వేల పూలతో అలంకరించినా,
వందల మందిని సత్కరించినా,
పదిమందిని నవ్వుతూ పలకరించినా,
వీడ్కోలు ఎప్పటికీ వేడుక కాదు....
చుట్టూ అంతా పోగయ్యి మాటలాడినా,
ఒట్టులెన్నో పెట్టుకొని సెలవని అన్నా,
ఒప్పకోను విడిపోయే క్షణాలని విలపంచినా,
వీడుకోలెప్పుడూ వేదనలో మిగిలి పోవు....-
NISHEEDHILO YE BHAAVAM KANAPADADHU....
ADHI ANNI KALISI MIGILINA NISSHABDAM.....
KAANI ADHI KACHITHAMGA GELUPU ICHINA
SANTHOSHANNI , PRASHANTHATHANO,
LEKAPOTHE ODIPOYINA VEDHANALO DHAAGINA
NITTURPULANO EPPUDU MOSTHUNE UNTUNDHI...-
అదేంటో
నాకున్న భయాలన్నీ...
నాన్నని చూసి భయపడతాయ్...
ఆ మాటల ప్రవాహంలో
ఆవహించిన అనుమానాలన్ని తరలిపోతాయి-
భూదేవికి కష్టమొస్తే వరాహ మూర్తి వచ్చాడనో,
సీతమ్మ చెరలో ఉంటె శ్రీ రాముడు వచ్చాడనో ,
ఇద్దరిని శక్తి హీనుల్లా చూస్తున్నామా??
ఆడతనానికి, అమ్మతనానికి ఆపదోస్తే
అడ్డుగా నిలవడం మగ బాధ్యతని అవతారంగా కదిలారు
ఐనా వారి యువ శరీర సంఘర్షణకి, మనః ఉద్వేగాలకి
అమ్మతనపు సహనానికి నువ్వెంత యోధుడైన సరితూగలవా?
ఆ గౌరవం చూపాలని ఒక్కరోజుతో సరిపెట్టగలవా?-
సిన్నప్పుడు మా మాష్టారు ఏమైతవని అడిగితే
శానా గొప్ప డాటరునైతా.. మీ అందర్ని జూస్తానన్న
పసి వయసు మాటలాయె మంచిగనిపించెనేమో
మొద్దుగ నమ్మేసి మార్కులన్నీ నాకిచ్చినాడు ఆరోజు
ఈరోజు గదే పెద్దాయన కనపడి అడిగినాడనుకో...
కళ్ళు మూసి కథలా జేప్త యవ్వారాన్ని
చదువుకు డాక్టరునైన గాని
బతుకుకు యాక్టరునని
సుక్కల సెలిమి సేస్తా కష్టాల కొలిమి ఆని
సెమట సుక్కల విలువ జూస్తా నూకల సరి కలిమి లేదని
పై సదువుల పోరు వదలక పట్టువట్టిన పథం నాదని-
కదలాడే మనుషులు పోయి
"కథ" లాడే మనుషులొచ్చే....
పగలు ఆడే జనం దాటి
"పగ" లాడే తరాలొచ్చే....
నవతరమో ? కలవరమో??-
Complete red moon
Conversation in call
You made my day
On special eclipse-
That arc formed
At origin of eclipse
Reflected on our lips
Smile for special nature-
అక్షరమే అర్థ శతాబ్దం వెనక్కి వెళ్ళినట్లు
వెలితిగా వెక్కి వెక్కి ఏడుస్తుందేమో....
ఆయన లేడన్న దిగ్భ్రాంతిలో...
తిరిగి రాడన్న పద కరువులో...
తనని కొత్తగా ఆవిష్కరించడన్న ఆవేదనలో...
-
విప్లవాన్ని ఒక పాటలా రాయడం
నిద్రావస్థని తట్టి లేపడం నీ కలానికే సాధ్యం
వేల భావాలు చిన్ని కవితలో నింపడం
పదాల పొదుపు వాడుకకి నువ్వే ఆరాధ్యం
తెలుగు పాటల "సిరి" కి నువ్వే మా "వెన్నెల"
ఈనాటి అమావాస్యకి మాకు అందేదెలా?
జగమంతా కుటుంబం నాది అన్నావ్
జనంతో కలిసి ఎడ్చేశాను...
కన్నుల్లో నీ రూపమే అంటూ ఉంటె
వశమై వింటూ ఉండిపోయాను
జామురాతిరి జాబిలమ్మా అని జోలపాడితే
కలలు కంటూ కునుకేసాను
ప్రయాణాలన్ని నీ పాటలతో నింపుకున్న మాకు
ఇంత త్వరగా విడుకోలు ఇవ్వమంటే వీలుకాదు🥺-