ఆ కళ్ళకు మాట్లాడటం
వచ్చు అనుకుంటా,
అందుకేనేమో నిశ్శబ్దంలో కూడా
తన శబ్దం కనిపిస్తుంది...
ఎవరికీ కనిపించని తన
భావం నాకు వినిపిస్తుంది...-
7 JUL 2020 AT 10:50
15 JUL 2020 AT 10:44
నాకోసం రావడానికి నీ
పాదాలు అడుగెయ్యవా అని,
నీకోసం రాయడానికి
నా పదాలను
అడుగుతున్నా...-
29 AUG 2020 AT 21:53
చెప్పేంత చేరువలోనే తానున్నా...
తన చూపులు నా మాటను కట్టేసాయి...
తన నవ్వులు నన్ను మౌనంలో కప్పేసాయి...-
14 JUN 2020 AT 16:12
నవ్వడానికి కూడా కష్టపడాలని,
నీ నవ్వు దూరం అయ్యాక తెలిసుకున్నా...-
9 NOV 2020 AT 19:09
ఎంత గాలించినా నాలో నేను
దొరకడంలేదు నాకు నేను...
మనసు మౌనరాగం నేర్చుకుంటూ
జ్ఞాపకం ఒంటరితనం మోసుకుంటూ
దూరం చేస్తున్నాయి నన్ను నాకు..
నాకోసం నేను ఎంత అరిచినా
నాకు నేను వినపడనంతగా....
నాలోని నేను ఎంత వెతికినా
నాకు నేను కనపడనంతగా...-