మన అనుకున్న వాళ్లే మనల్ని చెడుగా అనుకుంటూ, చూస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు
ప్రస్తుతం నా బాధ కూడా అలాంటిదే-
నా భావాలు...
ఎండమావిలో లో సాగే అందమైన నావలు,
వెన్నెల నీడలో నా మది సమాధిపై పూచే మల్లెపూవులు-
ఆ చందమామ నాపై అలిగి దాక్కుంది,
నా చందమామ ధ్యాసలో పడి తనను మరచిపోయాననుకుని...! 😄-
నీలి నింగిలో చందురుని వంటి నీ మోము చూడగ వేచి నేనుంటి
ప్రియతమా.. నీ తలపే నా ప్రాణం.. నీ పిలుపే నా జీవిత గమ్యం-
కలువ కళ్ళ కౌగిలితో కలతలెన్నో రేపినావే
కారుమబ్బు కాటుకతో మనసు మాయ చేసినావే
వాలు కళ్ళ చూపులతో మత్తుమందు జల్లినావే
ఓర కంట కన్నుగీటి నా హృదయం దోచుకుపోయావే...!-
ఎల్లప్పుడూ నీ ధ్యాస లోనే ఉండాలనిపిస్తోంది
కనీసం అలా అయినా నీతో గడిపినట్టు అనిపిస్తుందని...!
పగలు కూడా నిద్రపోవాలనిపిస్తోంది
కనీసం కలలో అయినా నిన్ను చూసే అవకాశం వస్తుందని...!
నీవు నా జీవితంలో లేవన్న క్షణమే మరణించాలనిపిస్తుంది
కనీసం వచ్చే జన్మలోనైనా కలిసి బ్రతికే వరం ఇస్తావని...!-
పగలంతా గుండెమాటు పొరల్లో ❤
రాత్రంతా కనులచాటు అందమైన కలల్లో 💞
కనిపించీ కనిపించకుండా మనసులో అల్లరి చేసే 🥰
వాలుకనుల వయ్యారిభామ, నా మరో చందమామ 🌕
-
కను తెరవని చిన్ని ఆశ కలగానే మిగిలేనా..
నను వదలని నీ తలపు నన్ను రాయి చేసేనా...
నిను మరవని నా మనసు నీ దరిచేర్చేనా...?
కడకు కలలోనైనా?-
మనసులోని భావాలను మనసుకు హత్తుకునేలా చెప్పాలంటే మాతృభాషను మించిన వారధి ఏం ఉంటుంది 🥰
-