కలము కౌగిలిలో
వికసించిన కలువ తాను.
రాతిగుండెనైనా
రామణీయముగా మార్చు
తేజస్సుడతడు.
మంచినిమించిన
మనస్సు గల, మచ్చ లేని
ఋషి అతడు.
ఆలోచనలను, ఆచరణలో
పెట్టగల అనూత
అద్భుతం అతడు.
ఎదిగి, ఒదిగి
శిష్య ఎదలను గెలుచు
గురువు అతడు.
Dr.బాలకృష్ణ అను పూజ్యులకి
అక్షరాలు అను పూలతో
నేను అల్లిన మాల సరితూగదే..., ఎలా!
-