QUOTES ON #RRBTELUGU

#rrbtelugu quotes

Trending | Latest
27 OCT 2017 AT 12:07

తరలుతున్న స్వప్నమా,
కదులుతున్న
పసిడి శృంగారమా,
ఆ మంచుకొండల దరిలో
కాంతించు సూర్య కిరణమా,
మదినేలు ప్రకాశమా
జలతారువై మెరిసే మేనులా,
మదినేలే మేని మయూరమా
అనంత వాహినిలా
పరవళ్ళు త్రొక్కే మనోల్లాసమా,
నిసర్గ దేవతవై విరాజిల్లు
సుప్రభాతమా,
తెల్లని మంచంతయూ
బంగారు రష్మిలా కనబడుతున్నాయి
నా అక్షులదేమి అదృష్టం!!!
కనువిందు కలిగినది కదా
ఈ దివ్యకాంతులు గాంచి!!!

-


20 MAR 2020 AT 11:21

స్పందించే మనసు ఉండడం
ఆనందించే వైశిష్ట్యత కలగడం
భావాలకు భవ్యతను ఇవ్వగలగడం

-


14 APR 2020 AT 23:52

అంతరంగంలో అపురూపంగా అమరాను
బహిరంగంలో అందాన్ని తెలుపుతాను
అస్తిత్వానికి నిదర్శనంగా ఉన్నాను
అన్నింటికి ఆధారమైన రూపం నేను

-


31 JAN 2019 AT 20:27

వలపుల దోవలో దాగుంది నీ శ్వాస
కలతల దాడిలో విజృంభించెడి నీ రుస
ఏకాంత తన్మయంలో తలయూచుల నీ ఆశ
ఎన లేని వ్యథల మధ్య విదీర్ణించిన మదిలో నీ వలస
భవ్య సౌందర్యానికి దాసోహమందిచిన రంజనములో నీ బస
ప్రతికూల డోలనముచే నలిగిన అతిరేకములో నీ గస
సుఖాల చిందులలో లంగరు వేసిన నీ జలస
దు:ఖాల వంపులలో పూనుకు పోయెడి నీ కస
పరవశాల పరువములో కమ్ముకున్న నీ ధ్యాస
పరితాపాల ప్రవాహములో కంపించె నీ దశ
ఏమని చెప్పను ఓ ఊహ నీ ఉరవడిలో మనసు బానిస

-


8 DEC 2018 AT 9:47


మనస్సు పలికిన పలుకులకు తానం వేయాలి
సహనానికి అద్దం పట్టాలి
కోపానికి తాళాలు వేయాలి
ఆత్మస్ధైర్యాన్ని స్థిర పరచాలి
కలల వాహినిని సాక్షాత్కారం చేయాలి

-


10 JAN 2019 AT 10:23

చారెడు కన్నుల సొగసులు
బారెడు వలపుల గారడి చేసి
పారెడి మనసుకు గాలం వేసి
ఊరెడి ఆశలకు చేతనమిచ్చి
రేపెడి తొలకరి తలపులతో కైపెక్కించి
దూకెడి కేరింతలలో అంబరమందించి
జారెడి పరువాలను మధువని చేసి
విరిసెడి పువ్వుపై వాలెడి తుమ్మెద చేసితివే💖

-


18 JAN 2019 AT 9:42

పలుకని భావాలకు ప్రాణం పోస్తాను
యదలో సవ్వడికి రాగాలాపన చేస్తాను
తలంపుల ధారలో దాగుడుమూతలాడి చిందులు వేస్తాను
గంభీరమైన మది సంద్రంలో ధీర సమీరము నేనవుతాను
నీ చిటికెన వ్రేలు పట్టుకుని, ఏడడుగులు నడిచి, ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూపిస్తాను
మరి జంట పిట్టవై నా గూడు చేరెదవా అనూహ్య మాలిక, మనసాశించే అందాల మల్లిక

-


8 JUN 2019 AT 10:37

కోడాలి ఆంజనేయులుగారి ప్రేరణతో ఆయన వ్రాసిన చినుకు చినుకుగ చేర్చి పెట్టిన అనే కవిత్వం యొక్క మొదటి పంక్తిని ఉపయోగించి వ్రాసిన నా కవిత్వం

చినుకు చినుకుగ చేర్చి పెట్టిన
చురుకు చురుకుగ పారదు ఈ ధేన
చటచటమని వ్యర్థము చేసిన
చర్రున చర్రున క్షీణిస్తుంది జలమైన

టప్పుటప్పుమని చెట్లు కూలిన
టక్కుటక్కున జలం ఇంకింది భూమిలోన
బిరబిర కురవదుగ వాన
గుప్పుగుప్పున ఏడ్చిన తీరదు మన తృష్ణ

చకచక మేలుకొందాం ఇకనైన
టకటక చేద్దాం యోచన
చిటపట చినుకులకు ఇద్దాం స్పందన
కళకళ మెరిసే ఎదురుకాలానికది దశన

-


7 SEP 2018 AT 11:00

ఏదో మంచి జరిగిందని భ్రమ పడుతున్నారా ప్రజలు!!!! ???
కాలంతో పాటు నిజం తానే తెలుస్తుందేమో!!!
లేని స్వేచ్ఛలను చవి చూసే జనాలు, పిచ్చిమాలోకాల వలే విచ్చలవిడిగా అతి వ్యవహారాలకు లోనవరన్న నమ్మకమేమిటో ??!!
మరి ఈ క్రొత్త నిబంధనల ఆనందాలేమిటో అని వాపోవడం తప్ప చేయగలిగేదేముంది...

-


16 JUL 2019 AT 11:37

నా మనసుకు చాలా నచ్చిన రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిన ఏదేశమేగిన గేయము స్పూర్తిగా

ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
ఏ పాటను విన్నా, రాగాలెన్ని వినికిడిన
భరతమాత గొంతుకు వేరేది సాటి లేదురా

-