చీర
దీని వల్ల,కేవలం ఆడదాని అందం మాత్రమే పెరగడం కాదు, లోకకళ్యాణం లో ఆడది కట్టిన చీర కూడా, శత్రు నాశనం లో, కీలకం అవుతుంది, కొన్ని సార్లు ఆ చీరే, యుద్ధానికి ఉసిగొల్పుతుంది,అలా అయినవే,రెండు అతిపెద్ద యుధ్ధాలు.
అందులో మొదటిది మహాభారతం, రెండోది రామాయణం.అసలు మహాభారత యుద్ధానికి ఉసిగొల్పిన సంఘటన, ద్రౌపది వస్త్రాపహరణం.ఇక్కడ ద్రౌపది ఎంత ఏడుస్తున్న భర్తలైన పాండవుల సైతం కాపాడలేకపోతారు, కానీ తన ఆలి కి జరిగిన అవమానానికి, సమాధానం , మహాభారత యుద్ధం.యుద్ధానికే కారణం అయింది ఒక చీర.
రెండోది రామాయణం, నాన్న మాట కోసం అన్ని వదిలేసి, అడవులకి వెళ్ళిన రాముని వెంట,వచ్చేసిన సీత తెచ్చుకున్న ఆస్తి,ఒక నార చీర,నార అంటే జనపనార తో నేసిన చీర,ఈ చీర లోనే అంత అందంగా కనిపిస్తుంది, మొదట శూర్పణఖ కి,అదే రామాయణం లో రావణుడి చావు వరకు తీసుకెళ్తుంది,అది లోక కళ్యాణం, అక్కడ సీత అంత అందానికి కారణం, సీత కట్టుకున్న నార చీర,ఇది పరోక్ష కారణం.ఇలా రెండు అతి పెద్ద యుద్ధాలు వెనుక,ఉన్నది ఒక చీర.అలాంటి చరిత్ర కలిగిన, చీర కు,"చీరల దినోత్సవ" శుభాకాంక్షలు.-
అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ,
దీపావళి రోజున,ఒక దీపం వెలిగింది...
born for,film mak... read more
నాయకుడైన,వినాయకుడు.
దేవుడు, అప్పుడప్పుడు భూమి పై జరిగే, మనుషుల వికృత చేష్టలు,ఎంత వరకు మారాయో, చూడ్డానికి ఆకాశం మొత్తం మబ్బులు కమ్మేసుండగా, ఉరుములు మెరుపులు మధ్యన భూలోకంలో అడుగెడుతాడు,ఆ అడుగుపెట్టిన దేవుడు, వినాయకుడు.
ఒంటికి రాసుకున్న సున్నిపిండితో పుడతాడు,పుట్టిన తర్వాత తల పోగొట్టుకుంటాడు, ఏనుగు తలను అతికించుకుంటాడు, పుట్టిన వెంటనే ఇన్ని విఘ్నాలను ఎదుర్కొన్న వాడు, తర్వాత తనే విఘ్నాలను తొలగించే "విఘ్నేశుడు" అయ్యాడు, ఓటమి లో అవమానాలు,గెలిచాక సత్కారాలు ఉంటాయని, చెప్పకనే చెప్పాడు.
ఏనుగు ఏదైనా తొండం తోనే సాధిస్తుంది గానీ తల దించదు,తల దించుకొనే పనులు చేయొద్దని దాని సారాంశం, ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మంలో మోక్షం చూడమని దానర్థం, చెవులు పెద్దగా ఉంటాయి, శ్రధ్ధ గా వినమని దానర్థం,ఉదరం పెద్దది విజ్ఞానం అంత సంపాదించాలని దాని అర్థం.
మట్టి మీదే పుట్టి, మట్టి లోనే మనిషి అంతమవుతాడు అని చెప్పడమే, నిమజ్జనం, దేవుడు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, మేఘం వర్షించి ఆకాశానికి వారధి అవుతుంది.
"పరశురాముడు" తో యుద్ధం లో ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడు, గా మారాడు,ఆ విరిగి పోయిన దంతంతోనే, "మహాభారతాన్ని" రాసాడు,తన లోపాల్ని సైతం, వరంగా మార్చుకుంటాడు, వినాయకుడు.అందుకే,"ఏక దంతాయ వక్రతుండాయ ధీమహి".-
బుడమేరు,మున్నేరు,కన్నీరు.
మన జీవితాలు ముగిసిపోవడానికి, సముద్రాలు ఉప్పొంగి సునామీలు రానక్కర్లేదు, కొండచరియలు విరిగి పడితే చాలు, ఇంకాస్త ముందుకు వెళితే, చిన్న పాటి ఏరు చాలు,ఉప్పొంగితే ఊడిపోయే జీవితాలు మనవి.
అలాంటేరు ఖమ్మాన్ని కమ్మేసిన మున్నేరు, బెజవాడ ని ముంచేసిన, బుడమేరు.
అలా బుడమేరు కొండకోనల్లో పుట్టి, కొల్లేటి లో కలుస్తుంది, అప్పుడప్పుడు పడే వర్షాలకే గుబులెత్తించేది, అయినా బుడమేరు ను తక్కువ అంచనా వేసి,అక్కడే అపార్ట్మెంట్లు కట్టి, తనని వెళ్ళనివ్వకుండా, తనని అడ్డుకట్టు కట్టారు,తన దారి మళ్లించి, ఊర్ల మీద పడింది, చిన్న పెద్ద ముసలి ముతక చూడలే, తొక్కుకుంటూ పోయింది, అడ్డొచ్చినోడిని తనలో కలిపేసికుంటూ పోయింది, కాసులు సంపాదించి అక్కడ నుండి పోయినోళ్ళను వదిలేసింది, వేరే దారి లేక అక్కడే దాక్కొన్న బడుగు జీవితాలను మాత్రం,తనతో లాక్కేళ్ళిపోయింది, అక్కడ కూలిపోయిన బ్రతుకులన్నీ,కూళి పనులుకెళ్ళేవే.
దాచుకున్న సర్టిఫికెట్లు, దోచుకున్న డబ్బులు, రాసుకున్న హామీ పత్రాలు,ఏసుకున్న బట్టలు,ఏమీ మిగల్లేదు,ఉత్త చేతులతో మిగిలిపోయిన, జీవితాలు తప్ప.
ప్రకృతి కన్నా పెద్ద శత్రువు ఏదీ ఉండదు,మనిషి కన్నా నీచమైనది ఏదీ ఉండదు, ప్రకృతి జోలికొస్తే ఏదీ మిగలదు, బుడమేరు మింగేసిన తర్వాత, మిగిలిన కథ ఇదే, ఎప్పటికీ మారని మనిషిని,మింగేయడానికి మరో ఏరు,మరో మారు ఎక్కడో బయలుదేరే ఉంటుంది.-
మాష్టారు.
కేవలం, స్కూల్ కెళ్ళి, పాఠం చెబితేనే, మాష్టారా,
నిజమైన మాష్టారు, అనుక్షణం తన ఆలోచనలతో, సమాజాన్ని దిశా నిర్దేశం చేస్తారు...
కేవలం,సూటు, బూటు,కోటు,ఇవే కాదు,
అత్యంత సాధారణంగా కనిపిస్తూ,మట్టి ని,పుట్ట ని, చెట్టు ని ఎలా ప్రేమించొచ్చో, కేవలం మాటలతో కాదు,చేతలతో చూపించేవారు, నిజమైన మాష్టారు.
వర్షాన్ని, మట్టిని, మొక్కల్ని, ప్రేమించే వారు, శత్రువులను సైతం ప్రేమిస్తారని చెప్పాలంటే, వాటిని నిజంగా, ఎంతలా ప్రేమించుండాలి.
పాఠం చెప్పటం ఈజీ, కానీ జీవిత పాఠాలు చెప్పడం కష్టం,ఈ కోవకి చెందిన వారే, వ్యవసాయ క్షేత్రం కూడా, నాకు బడి లాంటిదే, అని చెప్పే, అత్యంత సాధారణంగా కనిపించే, అసాధారణమైన వ్యక్తి,మా "సుధాకర్ మాష్టారు".
విత్తనాలతో "స్వర్ణాన్ని" పండించొచ్చు, అని నమ్మారు కాబట్టే,తన పండించే విత్తనాలకు, "స్వర్ణాంధ్ర విత్తనాల"ని పేరు పెట్టారు.
అందుకే, "సుధాకర్ మాష్టారు", కేవలం "మాష్టారు" మాత్రమే కాదు, "కెప్టెన్" కూడా...-
తెల్లబోతున్న "తెల్ల బంగారం"
పలుకే బంగారమాయనే,
ఆయనే శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వరస్వామినే,
చేరిన బంగారమా,మా తెల్ల బంగారమా,
మా చీకటి బ్రతుకులో, వెలుగులు తేవమ్మ,...
నీవు శ్రీనివాసుడి,లడ్డూ లో చేరి,ప్రపంచాన్ని ఏలమ్మా,
ఏ మూలనో ములుగుతున్న,మా బ్రతుకులను, ప్రపంచానికి చూపెట్టవమ్మ...
జీడి రైతుల, జీవితాలు తెల్లారేదెపుడమ్మా,తెల్ల బంగారమా, పిక్కలు రాశులు గా పోసి, బంగారాన్ని దోసిట్లో తేవమ్మ,తెల్ల బంగారమా...
నిన్ను ఒడిసి పట్టుకున్నప్పుడు,భగభగ మండే భానుడి వేడికి మాడిన,మా దేహాలకు అంటిన నలుపును, సువర్ణంగా మార్చేయవమ్మ,మా తెల్ల బంగారమా...
ఏడుకొండలు ఎక్కి, వెంకన్న స్వామిని చేరినావు,
ఈ ఏడైన,ధర కొండొక్కితే,ఈ దొర కొండెక్కి, స్వామి దర్శనం చేసుకునేలా చూడవే,మా బంగారమా,మా తెల్ల బంగారమా...-
జై కొడతాం,
మేం హీరోలకు, జై కొడతాం.
మా ఫేవరెట్, సినిమా హీరో లకు, మేం ఫ్లెక్సీలు కడతాం,
మీ పుట్టిన రోజులకు, మేం కేకులు కోస్తాం,
మీ సినిమా రిలీజ్ అయితే, మేం క్లాసులు ఎగ్గొడతాం.
మీ జోలికి వస్తే, ట్విట్టర్ లో నైనా ఫ్యాన్ వార్స్ చేస్తాం,
మీ కోసం మేం రక్తాలు చిందిస్తాం,మా రక్తం అందిస్తాం,మీ కోసం ఏమైనా చేస్తాం,మీ కోసం ఎన్నైనా చేస్తాం.
మీకు కష్టం, వస్తే మేం సినిమా చూసినట్టు చూస్తాం, మేం సినిమా హీరోలం, మీరు సినిమా కొస్తే మాకు డబ్బులు వస్తాయి, మీకు తుఫాను లొస్తే, మాకేం వస్తాయి, మేమేం ఇస్తాం, మేం హీరోలం, సినిమా హీరోలం.-
జై కొడతాం,
మేం హీరోలకు, జై కొడతాం.
మా ఫేవరెట్, సినిమా హీరో లకు, మేం ఫ్లెక్సీలు కడతాం,
మీ పుట్టిన రోజులకు, మేం కేకులు కోస్తాం,
మీ సినిమా రిలీజ్ అయితే, మేం క్లాసులు ఎగ్గొడతాం.
మీ జోలికి వస్తే, ట్విట్టర్ లో నైనా ఫ్యాన్ వార్స్ చేస్తాం,
మీ కోసం మేం రక్తాలు చిందిస్తాం,మా రక్తం అందిస్తాం,మీ కోసం ఏమైనా చేస్తాం,మీ కోసం ఎన్నైనా చేస్తాం.
మీకు కష్టం, వస్తే మేం సినిమా చూసినట్టు చూస్తాం, మేం సినిమా హీరోలం, మీరు సినిమా కొస్తే మాకు డబ్బులు వస్తాయి, మీకు తుఫాను లొస్తే, మాకేం వస్తాయి, మేమేం ఇస్తాం, మేం హీరోలం, సినిమా హీరోలం.-
హ్యాపీ బర్త్ డే పీకే
ఏం చెప్పినా, నీకే,
ఏం చేసినా నీకే,
తన పేరు పీకే,తన తపస్సు నీకే.
ఏం మాట్లాడినా నీకే,
ఏం పోట్లాడినా నీకే,
ఎందుకంటే తన పేరు పీకే,తన ఉషస్సు నీకే.
ఏం సాధించినా నీకే,
ఏం శోధించినా నీకే,
ఎందుకంటే తన పేరు పీకే,తన తేజస్సు నీకే.
పీకే అంటే, రెండు అక్షరాలు కాదురా బోసి డీకే,
పీకే, అంటే ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించిన పవన్ కళ్యాణ్.
హ్యాపీ బర్త్ డే, జనం సేనాని.జన సేనాని.-
బేబీ
ఈ సినిమా గురించి చెప్పాలంటే, ప్రేమ గురించి కాకుండా ఇంకా, ఈ సినిమా లో చూపించిన, చాలా సున్నితమైన అంశాలు గురించి మాట్లాడుతా...
మూగ చెవిటిది అయిన, హీరో తల్లి కి, కొడుకు పై ఉన్న ప్రేమ, నిత్యం త్రాగుబోతు గా ఉన్న తండ్రి కి,తన కూతురు పై ఉన్న ప్రేమ, హీరోయిన్ కి నిత్యం మంచి గురించి చెప్పే తన చిన్నప్పటి స్నేహితురాలు కుసుమ,ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అమాయకత్వం హీరోయిన్ మనస్తత్వం, హీరోయిన్ ని తన అవసరాలకు వాడుకొనే,తన కాలేజీ ఫ్రెండ్స్, అన్నింటికీ మించి వేరే వాళ్ళ ని చూసి, వేరే వాళ్ళలా బ్రతకాలని కోరుకునే హీరోయిన్ మైండ్ సెట్,ఎందరు ప్రక్కన ఉన్న,తన స్నేహితురాలే మారిపోతున్న,తన క్యారెక్టర్ మార్చుకోని కుసుమ, ఇవన్నీ ఇంచుమించు ఫస్ట్ హాఫ్ లోని అంశాలు...
సెకెండ్ హాఫ్, గురించి ఎక్కువగా మాట్లాడను, కేవలం లవ్ స్టోరీ గా ఈ సినిమా ని చూడకండి,ఈ సినిమా నుంచి దర్శకుడు చాలా విషయాలను, సునిశితంగా టచ్ చేసాడు.
బేబీ, ఫస్ట్ హాఫ్ మిస్ అవ్వకండి, మ్యూజిక్ మెయిన్ హైలైట్.-