"నీపై నాకున్న ప్రేమ కడలి అంచున అడుగుల లాంటిది
అలలు చెరిపేసిన గురుతులను నిరూపించ లేదే యే సాక్ష్యం, కాని నీకై వేసినా ఆ అడుగులు మాత్రం నిజం."
_అశోక్.-
"నేనెప్పటికి విముక్తి కోరుకోని కారాగారం నీ కౌగిలి,
స్వతహా బంధి అయ్యాను నీ బిగికౌగిల్ల శిక్షలు అనుభవించ"
- అశోక్.-
"నేను,
తిరిగిరాని నిన్నటి గతంలో నలుగుతున్న నేటిని, ఆదమరచి నవ్వుదామన్న కంటి పొర గుర్తు చేస్తుంది"
_అశోక్.-
"నువ్ చేసే మొట్టమొదటి తప్పేంటో తెలుసా,అయ్యో ఇది నాతో కాదు నాతో కాదని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడమే,
ప్రయత్నించి ఓడిపో తప్పు లేదు మొత్తానికే మొదలెట్టకుండా నాతో కాదని చేతులెత్తేయకు"
_అశోక్.-
*తన నవ్వు
"శీతాకాలం విజృంభించి మంచును ధారాలంగా కురిపిస్తుంటే,
ఓ ఆకులు లేని చెట్టు ఆ మంచు బిందువులను తన కొమ్మ కొమ్మకు కృత్రిమంగా పూయించుకోగా,
ఉదయాన్నే తొలకరి కిరణాలను సింధురా తిలకంగా ప్రతి బిందువు అద్దుకుని
వజ్రంలా మెరుస్తు,ఎంతో తేజోవంతంగా నవ్వుతాయ్'
అంత అందం అంత స్వచ్ఛం తన నవ్వు"
_అశోక్.-
"పికాల కూత లేదని
ముఖం చాటేసిన అడవి పూరెమ్మను
బుజ్జగించ,
చంద్రుడు నిండు పున్నమై వెన్నెలల రాలుతుంటాడు
ఆకు డొప్పల్లో నిలిచి,భానుడొచ్చేవరకు లాలించి ఆవిరైపోతాడు"
_అశోక్-
"గోధూళి వేళ పిల్ల తెమ్మెరలు చల్లగా తాకుతు
వయసు తాలూకు వేడిని రంజింపజేస్తుంటే
ఊహలు బోనులో నుండి విడుదలైన విహాంగాలవలే
తేలుతు ఉంటాయి,
మనసు తొలి చినుకులకు పుట్టుకొచ్చిన ఆరుద్రలవలే
గమ్యమెరుగక తిరుగాడుతుంది"
_అశోక్.-
"రాగి తీగలో ఝరీవేగంలా ప్రవహించే విద్యుత్తులా నిను చేరుతుంది నా ఆలోచన,
నా ఊహా శ్వేతాశ్వమై రెక్కలు కట్టుకు నీ చుట్టే తిరుగుతుంటుంది,
నా కల బీదది కాదు దానికి యే లోటుపాట్లు లేవు"
_అశోక్.-
"పరమతాన్ని గౌరవించలేనివాడు
తన మతాన్ని కూడా మనస్పూర్తిగా ప్రేమించలేడు,
వాడు అవకాశాలకోసం ఎదురుచూస్తాడు మతాన్ని ఎలా వాడుకోవాలో అని,
'మతం నువ్ ఎవరో తెలుపుతుంది
మానవత్వం నువ్ ఏంటో తెలుపుతుంది"
Religion reveals who you are but humanity reveals what you are "
సర్వేజనా సుఖినోభవంతు 🙏
_అశోక్.-
"వసంతం ప్రణయంకూషలకు ఎంతిష్టమో,
నీ నువ్వు కూడాను నాకు అంతిష్టము,
అవి చిగురిస్తున్న ఆకులను చూస్తు విహరిస్తుంటాయ్
నేను నీ చిరుదరహాసాన్ని చూస్తు చిగురిస్తుంట వసంతమునై"
_అశోక్.-