"Age eventually humiliates you", I thought.I was wrong.It only humbles you! -
"Age eventually humiliates you", I thought.I was wrong.It only humbles you!
-
వాలి పుట్టాడు వేటగాడిలా,ప్రాణం తీశాడు, ఆనాటి రాముడిలా.కురుక్షేత్రాన్నే గెలిపించిన కృష్ణుడు,కూలిపోయాడు సామాన్య జీవిలా!రామాయణమో, భారతమో,కల్లా కపటం నిలవుండే కలియుగమో...కాలమేదయినా కర్మ వదలదు,నీది నీకిచ్చేదాకా అలసిపోదు! -
వాలి పుట్టాడు వేటగాడిలా,ప్రాణం తీశాడు, ఆనాటి రాముడిలా.కురుక్షేత్రాన్నే గెలిపించిన కృష్ణుడు,కూలిపోయాడు సామాన్య జీవిలా!రామాయణమో, భారతమో,కల్లా కపటం నిలవుండే కలియుగమో...కాలమేదయినా కర్మ వదలదు,నీది నీకిచ్చేదాకా అలసిపోదు!
అనగనగా ఒక జీవిఎగురుకుంటూ వెళ్ళింది,మెత్తగా ఉన్నదనిసీత కోకపై వాలింది!మేనులోని అందాన్ని,చీరలోని రంగుల్ని,అరువిమ్మని అడిగింది,ఆ జీవి అవనిజని!కాదనలేని సీత,సరేలే పొమ్మంది..ఆ జీవి కాస్తా,సీతాకోక చిలుకలా మారింది! -
అనగనగా ఒక జీవిఎగురుకుంటూ వెళ్ళింది,మెత్తగా ఉన్నదనిసీత కోకపై వాలింది!మేనులోని అందాన్ని,చీరలోని రంగుల్ని,అరువిమ్మని అడిగింది,ఆ జీవి అవనిజని!కాదనలేని సీత,సరేలే పొమ్మంది..ఆ జీవి కాస్తా,సీతాకోక చిలుకలా మారింది!
ఆది, అంతం, లేని దీన్ని,సెకనులతో కొలవడం ఏంటో..నిజానికి గడిచిపోతున్నది సమయం కాదు,నీ జీవితం ! -
ఆది, అంతం, లేని దీన్ని,సెకనులతో కొలవడం ఏంటో..నిజానికి గడిచిపోతున్నది సమయం కాదు,నీ జీవితం !
అల అందంగావుందని ఆనందిస్తున్నావా?నీ కాళ్ళని తాకినట్టే తాకి,వాటికింద ఉన్న ఇసుకను తీసుకెళ్ళిపోయింది.గమనించావా?జీవితం నీ నుండీ ఏంతీసుకెళ్ళినా..నీ ధ్యాస పోగొట్టుకున్నదాని మీద కాదు,నీ ముందు అందంగా నిలబడివున్న భవిష్యత్తు మీద పెట్టు!ఎలా అయితేఆ అలల్ని చూస్తూ ఉండిపోయావో..అలా! -
అల అందంగావుందని ఆనందిస్తున్నావా?నీ కాళ్ళని తాకినట్టే తాకి,వాటికింద ఉన్న ఇసుకను తీసుకెళ్ళిపోయింది.గమనించావా?జీవితం నీ నుండీ ఏంతీసుకెళ్ళినా..నీ ధ్యాస పోగొట్టుకున్నదాని మీద కాదు,నీ ముందు అందంగా నిలబడివున్న భవిష్యత్తు మీద పెట్టు!ఎలా అయితేఆ అలల్ని చూస్తూ ఉండిపోయావో..అలా!
నిన్న, ఈరోజు కోసం...ఈరోజు, రేపటి కోసం.ఇలా ప్రతీ రోజూ,నువు కలగనే రోజు కోసం గడిపేస్తే..గడిచిన రోజుల్లో,ఏ రోజూ నీకు గుర్తుండదు...నువు గడిపేసిన సమయం,ఏం చేసినా తిరిగిరాదు! -
నిన్న, ఈరోజు కోసం...ఈరోజు, రేపటి కోసం.ఇలా ప్రతీ రోజూ,నువు కలగనే రోజు కోసం గడిపేస్తే..గడిచిన రోజుల్లో,ఏ రోజూ నీకు గుర్తుండదు...నువు గడిపేసిన సమయం,ఏం చేసినా తిరిగిరాదు!
అందమయిన చందమామ ఆకాశంలోనే ఉన్నదని,బువ్వ తినలేదు బాల రాముడు, తన చెంతకది రాలేదని !'అద్దంలో చూడు, నీ ముందే వుంది' అంటే,చప్పట్లు కొట్టాడు చిన్ని రాముడు..చంద్రుడే తన చేతికి చిక్కాడని,సంబరపడిపోయాడు బాల రాముడు!విధితో చేసే యుధ్ధాలు, మొదలవ్వని సమయమది..కాలం తెచ్చే కష్టాలు, కానరాని బాల్యమది.బాల రాముడేగా, ఆనంద రాముడు...ఇంటికి దూరమయి, ఇన్నాళ్ళకు చేరాడు! -
అందమయిన చందమామ ఆకాశంలోనే ఉన్నదని,బువ్వ తినలేదు బాల రాముడు, తన చెంతకది రాలేదని !'అద్దంలో చూడు, నీ ముందే వుంది' అంటే,చప్పట్లు కొట్టాడు చిన్ని రాముడు..చంద్రుడే తన చేతికి చిక్కాడని,సంబరపడిపోయాడు బాల రాముడు!విధితో చేసే యుధ్ధాలు, మొదలవ్వని సమయమది..కాలం తెచ్చే కష్టాలు, కానరాని బాల్యమది.బాల రాముడేగా, ఆనంద రాముడు...ఇంటికి దూరమయి, ఇన్నాళ్ళకు చేరాడు!
వేదపాండిత్యాలను చదివాడు రావణుడు.వాటి సారం మాత్రం గ్రహించింది, రాముడు!రావణుడు, సీతను సొంతం చేసుకుంటే చాలనుకున్నాడు ...రాముడు మాత్రమే, సీతనుగెలవాలనుకున్నాడు,గెలిచిన తర్వాతేపొందాలనుకున్నాడు! -
వేదపాండిత్యాలను చదివాడు రావణుడు.వాటి సారం మాత్రం గ్రహించింది, రాముడు!రావణుడు, సీతను సొంతం చేసుకుంటే చాలనుకున్నాడు ...రాముడు మాత్రమే, సీతనుగెలవాలనుకున్నాడు,గెలిచిన తర్వాతేపొందాలనుకున్నాడు!
They were called 'Witches' then.They are called 'Bitches' now.But what they really are,are merely women,speaking their mind ! -
They were called 'Witches' then.They are called 'Bitches' now.But what they really are,are merely women,speaking their mind !
ద్రుపదుని కూతురని ద్రౌపది అన్నారు,యజ్ఞం నుండీ పుట్టానని యజ్ఞసేని అన్నారు.నల్లగా ఉన్నందుకు'కృష్ణా' అని పిలిచారు,నాది పాంచాల దేశమనిపాంచాలిని చేసారు.నన్ను నన్నుగా గుర్తించేదెవరు?గుర్తిస్తే, వారి నుండీ వచ్చేది, ఏ పేరు ? -
ద్రుపదుని కూతురని ద్రౌపది అన్నారు,యజ్ఞం నుండీ పుట్టానని యజ్ఞసేని అన్నారు.నల్లగా ఉన్నందుకు'కృష్ణా' అని పిలిచారు,నాది పాంచాల దేశమనిపాంచాలిని చేసారు.నన్ను నన్నుగా గుర్తించేదెవరు?గుర్తిస్తే, వారి నుండీ వచ్చేది, ఏ పేరు ?