భార్గవ చారి   (భార్గవచారి)
27 Followers · 7 Following

Joined 27 February 2018


Joined 27 February 2018

బంధంలో సర్దుకుపోలేకపోతే నువ్వు అన్ని సర్దుకొని వెళ్లడమే మంచిది...!!!

-



నేర్పించే ఈ జీవితం...

నీ చెయ్యి పట్టుకొని నడిపించదు..‌‌..

🖤

-



నీకు ఊహ తెలియని వయసులోనే
కింద మీద పడి లేచి
మరి నడక నేర్చుకున్నావ్...
ఈ వయసులో పడిపోతే అక్కడే
ఎందుకు ఆగిపోతున్నావ్
ఎవరైనా చెయ్యి అందిస్తారనా...

ఇక్కడ హ్యాండ్ ఇవ్వడమే కానీ
నీ చెయ్యి పట్టుకొని ఎవడు నడిపించడు...!!

-



అవకాశం అనేది నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేది కాదు
అది వచ్చినప్పుడు నువ్వు కన్నీళ్లతో ఉన్న కష్టాల్లో ఉన్న దానికి కనికరం ఉండదు....
వచ్చినప్పుడే పట్టుకో....తరువాతే ఏ పనైనా పెట్టుకో....!!!

-



ఈరోజు అలవాటు చేసుకో
రేపు పొరపాటు కాకుండా చూసుకో...!!

-


19 NOV 2024 AT 20:57

నువ్వు ఖాళీ జేబుతో ఉన్న
జాబు లేకుండా ఖాళీగా ఉన్న

ఈ సమాజానికి నీ కుటుంబానికి బరువుగానే
మిగిలిపోతావు..!!!

-


18 NOV 2024 AT 13:17

ఇంకా ఎన్నాళ్ళు ఇలానే బ్రతుకుతావ్
కొన్నాళ్ళు అయినా మంచిగా బ్రతుకు...!!

స్వార్ధం దేనికి అర్ధం లేనిది
పగ దేనికి పనికిరానిది
కోపం దేనికి నిన్ను కాల్చేయడానికి
పంతం దేనికి పట్టించుకోనిది

మనిషిని మనిషిగా ప్రేమించు చూడు తరం గుర్తుపెట్టుకుంటుంది నిన్ను గుండెల్లో.....!!!

-



రాత్రి రెండవుతున్న పడుకోలేదు అంటే నిద్ర రావట్లేదు అని కాదు వాడు అనుకున్నవి అవ్వట్లేదు అని అర్ధం…!
ప్రశాంతంగా పడుకున్నవాడికి
ప్రశ్నలతో పడుకున్నవాడికి చాలా తేడా ఉంది..!!

-


13 SEP 2024 AT 18:38

ఒక మనిషి "మృదువుగా" మారడానికి
అదే మనిషి "మృగంలా" మారడానికి
ఒక్క సిచ్యువేషన్ చాలు బాబాయ్....!

" అన్ని తారుమారు అవుతాయ్... అన్ని తలకిందులుగా మారుతాయ్"...!!

-


12 SEP 2024 AT 22:35

చాలి చాలని అవకాశాలు...
సరిపెట్టుకోలేని జీవితాలు...
సరదాలు లేని సంద్రాలు...
అవసరాలు లేని అందాలు...
అడుగు పడని కాలి నడక...
అడగలేని ఖాళీ జేబు చురక...
దాచి పెట్టలేని కన్నీటి చుక్క....
దాచుకోలేని నెత్తుటి డొక్కా ...
మౌనం అడ్డుకుంటుంది తెలియలేక...
మాట రానంటుంటుంది తెలిసిరాక...!!!

-


Fetching భార్గవ చారి Quotes