14 JUN 2018 AT 6:57

ఒక నిముషం చాలు ఉసురు పొయ్యటానికి
ఆ ఒక నిముషం కూడా ఎక్కువే ప్రాణం తియ్యటానికి
ఒక నిముషం చాలు ప్రపంచ గతిని మార్చటానికి
ఒక నిముషం చాలు, నిన్ను చరిత్ర పుటల్లోకి ఎక్కించడానికైనా..
చెత్తకుప్పల పాలు చెయ్యడానికైనా...
ఒక నిముషం కూడా ఎక్కువే విశ్వనాశన విస్పోటనకారికి,
సమస్తాన్ని తామసి చెయ్యటానికి
కానీ, ఆ ఒక నిముషంలో చెయ్యగలమా
దుర్భిక్షాన్ని సుభిక్షం
అలాంటి ఒక నిముషం కోసమే నా ఈ నిరీక్షణం

- అపర్ణ@SoNa 💕