The mind is lord Muruga's abode.
-
దీక్షలు వద్దు..
నీ అక్షరాలే నా కళ్ళకు వెన్నెల దీపాలు.
నువ్వు నన్ను తిట్టుకుంటూ అయినా సరే
మరికొన్ని మాటలు రాస్తావని ఆశిస్తూ..
-
శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా..అసలు ఇది అంతా ఎందుకు జరిపించావు అని ఆ శివుడ్ని చాలా సార్లు అడిగాను మరి.
కారణం మన ఇద్దరికీ ఎప్పటికీ తెలియదు కనీసం ఆయనకైనా తెలుసా లేదా అని.-
వంద మంది నన్ను మంచిదానివి అంటే కలిగే ఆనందం ముందు..
ఇంత ప్రేమించిన నీ దృష్టిలో నేను తక్కువై పోయాను అనే బాధ ఉంది చూసావూ..
అది రాయటానికి నా మనసు భావం సరిపోదు.
అసలు ఆ బాధను నీకు అర్ధమయ్యేల సరిగా వ్యక్తపరచలేను ఎప్పటికీ.
నాకు తెలిసిన భాషలోని అక్షరాలు సరిపోవు.
I am very sorry నీ మనసుని నా మాటలతో బాధ పెట్టినందుకు. ఇది ఒక్కటే చెప్పగలను.
నువ్వు accept చెయ్యకపోయినా పర్లేదులే. కానీ అలా నీ మనసులో ఏదో ఒక మూల పడేసి ఉంచుతావని తెలుసు.
Take care, keep smiling.
Love you always.. Bangaram 🌹🌹❤️.
-
చాలా మాటలు అన్నాను నిన్ను.
నాకు తెలుసు నేనేమి అన్నానో.
కానీ అది అంతా నా మనసు పడే ఆవేదన. ఎందుకోసమో తెలుసా..
నీ birthday చెప్పవు అని..
మాట్లాడితే నన్ను వదిలి వెళ్లిపోతా అంటావ్ అని..
నీ బాధ ఏమిటో నాకు చెప్పవని..
నిన్ను చూడలేను విడిచి వెళ్లలేను అని..
ఇంకా చాలా చాలా కారణాలు.
నువ్వు పెట్టే దూరానికి నేను ఏమైపోయానో తెలియదు.
నా ప్రేమ గ్రేట్ అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాలి అనుకోలేదు.
ఎక్కువ ప్రేమ చూపించాలి అని అనుకున్నాను.
అది authority లాగ అనిపించింది.
నువ్వు అడిగినప్పుడు నీకు స్పేస్ ఇచ్చి వుండాల్సింది.ఇవ్వకుండా నువ్వే కావాలి అని ఏడ్చాను. అది నేను చేసిన బిగ్ మిస్టేక్.
శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా..అసలు ఇది అంతా ఎందుకు జరిపించావు అని ఆ శివుడ్ని చాలా సార్లు అడిగాను మరి.
కారణం ఆయనకైనా తెలుసా లేదా అని.-
జరిగిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు.
వీలైనంతవరకు అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటాం కానీ..ఎక్కడో ఒక చోట అందరితో కలిసిపోవాల్సి వస్తుంది. అదీ కొన్ని నిముషాలు, గంటలు మాత్రమే. మళ్ళీ ఒంటరి తనం ఆవహిస్తుంది మనసుకు, మనిషికి, ఒక నాకు, ఒక నీకు.కాబట్టి అప్పుడు నీతో చెప్పిన ఊసులు, నీతో ఆడిన ఆటలు, నీతో పాడిన పాటలు, నీతో పంచుకున్న కలలు ఇవే తోడై నీడై నాలో నిండి కాలంతో పాటు నన్ను ఒంటరిని కాదని నడిపిస్తుంటాయి.
ఆ రోజులు మళ్ళీ రావు కానీ నన్ను నా మనసును నీ ఆలోచనల చుట్టూ తిప్పుతుంటాయి.ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియటం లేదు మిత్రమా.
-
ఎన్ని సార్లు పడిపోయా అనే పదం అని ఉంటావ్.
ఆ మాటకి మరింతగా పడిపోయానేమో.
ఈ జన్మకు లేవలేనంతగా..
అసలు ఎందుకు ఇది అంతా?జరిగింది.
కేవలం నా వల్లేనా?-
నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావ్ కదా నాతో..
- " నిజం చెప్పలేదు అలాగని అబద్ధం కూడా చెప్పలేదు" - అని.
What a dialogue it is?
మంచిది.
నిజమే..నేను నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేను.
I mean నాకు అంత తెలివి లేదు.-