శీతకాలం చిలిపి చలి
ఇంచు దూరం తగదు చెలి-
గంగిరెద్దులు మరియు పెళ్లి లో చేసే reception కి దగ్గర పోలికలు ఉన్నాయి అనిపిస్తుంది, ఎలా అంటే
గంగిరెద్దులు అంటే ఎద్దు ని బాగా అలంకరించి, ముస్తాబు చేసి ఇంటిఇంటికి వెళ్లి సన్నాయి వాయించి డబ్బు, బియ్యం, పప్పు, మిరపకాయలు ఇలా ఆ ఇంట్లో వాళ్ళు ఏవి ఇస్తే అవి తీసుకొని వెళ్తారు.
పెళ్లి reception గురించి తెలిసిందే గా అబ్బాయి అమ్మాయి ఇద్దరు బాగా ముస్తాబు అయి ఒక చోట నిలబడుతారు. పైన ఇంటింటికి గంగిరెద్దులు వెళితే ఇక్కడ అదే గంగిరెద్దులు దగ్గరికి అందరూ వచ్చి డబ్బు, బంగారం, వెండి, కంచు ఇస్తారు.-
అరవైయేళ్ళకి వద్దన్నా వస్తుంది ఒంటరితనం.
కానీ పాతికేళ్ళకే వస్తుంది పెళ్లిచేసుకోకుంటే....-
నీ చుట్టూ ఉన్నవాళ్ళ కంటే నీ జీవితం ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా బావుంది అంటే ఆ దేవుడికో, దయ్యానికో కృతజ్ఞత చెప్పి... లేని వాడికి సహాయం చెయ్యాలి...
నీ సంపాదన పెరుగుతున్నట్టే నీ సహాయం కూడా పెరగాలి....
-
అబ్బాయి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళచ్చు...
అమ్మాయి చెప్పి గుడికి కూడా వెళ్ళకూడదు....-