పేడ రూపము మారి పిడకగా అయినట్లు
పీడకలగా మారు చెడ్డ తలపు
అట్టి చితలో స్వయము కాలిపోక మునుపె
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
పేడ రూపం మారి పిడకగా మారుతుంది
అలాగే మనకు కలిగే చెడు ఆలోచనలే పీడకలలుగా మారి మనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తాయి
అటువంటి చింతల చితిలో స్వయం కాలిపోకుండా ఉండాలంటే ఓ బ్రహ్మ పుత్రా తక్షణమే మేలుకో...ఓంశాంతి
- Bk universal brother
20 JAN 2020 AT 20:30