ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో
ఆ మురళిది, నీ అధరాలు మాటున
స్వరమై పలికింది....
ఏ నోము చేసుకుందో
ఆ పింఛము, నీ శిరస్సు మీద
నీ గుర్తుగా వెలిసింది...
ఎంత భాగ్యమో
ఆ కాలియాది, ఆ మడుగులో
నీ అడుగుల విలాసానికి వేదికైంది...
ఎంత ధన్యమో నా
ఈ జన్మ, నిన్ను కీర్తింపగా
నీకు అంకితమైంది...-
అనగనగా ఒకరోజు...
సూర్యుని నుండి భువికి వచ్చిన
రవికిరణాల చప్పుడు విన్న
ప్రకృతి తెల్లారిందని లేచింది....
మేఘాల్లో నిర్భందమైన
ఆవిరి చూస్తూ చూస్తూ చినుకుగా
జారి నేలలోపలి మొక్కను లేపింది....
గగనవీధిన గంతులాడే రవికాంతి
భువిసీమకు కదలాడే చినుకుని ముద్దాడి
ప్రేమ హరివిల్లును నిలిపింది...
పొద్దుపోగా,
పశ్చిమాన పోయే అవిని చూసిన ప్రకృతి,
చీకటి వేళన వలస పోయి
చంద్రుణ్ణి తీసుకొని రాగా,
వెన్నెల బాటసారికి ఆసరాగా నిలిచింది...
-
నీవు
కానలకు కదిలిన ఆ తరుణం
కోసలన కోకిల కూడా మూగబోయిన వైనం
కైక మాత ఆదేశం
కన్నీళ్లు పెట్టుకుంది ఆ దేశం
అగ్రజ వెంట లక్ష్మణ బాట
పతి మాట సతి కోట
రాజు కావాల్సినవాడివి
రాజ్యాన్నే వదిలావే
ఆ దరహాసంతోనే
వనవాసానికి కదిలావే
ధర్మం అంటే ఇంత పిచ్చి ఎందుకయ్యా నీకు..
"అందుకేనేమో
నువ్వు మనిషివైనా మనీషివనుకుంటున్నాం
నీ కష్టాల్ని కూడా కావ్యంగా
చదువుకుంటున్నాం"
-
🔥నేనవుతా✍️
నేనవుతానొక శబ్ధం
ఇసుకరేణువులోనైనా
తుఫాను హోరు వినిపించేంత...
నేనవుతానొక యుద్ధం
బడుగు జాతుల
అడుగు జాడలు ఆయుధమయ్యేంత...
(శీర్షికలో చదవగలరు)
-
దశ రూప ధూర్త సంహార అయమేవ,
దశ కంఠ వధ కోదండ ధారి అయమేవ,
నవనీత చోర గోపాల గోవర్ధన ధారి అయమేవ,
జలజ నయన భూపాల అవనీధర అయమేవ,
క్షీర కడలి మథన సమతుల్య గిరిధార అయమేవ,
క్షత్రియ శిక్ష శిష్ట రక్షక విద్యుధభి ధారి అయమేవ,
విస్తీర్ణ విశ్వాస విశ్వాల విలాస ఆస్య ధారి అయమేవ...🙏
-