QUOTES ON #VENKATESWARA

#venkateswara quotes

Trending | Latest
14 MAR 2020 AT 7:50

Hey Govind,
I am always edging over
the cliffs of disturbing
thoughts.
Let me concentrate
on self-development
and let me be conscious
about time and life.
Be my strength
and bless
me with great
energy in
this journey of life.

-


21 MAR 2020 AT 7:05

Hey Govind,
I have been pushed into
situations to experience
both joy and loss,
suffering and caring,
responsibility and freedom.
It makes me a dope.
Please bless me with
clear thoughts and let me
concentrate on my life by
worshipping you.
Please show mercy on us.
Let you be my protector.

-


19 OCT 2019 AT 18:53

ఎక్కడ నీవు ఎక్కడ నేను
ఒక చేతిని శంఖము మరొక చేతిని చక్రము
వక్ష స్థలమున లక్ష్మీ స్వరూపములు
తలువగనే కరుణన్ నాకు దర్శనమిచ్చిన
వెంకట రమణా గోవిందా
నీకు దండాల్సామీ
నీకు వేల వేల దండాల్సామీ

-


11 APR 2020 AT 7:41

అంతరాత్మ అలసిపోతున్నది
ఒడలు డస్సిపోతున్నది
అంతర్యామీ అలమేలుమంగపతీ
మనస్సు నీ శరణు కోరుతోంది
అజ్ఞానము తొలగించి
నీ భక్తే జ్ఞానముగా
ముందుకు నడిపించు
నీ నామ స్మరణతో
శక్తిని పొందేలా చేయి
వెంకట రమణ సంకట హరణ
ఏడు కొండల వాడా వెంకట రమణా
గోవిందా గోవిందా రక్ష రక్ష అని ఆర్తితో
పిలుస్తున్నాను
కరుణించు వేంకటేశ్వర స్వామీ!

-


29 FEB 2020 AT 8:07

ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా
వడ్డీ కాసుల వాడా వెంకట రమణా
గోవిందా గోవిందా అని ఎలుగెత్తి పిలిచాము
మొసలి బారిన పడిన
గజరాజును కావగ
పరుగుపరుగున వచ్చితివట
అను క్షణమూ కబళించుతూ
జాడ్యము బాధించుచున్నది
దాని బారి నుండి
మమ్ముల కావగ వేగిరము రావలె
ఆపద్బాంధవా శ్రీమన్నారాయణ మూర్తి!

-


2 MAY 2020 AT 9:58

కో అంటే కొండ మీద నుంచి
పలికే కోనేటిరాయ
మమ్ము కాయవయ్యా
వెంకట రమణ సామీ

-


4 APR 2020 AT 0:57

అలిమేలుమంగ హరి అంతరంగ
నీవైనా స్వామికి చెప్పమ్మా
ఈ దీనుల గోడు వినమని
ఆపద మ్రొక్కుల వాడికి
చెప్పమ్మా
మా ఆపదలు తీర్చమని
ఆశ్రిత మందారుడు
అనాథ రక్షకుడు
అయిన శ్రీనివాసునికి
చెప్పమ్మా
మమ్ముల కరుణించి కావుమని
దరిశనమొసంగి ధన్యుల చేయమని

-


7 MAR 2020 AT 7:18

వేంకటేశా వేదనల నుండి
విముక్తినీయవయా
శ్రీనివాసా చికాకులు
తొలగించవయా
ఆపద్బాంధవా
ఆదుకోవయా
ఏడుకొండల వాడా
వెంకట రమణా
నిత్యము నిను సేవించు
నిర్మలమైన భక్తి ఒసగరా!

-


22 FEB 2020 AT 7:29

విష్ణు జనార్ధనా
పద్మనాభ ప్రజాపతి చక్రధరా
త్రివిక్రమా నారాయణా శ్రీధరా
గోవిందా మధుసూదనా
జలశాయి వరాహా
నరసింహా వామనా
రఘునందనా మాధవా కేశవా
అని శ్రీహరి దివ్య నామములు
నమ్మి పలికితి
మమ్ముల వ్యాధుల దుఃఖముల
బాధల నుండి
విముక్తి చేయరా
శ్రీమన్నారాయణా!

-