మనసుకందని భాషనో
మూగబోయిన ఆశనో
కంచికి చేరని కథనో
కరుణ తాకని కవితనో
మరచిపోయిన బాసనో
మిగిలిపోయిన బాధనో
ఎవరినో...నేనెవరినో ...
— % &-
కంటికి కునుకు కరువాయే
కడుపుకు మెతుకు దిగదాయే
మనిషికి బతుకు బరువాయే
మనసుకు మమత మరుపాయే— % &-
నీవు లేని కాలమున
ఘడియైనా మనలేను.
నిను కాంచని కలను
ఒకటైన కనలేను.
నువ్వంటే ఇష్టమని
నీతోనూ అనలేను.
-
నా అరచేతి రేఖల్లో
నీ చిరునవ్వు రూపు చూస్తున్నా
మూసిన నా పిడికిలిలో
నీవు వదిలెళ్లిన భారం మోస్తున్నా
నిశ్శబ్దం పలికే శబ్దంలో
స్తబ్ధమైన నీ అడుగుల సవ్వడి వింటున్నా.
ఎదురుగా నిలబడి నిను చూడకున్నా,
నా ఎద లోతుల్లో జ్ఞాపకంలా నిను దాచుకున్నా
కలవని తీరాలమని తెలిసున్నా
కనులలో నిను నింపుకుని బ్రతికేస్తూ ఉన్నా
తొలి ప్రేమ తమకములో, తనువంతా మనసై
మధురానుభూతిలో మళ్లీ మళ్లీ జన్మిస్తున్నా.
-
నీ కౌగిలిలో బందీనై
నన్ను నేను పొందాలని ఉంది
కనులలో నిను నింపుకుని
నన్ను నేను చూడాలని ఉంది
నా కణ కణము నీ స్పర్శను పొంది
మళ్లీ జీవం పొందాలని ఉంది
నీ ప్రేమను పొందు రాధనగుటకు
మళ్లీ మళ్లీ జన్మించాలని ఉంది.
-
శిథిలమైన తలపులలో
శూన్యమైన వలపు కథ
దరికి రాదు, దూరమవదు
అంతులేని బతుకు వ్యథ
-
మానిన గాయపు మచ్చల్లే నువ్వున్నా,
బుగ్గన పెండ్లి చుక్కల్లే నిను చూస్తున్నా.
-
మనసు లోతుల్లో నుండి ఉద్వేగాలను
వెలికి తీసి, నీ కోసం మళ్ళీ
3 పంక్తులు రాయాలని ఉంది.
(....మిగతాది తెలియాలంటే, caption చదవండే)
-
అడుగడుగునా అసురులే ప్రతి చోటా
కుళ్ళి పోయిన హృదయాలే బాటంతా
అంతా నా భ్రమేనని కళ్ళు మూసుకోనా
జ్వలించే తృష్ణతో మనిషికై వెదకనా
బద్దలైన గుండె ముక్కలేరుకోనా
కొత్త గుండెకై అన్వేషణ మొదలెట్టనా
సహనం ఆవిరైంది భగవంతుడా
వీలైతే ఒక్క మనిషిని చూపించు
లేదా నాకై మరో లోకాన్ని సృష్టించు..
-
అప్పుడెప్పుడో గుండె చప్పుడు
నిను హత్తుకున్నప్పుడు
గుర్తు చేస్తుంది
నేను ఇంకా బ్రతికే ఉన్నానని
-