ఈ తపనేంటో ఎరుకవ్వదు
నీ కోసమే ఈ ఆరటమని తెలుస్తోంది,
ఈ విరహమేంటో ఇంత చేదు
నీ కౌగిళ్ళకై వేచి చూస్తోంది..!
హద్దులులేని ప్రేమను దాచే
నీ గుండె జాడ తెలీక,
మనసుని ముల్లోకాలుగా తలుస్తూ
ఈ ప్రేమేంటో పిచ్చిగా పరిగెడుతోంది..!
నిరీక్షణ ఇంక చాలంటూ,
దాగుడుమూతల ఆగడాలు తగదంటూ,
పున్నమి రాకకి సముద్రుడి తుళ్ళింతలా,
మనకోసం కాచే వెన్నెలకై
చకోరంలా నా ఈ ఎదురుచూపులు..!!-
ఊరించే ఆశలే వెన్నుతడుతూండగా...
నిశీధిలో జాబిలి వెలుగే స్వాంతనివ్వగా...
కటిక చీకటేళ తారలే కన్నుల్లో కాంతులు నింపగా...
ఇంతకన్నా చక్కనైన సందర్భమేముంది?
చిక్కటి నలుపులోనూ చక్కటి తెలుపు ఛాయలు కానొస్తూ,
కలల సంతోషాలెంట పరిగెట్టే ప్రోత్సాహమే ఇవ్వగా...
సాకారం చేసుకునే దిశలో పయనమే మొదలెట్టే,
స్ఫూర్తి ఆత్మవిశ్వాసాలే సొంతమవ్వగా...
ఇంతకన్నా అందమైన క్షణమేమున్నది ఇక నాకైనా నీకైనా..!!-
వినాలని ఆశ పడినవి నా చెవులు,
తెల్లవారుజామున కోకిల కుహూ కుహూలతో, పక్షుల కిలకిలలతో మొదలవ్వాలని ఆతృతపడినది నా మనసు,
తుమ్మెదలు పువ్వులపై వాలి ఆనందంతో నాట్యము
ఆడుతుంటే తిలకించాలని ఆశ పడినవి నా నయనాలు...
ప్చ్! నా ఆశలను నిజం చేస్తూ, నిజం అనే భ్రమలో
కృత్రిమం అనే వలలో నన్ను చిక్కించటానికి వచ్చి చేరింది
చరవాణి నా చేతిలో...
నా నయనాల ఆశ వాల్ పేపర్ రూపంలో
నా మనసు ఆశ అలారం రింగ్టోన్ రూపంలో
నా చెవుల ఆశను వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులో శుభోదయం ఫార్వాడెడ్ వీడియో రూపంలో తీర్చేసింది నా చరవాణి.-
వెన్నెల వాకిట రాలిన పారిజాత పదములతో
ఆ మెరిసే తారలకు, ఈ శ్వేతవర్ణపు
ముత్యములకు తీసిపోని మన తెలుగు
అక్షరములను పారిజాత పదములుగా
తీర్చిదిద్ది నీపై నా హృదయ మందిరాన
వెలసిన ప్రేమను తెలియచెప్పుటకై
రాస్తున్నాను ఈ కవనపు ప్రేమలేఖని, అందుకో
ఓ నా సుపరిచితమైన అపరిచిత ప్రవరాఖ్య!-
మబ్బులు కన్నీరు కారుస్తూ వాటి గుండెల్లోన బాధ తీర్చుకుంటుంటే, సూర్యుడు తన వెచ్చని కిరణాలతో మబ్బులను స్మృసిస్తూ ఇంకా చాలు ఏడవద్దు అంటూ బుజ్జగిస్తుంటే, అది చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వటం జీవుల వంతు అయ్యింది...
-
పుట్టిన మరుక్షణమే పరిచయం అవుతాయి
బాధలో ఆనందంలో తోడుగా నిలుస్తాయి
కడదాకా వెన్నంటే ఉంటాయి
కన్నీరు-
ప్రపంచాన్నే మర్చిపోయి, మన ప్రేమతో
ఒక చిన్ని ప్రపంచాన్ని నిర్మించుకొని,
నీతో ఆనందవిహారం చేయాలని,
ఎదురు చూస్తున్నా నీ నేను నా నీకోసం
(ఉపశీర్షికలో👇)-
బాధ వచ్చినప్పుడు కార్చే కన్నీటికి కళ్ళు
ఉబ్బిపోయి నొప్పులు కూడా వస్తాయి...
అంతలా కన్నీరు కార్చే శక్తిని ఇచ్చిన ఆ తండ్రి
ఎందుకో ఆ బాధను చిరునవ్వుతో స్వీకరించి
ఎదుర్కొనే శక్తిని ఇవ్వటం మరిచాడు.-