(వెన్నెల ముత్యాలు)
బదిగిన మనసున పొదిగిన భావము
కదిపేదెవ్వరో! కదిపేదెవ్వరో!
కదలని తీగకు కరిగిన రాగము
కలపేదెవ్వరో! కలపేదెవ్వరో!
కదిపేదెవ్వరో! కలపేదెవ్వరో!
కరగని మనసును, కదలని తీగలు!
హృదయము రాయిగ గళమున రేయిగ
కదలని దీనుని గతి యిక ఎవ్వరో?
నాకైయి ప్రాణము, గానము తానయి
నడిపేదెవ్వరో! నడిపేదెవ్వరో!
కదిపేదెవ్వరో! కలపేదెవ్వరో!
- దేవులపల్లి కృష్ణశాస్త్రి- YQ Telugu
3 JUL 2019 AT 22:55