దండలకోసమో... దండాల కోసమో... మంచి పనులు చేయకు....నీది విశాల హృదయమనుకుని కప్పిన శాలువాలు ఆనక దండెం మీద ఆరేసుకోడానిక్కూడా పనికిరావని మర్చిపోకు...
-
All my buddies.. take a chill pill, but be aware and beware.. the terrible danger of pandamic is still wandering on our heads, so we still need to ware and ask others to ware masks, covering our mouth and nose.. life is full of action, don't sell it in any auction, for the unexchangable price of death...
-
మంచి నీటిని తాగ అడుగు రోజులు పోయి
మంచి మాటలు కోరు రోజులొచ్చె పాలకుల పోలికలె ప్రజలకబ్బునుకదా నైతికత నూతిలో దూకెనెపుడో-
Dear sangha, happy vijaya dashami to all... శమీ శమయతే పాపే శమీ శతృ వినాశనం అర్జునస్య ధనుర్ధారీ.. రామస్య ప్రియ దర్శనం....cheers, omshanthi
-
కమలమందునబుట్టి
గుడ్లగూబను ఎక్కి
తిరిగేవు నీవంట స్థిరము లేక గుండెలో నక్కేవు
హరి కాళ్ళు నొక్కేవు
సిరి దేవి నీ లీలలెరుగ తరమా...-
Today, i actually
Wanted to cry..
But, when my
Eyes asked
Me...."why"
I downed my head
With shy...
----Poetry-
నిజం కదా.. ఎంత విచిత్రమైన వాళ్ళం మనం మనుషులం... ఈ సృష్టిలోనే ఎక్కడా లేని అతి వింత ప్రాణులం..
అందుతుందో, చెందుతుందో తెలియని చందమామ లో నీటి జాడకై వెతుకుతున్నాము... రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాల గురించి చర్చోపచర్చలతో సరిపెడతాం
సుదూర గ్రహాలపై నివాసముండాలని ఆపసోపాలు పడతాం... పక్కనే ఉన్నా నిలువ నీడలేని బడుగు జీవుల గురించి పట్టించుకోం.. ఆకలికేకలు అంటూ పొలికేకలు పెడతాం.. అవుతున్న ఆహారం వృధా ఊసే ఎత్తం...రాతలూ,కూతలూ,తీతలూ, గీతలు..మాకే వచ్చన్నట్టు, వినేవాళ్ళూ చూసేవాళ్ళూ ఉండాలేగానీ.. మనకొచ్చిన సకల కళలూ పుష్కళంగా ప్రదర్శిస్తాం.. ఆచరణ విషయానికి వస్తే, కర చరణాలు కట్టేసుకు కూర్చుంటాం... మనమంతా ఒక్కటే అంటూనే ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాం.. అంతరించి పోతున్న వన్య ప్రాణుల సంరక్షణకై అలుపెరుగని పోరాటం చేస్తాం.. ఉనికిలో లేకుండా పోతున్న మానవత్వం విలువలను పట్టించుకోం... ఏమంటారు...🤔-
కాలం కళ్ళెం తెంచుకున్న గుర్రంలా పరిగెడుతోంది మనసు గానుగెద్దులా నీ చుట్టూ తిరుగుతోంది
నాకోసం ఒక్క క్షణం ఆగలేకపోయావా... ఆగలేక వెళిపోయావా...
అది సరే...
ఈ గన్నేరు మొక్క నాకోసమే నాటుంచావా...
చావా.. అది నాకు కొత్త కాదులే.. కానీ, ఇప్పుడు మళ్ళీ పుట్టాలి.. ఈలోగా కాయలు కాస్తాయిగా.. అప్పుడు కాకితో కబురంపు.. వచ్చి వాలిపోతాను..కాదు కాదు ... రాలిపోతాను...
-
వాన వెల్లువాయె చెరువాయె ప్రతి సందు
ఇళ్ళలోనూ నీళ్ళు వేసె చిందు
వాహనములు పోయి ప్రాణ నష్టము జరిగె
ఈ కష్టమెన్నాళ్ళు నష్ట పరచు
నీరు లేక ఎండి నీరెక్కువై నిండి
ఫలమీక పొలమంత చింతలాయె
రైతు వెతలుదీర్చ ఎవరి తరమగునిపుడు
కరము వణుకగ కలము ఆగిపోయే-