్శకులైతే..
విమర్శలకు మీరెప్పుడూ తగిన వారే!!-